ఆండ్రాయిడ్: ఫోన్ చూస్తూ నడుస్తుంటే తల పైకెత్తమని హెచ్చరించే యాప్

ఫోన్ చూస్తూ నడుస్తున్నప్పుడు తల పైకెత్తి నడవమని హెచ్చరించే యాప్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఫోన్ చూస్తూ నడుస్తున్నప్పుడు తల పైకెత్తి నడవమని హెచ్చరించే యాప్

ఫోన్ చూస్తూ నడవడం చాలామందికి అలవాటే. అయితే, అలా మొబైల్ ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ నడుస్తుంటే కొద్ది సమయం తరువాత ఆపమని హెచ్చరించే యాప్ ఫీచర్‌ను అభివృద్ధి చేశారు.

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది పనిచేస్తుంది.

డిజిటల్ వెల్ బీయింగ్ యాప్‌లో ఉండే ఈ ఫీచర్‌ని పరీక్షించి చూసినట్లు టెక్ బ్లాగ్ ‘ఎక్స్‌డీఏ డెవెలపర్స్’ తెలిపింది.

యూజర్లను ఫోన్‌లోకి చూడటం ఆపమంటూ ఫోన్ స్క్రీన్ మీద నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తోంది.

హెడ్స్ అప్

ఈ టూల్ లో ఉండే ఈ ఫీచర్ పేరు హెడ్స్ అప్. దీనిని డిజిటల్ వెల్ బీయింగ్ యాప్‌లోకి వినియోగించారు. దీని ద్వారా యూజర్లు ఎంత సమయం నుంచి ఫోన్ స్క్రీన్ నుంచి దృష్టి మరల్చలేదో తెలుసుకోవచ్చు.

అలాగే, ఒక యాప్ వాడకాన్ని ఒక నిర్ణీత సమయం వరకు వాడేందుకు అలెర్ట్ పెట్టుకోవచ్చు. లేదా సమయాన్ని నిర్దేశించుకోవడం గాని, ఫోన్ ని సైలెంట్ మోడ్‌లో పెట్టడం గాని చేయొచ్చు.

ఫోన్ సెట్టింగ్‌లలోనే ఈ నోటిఫికేషన్లను ఆన్, ఆఫ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.

జయప్రకాశ్ కామత్ అనే యూజర్ తన గూగుల్ పిక్సెల్ 4ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ హెడ్స్ అప్ ఫీచర్ అప్‌డేట్ గుర్తించిన తరువాత దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ షేర్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇందులో "జాగ్రత్తగా ఉండండి, ముందుకు చూడండి, మీ అడుగు చూసుకోండి" అంటూ కొన్ని చమత్కారమైన ఎమోజిలతో కలిపి నోటిఫికేషన్లు వస్తాయి" అని 9 టూ 5 గూగుల్ అనే ఒక టెక్నాలజీ వెబ్ సైట్ చెప్పింది.

దీని పై వివరాల కోసం బీబీసీ గూగుల్‌ని సంప్రదించింది.

"ఇది మనం నిరంతరం వాడే డిజిటల్ పరికరాల వాడకపు సమయాన్ని తగ్గించేందుకు వచ్చిన మరో కొత్త టూల్‌లా కనిపిస్తోంది" అని స్క్రీన్ టైం: హౌ టూ మేక్ పీస్ విత్ యువర్ డివైసెస్ అండ్ ఫైండ్ యువర్ టెక్విలిబ్రియం" పుస్తక రచయత బెక్క క్యాడి అన్నారు.

"అయితే, ఇవి అమలు కావడం అనుకున్నంత రీతిలో జరగదు. ఒక్క నోటిఫికేషన్ తో మన ప్రవర్తన మార్చడం సాధ్యం కాదు. మనం అలా పని చేయం".

"మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఫోనును వాడాలని చూసినప్పుడు అలాంటి నోటిఫికేషన్ వస్తే చాలా చిరాకుగా ఉంటుంది. కానీ, ఇది కొంత మందికి ఉపయోగపడవచ్చు" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)