స్సేస్ ఎక్స్: 'చంద్రుడిపైకి వెళ్లడానికి ఎనిమిది మంది కావాలి.. ఖర్చులన్నీ నేను భరిస్తాను'

ఫొటో సోర్స్, Getty Images
ఎలాన్ మస్క్‌కు చెదిన స్పేస్ ఎక్స్ ఫ్లైట్‌లో చంద్రుడిపైకి తనతో రావడానికి ఎనిమిది మంది కావాలని.. ఆసక్తిగలవారు తనతో రావొచ్చని జపాన్ బిలియనీర్ యుసాకూ మేజావా ప్రజలను ఆహ్వానించారు.
''విభిన్న నేపథ్యాల నుంచి ప్రజలు నాతో కలిసి రావాలని కోరుకుంటున్నాను'' అంటూ ఆయన ట్విటర్‌లో ఒక వీడియో విడుదల చేశారు.
ఇందుకోసం దరఖాస్తు చేసుకోవడానికంటూ ఒక లింక్ కూడా షేర్ చేశారు.
తనతో రావాలనుకునేవారికి అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని.. కాబట్టి చంద్రుడిపైకి వారి ప్రయాణం పూర్తి ఉచితం అని ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
'డియర్ మూన్' పేరుతో చేపడుతున్న ఈ మిషన్‌లో భాగంగా 2023లో చంద్రుడిపైకి వెళ్తారు.
ఈ యాత్రలో అన్ని సీట్లనూ తాను కొనుక్కున్నానని, కాబట్టి తనతో వచ్చేవారికి ఇది ఉచిత ప్రయాణం అవుతుందని, ఇదో ప్రైవేట్ రైడ్ అని చెప్పారాయన.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ ఎవరీ మేజావా?
మేజావా జపాన్‌లో పేరుమోసిన బిలియనీర్. ఫ్యాషన్ రాజుగా ఆయన్ను చెబుతుంటారు. గొప్పగొప్ప కళాఖండాలనూ ఆయన సేకరిస్తుంటారు.
తొలుత ఆయన కళారంగానికి చెందినవారినే తీసుకెళ్లాలనుకున్నప్పటికీ ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా రావొచ్చని ఆహ్వానించారు.
గత ఏడాది ఆయన ఈ యాత్రలో తనతో పాటు వచ్చేందుకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలనీ కోరారు.
స్పేస్ ఎక్స్‌లో చంద్రుడిపైకి వెళ్లేందుకు ఆయన 2018లో టికెట్ బుక్ చేసుకున్నారు.. దాంతో ఆ యాత్రకు వెళ్తున్న తొలి ప్రైవేట్ యాత్రికుడిగా ఆయన గుర్తింపు పొందారు.
ఆయన ఈ టికెట్ ఎంత ధరకు కొన్నారన్నది చెప్పకపోయినా ఎలాన్ మస్క్ మాత్రం మేజావా చాలా పెద్ద మొత్తం చెల్లించారని గతంలో చెప్పారు.
2023లో చేపట్టబోయే ఈ మిషన్ 1972 తరువాత చంద్రుడిపైకి చేపడుతున్న తొలి మానవ సహిత యాత్ర.
ఇవి కూడా చదవండి:
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే...
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








