తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా

పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది.
ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
కరోనా తీవ్రత కారణంగా సీబీఎస్‌ఈ బోర్డు కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించింది.
మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

పదో తరగతి విద్యార్థుల మార్కులను తెలంగాణ ఎస్.ఎస్.సి. బోర్డు రూపొందించిన విధి విధానాలను బట్టి నిర్ణయిస్తామని తెలిపింది.
ఈ మార్కుల విషయంలో ఏ విద్యార్ధికైనా అసంతృప్తి ఉంటే పరిస్థితులు చక్కబడిన తర్వాత వారికి పరీక్ష రాసే అవకాశం ఇస్తామని బోర్డు తన ప్రకటనలో పేర్కొంది.

ఇంటర్ పరీక్షలు వాయిదా
మే ఒకటి నుంచి 19 వరకు జరగాల్సిన ఇంటర్ సెకండియర్ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా శాఖ ప్రకటించింది.
జూన్ మొదటివారంలో పరిస్థితిని సమీక్షించి, కొత్త పరీక్షల తేదీలను ప్రకటిస్తామని తెలిపింది.
అయితే, పరీక్షలకు 15 రోజుల సమయం ఇస్తామని వివరించింది.
ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ఎలాంటి పరీక్షలు రాయకుండానే సెకండియర్‌కు ప్రమోట్ చేస్తామని తెలిపింది.
అయితే, పరిస్థితులు మెరుగుపడిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.
ఈసారి ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25శాతం వెయిటేజీ పరిగణనలోకి తీసుకోబోమని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు
పరీక్షల నిర్వహణకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
కేంద్రంతో పాటుగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని వివిధ పరీక్షల విషయంలో కొన్నింటిని రద్దు చేసి, మరికొన్ని వాయిదా వేసినప్పటికీ ఏపీలో మాత్రం షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని అంటోంది.పరీక్షల వాయిదా ఆలోచన లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ బీబీసీకి తెలిపారు.
"ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉంది. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఇంటర్ పరీక్షలు నిర్వహించాం. ఈసారి కూడా ఆశాభావంతో ఉన్నాము. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతాం. ముఖ్యమంత్రితో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి షెడ్యూల్‌లో మార్పులు లేవు" అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- ఎడారి ఇసుక నేలలో పచ్చని పొలం... ఈ అద్భుతం ఎలా సాధ్యం?
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సీన్ వేస్టేజీ ఎక్కువగా ఉందా... ప్రధాని మోదీ ఆ మాట ఎందుకు అన్నారు?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- రైతుల నిరసనలు: ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గొద్దు.. రైతులకు సూచించిన రాహుల్ గాంధీ
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- సింధు నదీజలాల ఒప్పందం వల్ల భారత్ నష్టపోతోందా.. అసలు ఎందుకీ ఒప్పందం చేసుకున్నారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- పంటలకు ఈ రైతు హోమియో మందులు వేస్తున్నారు... ఎందుకో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది.)








