విశాఖ: అన్నకు పెళ్లిచూపుల కోసం వెళ్తే తమ్ముడిని ఇష్టపడిన అమ్మాయి.. ఒకే యువతితో పెళ్లి కోసం అన్నదమ్ముల ఘర్షణ

ఫొటో సోర్స్, Getty Images
విశాఖ పూడిమడకలో ఒకే యువతితో వివాహం కోసం సొంత అన్నదమ్ములు ఘర్షణ పడ్డారు. చివరికి ఆ ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లాలోని జాలారిపేట, పూడిమడకకు చెందిన రాజు అనే యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లిచూపుల కోసం భీమిలిలోని ఒక అమ్మాయి ఇంటికి వెళ్లారు.
అయితే, రాజును కాకుండా అతని తమ్ముడు ఎర్రయ్యను ఇష్టపడింది ఆ అమ్మాయి.
చివరికి తమ్ముడు ఎర్రయ్యతోనే పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు.
అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఆ గొడవలు ఆదివారం అన్నదమ్ములిద్దరూ కొట్టుకునే వరకు వెళ్లాయి.
ఎర్రయ్య నిన్న చేపల వేటకు వెళ్లి 2000 రూపాయలు తీసుకొచ్చారు.
ఆ డబ్బును మొబైల్ ఫోన్ కొనుక్కునేందుకు అన్నకు ఇవ్వమని ఎర్రయ్యకు తల్లి చెప్పింది.
కానీ, ఆ డబ్బును అన్నకు ఇవ్వడం ఎర్రయ్యకు ఇష్టం లేదు.
దాంతో అన్నదమ్ముల మధ్య గొడవ మొదలయింది.
ఆ గొడవ పెరిగి సోమవారం 12 గంటల సమయంలో రాజు తన తమ్ముడిని కత్తితో మెడపై పొడిచాడని, అనకాపల్లి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఎర్రయ్య మార్గమధ్యలో చనిపోయాడని అచ్చుతాపురం ఎస్సై లక్ష్మణ్‌రావు బీబీసీతో చెప్పారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ స్మార్ట్ ఫోన్ల తయారీ వ్యాపారాన్ని ఆపేయబోతున్నట్లు ప్రకటించింది.
వరుసగా ఆరేళ్లుగా ఎల్‌జీ సంస్థ స్మార్ట్ ఫోన్ల విభాగం నష్టాలను ఎదుర్కొంటూ వస్తోంది. మొత్తంగా ఈ ఆరేళ్లలో ఈ విభాగంలో రూ.33 వేల కోట్ల నష్టాలను ఆ సంస్థ చవిచూసింది.
స్మార్ట్ ఫోన్ రంగంలో ఎల్‌జీ చాలా ఆవిష్కరణలు చేసింది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు తీసుకురావడం కూడా వీటిలో ఒకటి.
2013లో ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారు సంస్థల్లో మూడో స్థానానికి ఎల్‌జీ చేరుకుంది.
అయితే, ఆ తర్వాత హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌పరమైన లోపాల వంటి స్వయంకృత అపరాధాలు ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను దెబ్బతీశాయి.
ఇప్పటికీ ఉత్తర అమెరికాలో మూడో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఎల్‌జీ ఉంది. సొంత దేశం దక్షిణ కొరియాలోనూ ఆ సంస్థ అమ్మకాలు బాగానే ఉన్నాయి. మిగతా దేశాల్లో మాత్రం ఎల్‌జీ చాలా వెనుకబడింది.
''విపరీతమైన పోటీ ఉన్న మొబైల్ ఫోన్ తయారీ రంగం నుంచి వైదొలగాలని ఎల్‌జీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలు, కనెక్టెడ్ డివైజెస్, స్మార్ట్ హోమ్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కీలకమైన వృద్ధికి అవకాశమున్న రంగాల్లో మా వనరులను ఉపయోగించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది'' అని ఎల్‌జీ ఓ ప్రకటనలో తెలిపింది.
కౌంటర్ పాయింట్ పరిశోధన సంస్థ సమాచారం ప్రకారం... ఎల్‌జీ గత ఏడాది 1.8 కోట్ల మొబైల్ ఫోన్లు మాత్రమే అమ్మగలిగింది. అదే సమయంలో శామ్‌సంగ్ సంస్థ 15.6 కోట్ల ఫోన్లు విక్రయించింది.
ప్రస్తుతం ఎల్‌జీ సంస్థకున్న ఐదు విభాగాల్లో అతితక్కువ ఆదాయం (7.4%) వస్తున్నది స్మార్ట్ ఫోన్ల విభాగం నుంచే. అంతర్జాతీయ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో ఆ సంస్థ వాటా రెండు శాతానికి పడిపోయింది.

ఇండోనేసియా, తూర్పు తైమూర్‌ల్లో వరదలు... 50 మందికి పైగా మృతి

ఫొటో సోర్స్, EPA
అకస్మాత్తుగా వచ్చిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఇండోనేసియా, తూర్పు తైమూర్ దేశాల్లో ఆదివారం యాభైకిపైగా మంది చనిపోయారు.
ఈ రెండు దేశాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
వరద విపరీతంగా వచ్చి చేరడంతో డ్యాముల నుంచి నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వేల సంఖ్యలో ఇళ్లు వరద ముంపుకు గురయ్యాయి.
ఇండోనేసియా తూర్పు ప్రాంతంలోని ఫ్లోర్స్ ద్వీపం నుంచి పొరుగున ఉన్న దేశమైన తూర్పు తైమూర్ వరకూ ఈ వరదలు ప్రభావం చూపిస్తున్నాయి.
గల్లంతైనవారి కోసం రక్షక సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, EPA
‘‘నాలుగు ఉప జిల్లాలు, ఏడు గ్రామాలపై ఈ వరదలు ప్రభావం చూపించాయి. క్షేత్ర స్థాయిలో ఉన్న మా బృందంతో మాట్లాడి సమాచారాన్ని ధ్రువీకరించుకున్నాం. ఇప్పటివరకూ 41 మంది మరణించినట్లు గుర్తించాం. మరో 27 మంది గల్లంతయ్యారు. తొమ్మిది మంది గాయపడ్డారు’’ అని ఇండోనేసియన్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ అధికార ప్రతినిధి రాదిత్య జాటి తెలిపారు.
మరోవైపు తమ మున్సిపాలిటీ పరిధిలో 60 మంది దాకా మరణించారని తూర్పు ఫ్లోర్స్ డిప్యూటీ రెజెంట్ ఆగస్టినస్ పయోంగ్ బోలి చెప్పారు. అయితే, ఆయన చెప్పిన గణాంకాలను ఇండోనేసియా జాతీయ అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.
ఇవి కూడా చదవండి:
- 18 ఏళ్ల క్రితం పోలీసులు తనను మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లినపుడు మమతా బెనర్జీ ఏమని శపథం చేశారు
- సూయజ్ కాలువలో భారీ నౌక ఇరుక్కుపోవడానికి కారణం ఈమేనంటూ వార్తలు.. అసలు నిజమేంటి
- తేనెటీగలు లేకుండా తేనెను, ఆవులు లేకుండా పాలను తయారు చేస్తున్నారు!
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- గోల్డెన్ బ్లడ్... ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- ‘ఏపీకి స్పెషల్ స్టేటస్ లేదన్న బీజేపీ పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇస్తామని మేనిఫెస్టోలో ఎలా హామీ ఇచ్చింది’
- ‘అఖండ భారతం గురించి వారు మాట్లాడుతుంటే నేను అఖండ ద్రావిడం గురించి ఎందుకు మాట్లాడకూడదు’
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








