కేసీఆర్: తెలంగాణ ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ టీకా - Newsreel

ఫొటో సోర్స్, Telangana CMO
తెలంగాణ ప్రజలందరికీ కరోనావైరస్ వ్యాక్సీన్ ఉచితంగా అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను సమీక్షించిన ఆయన 18 ఏళ్లు దాటిని అందరికీ ఉచితంగా వ్యాక్సీన్ వేయనున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు అందరూ కలిపి సుమారు 4 కోట్ల మంది ఉంటారని, వీరందరికీ టీకా వేయడానికి రూ. 2,500 కోట్ల వరకు ఖర్చవుతుందని అన్నారు.
ఇప్పటికే 35 లక్షల మందికి టీకాలు వేసినట్లు చెప్పారు.
రాష్ట్రంలో ఆక్సిజన్, రెమ్‌డెసివర్ కొరత రాకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Ani
ఆక్సిజన్ సంబంధిత పరికరాల దిగుమతులపై 3 నెలల పాటు పన్ను మినహాయింపు: మోదీ
దేశంలోని ఆసుపత్రులలో ఆక్సిజన్ లభ్యత పెంచేందుకు చేపడుతున్న చర్యలను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా గత రెండు రోజులుగా కోవిడ్ రోగులు మరణిస్తుండడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.
మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా వేగవంతం చేయాలని.. ఆసుపత్రులు, ఇళ్లలో రోగులు ఆక్సిజన్ పెట్టుకునేందుకు అవసరమైన పరికరాల లభ్యత పెంచాల్సిన తక్షణ అవసరం ఉందని మోదీ అన్నారు.
ఆక్సిజన్, ఆక్సిజన్ అవసరాల సంబంధిత పరికరాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్ మూడు నెలల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆక్సిజన్ అవసరాలకు సంబంధించిన పరికరాలకు కస్టమ్స్ క్లియరెన్స్ వేగవతంగా జరగాలని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ను ఆయన ఆదేశించారు.

ఫొటో సోర్స్, Reuters
‘ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ చర్యలు’
ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరతపై దిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
ఆక్సిజన్ సరఫరాకు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించింది.
''దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఇంకా పీక్ స్టేజికి చేరలేదు. మే నెలలో పీక్ రావొచ్చు. ఆ పరిస్థితికి ఎలా సిద్ధమవుతున్నాం?'' అని కోర్టు ప్రశ్నించింది.
ఆక్సిజన్ కొరతపై దిల్లీలోని వివిధ ఆసుపత్రులు తమను ఆశ్రయించడంతో కోర్టు విచారణ చేపట్టింది.
దిల్లీ నగరంలోని ఆసుపత్రులకు 480 టన్నుల ఆక్సిజన్ లభించకపోతే వ్యవస్థ కుప్పకూలుతుందని దిల్లీ ప్రభుత్వం ఈ సందర్భంగా కోర్టుకు తెలిపింది.
కేంద్రం నుంచి శుక్రవారం 297 టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందిందని చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
దీంతో.. దిల్లీకి 480 టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం సమకూర్చితే సమస్యలు పరిష్కారమవుతాయని కోర్టు చెప్పంది.
సరఫరాకు ఆటంకం కలిగిస్తున్న వారి వివరాలు కోర్టుకు సమర్పించాలని.. దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా క్రయోజనిక్ ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- బెల్లం: ఆహారమా... ఔషధమా?
- తెలంగాణ: పదో తరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా
- దీర్ఘకాలిక కోవిడ్: ‘రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- స్పుత్నిక్ V: రష్యా వ్యాక్సీన్‌కు భారత్ అనుమతి.. ఈ టీకా గురించి తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్‌లో టీకాల కొరతకు కారణమేంటి..
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








