రామతీర్థం ఆలయ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజును తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం - BBC Newsreel

చంద్రబాబు, అశోక్ గజపతి

విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండ రామాలయంలో డిసెంబరు 29న గుర్తుతెలియని వ్యక్తులు రాముడి విగ్రహం తల తొలగించి, దానిని మాయం చేశారు. ఆ తర్వాత రోజు 30న కొండ సమీపంలోని ఒక కొలనులో రాముడి విగ్రహం తల దొరికింది.

విగ్రహం తల తొలగించి, కొలనులో పడేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. ఒక్కసారిగా రాజకీయవేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో శనివారం(2న ) టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రామతీర్థం చేరుకున్నారు.

ఈ ఘటనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం వరుస ట్వీట్లు చేశారు. ఇప్పటివరకూ 125కు పైగా గుడులలో విధ్వంసాలు జరిగినా ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేదని ఆరోపించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

విగ్రహం తల ధ్వంసం ఘటనపై రాష్ట్ర మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూడా పార్టీ ట్విటర్‌లో స్పందించారు.

ప్రభుత్వంపై బురద చల్లడానికే కొందరు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అయితే, చంద్రబాబు రామతీర్థం చేరుకోవడానికి ముందే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆలయాన్ని సందర్శించారు. కొండపైకి వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు.

ఈ ఘటనపై బీజేపీ, టీడీపీ రామతీర్థం పరిసర ప్రాంతాల్లో వేర్వేరుగా శిబిరాలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశాయి.

చంద్రబాబు విజయనగరం చేరుకున్న తర్వాత ఆయనకు మాత్రమే రామతీర్థం వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన పోలీసులు మిగతా టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టారు.

దీంతో, టీడీపీ నాయకులకు కూడా రామతీర్థం వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ చంద్రబాబు కాసేపు రోడ్డుపై బైఠాయించారు. తర్వాత ఆయన రామతీర్థం బయలుదేరారు.

ఈలోపు విజయసాయిరెడ్డి కొండపై నుంచి కిందికి రావడంతో బీజేపీ, టీడీపీ కార్యకర్తలు ఆయన వాహనంపై రాళ్లు రువ్వారు.

ఈ ఘటనపై వైసీపీ అధికారిక ట్విటర్‌లో స్పందించింది. రామతీర్థంలో టీడీపీ కార్యకర్తలు ఎంపీ విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి చేశారని ఆరోపించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఈ ఘటనలో విజయసాయి రెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదే సమయంలో టీడీపీ, బీజేపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

అదే సమయంలో బీజీపీ జిల్లా అధ్యక్షులు రెడ్డి పావని సొమ్మసిల్లి పడిపోయారు.

ఇప్పటివరకూ, విగ్రహం తల ధ్వంసం కేసుకు సంబంధించి రామతీర్థం వార్డు మాజీ సభ్యులు సూరిబాబు, రాంబాబుతో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ, ఈ ఘటనతో సంబంధం లేకపోయినా, వారిని అరెస్టు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

రామతీర్థం బోడికొండ దిగువన బీజెపీ, టీడీపీ అందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని పలువురు టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రామతీర్థం ఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసింది.

దేవదాయ శాఖ ఆర్‌జేసీ భ్రమరాంబను ఈ కేసు విచారణాధికారిగా నియమించారు.

ఈ ఘటనలో మొత్తం 20 మందిని విచారిస్తున్నామని, సున్నితమైన ఈ అంశంలో రాజకీయ పార్టీలు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ రాజకుమారి సూచించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చైర్మన్‌గా అశోక్ గజపతిరాజును తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు

చైర్మన్‌గా అశోక్ గజపతిరాజును తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు

కాగా, రామతీర్థం ఆలయ నిర్వహణలో విఫలం అయ్యారంటూ ఆలయ చైర్మన్, వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న అశోక్ గజపతిరాజును ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదే క్రమంలో విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి దేవస్థానం, తూర్పుగోదావరి జిల్లా మండపల్లిలోని మండేశ్వరస్వామి ఆలయ చైర్మన్ బాధ్యతల నుంచి కూడా అశోక్ గజపతిరాజును తప్పిస్తున్నట్లు దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ ఆదేశాలు జారీ చేశారు.

5వ తేదీన జనసేన, బీజేపీ ‘రామతీర్థ ధర్మయాత్ర’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పరంపరగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, వీటిని ఖండిస్తూ ఈనెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు జనసేన, బీజేపీ నాయకులు రామతీర్థ ధర్మయాత్ర నిర్వహిస్తారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

సౌరవ్ గంగూలీ

ఫొటో సోర్స్, ANI

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండెపోటు.. కోల్‌కతా ఆస్పత్రిలో చేరిక

బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి గుండెపోటు రావడంతో కోల్‌కతాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.

స్థానిక మీడియా రిపోర్టుల ప్రకారం జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయన హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దాంతో, గంగూలీని దగ్గరలోని వుడ్‌లాండ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.

సౌరవ్ గంగూలీ కుటుంబంతో మట్లాడానని, ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా ట్వీట్ చేశారు. "దాదా ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉంది. ట్రీట్‌మెంట్ బాగా పనిచేసింది. ఆయన వీలైనంత త్వరగా కోరుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలని ఆంకాంక్షించారు.

"సౌరవ్ అనారోగ్యం వార్త బాధించింది. ఆయన మైల్డ్ కార్డియాక్ అరెస్ట్(సాధారణ గుండెపోటు)కు గురైనట్లు తెలిసింది. దాంతో గంగూలీని ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని మమతా బెనర్జీ తన ట్విటర్‌లో పెట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

భారత క్రికెటర్ శిఖర్ ధవన్ కూడా గంగూలీ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ప్రార్థిస్తూ, ట్విటర్‌లో దాదా కోసం తన సందేశం పోస్ట్ చేశారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA

కొత్త రక్షణ బిల్‌పై ట్రంప్ వీటోను తిరస్కరించిన అమెరికా కాంగ్రెస్

అమెరికా కొత్త రక్షణ బిల్లుపై ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను సెనేట్ తిరస్కరించింది. అధ్యక్షుడి వీటో అధికారాన్ని తోసిపుచ్చింది.

రిపబ్లికన్లకు మెజార్టీ ఉన్న సెనేట్‌లో కొత్త సంవత్సరం రోజు ఈ బిల్లుపై చర్చ జరిగింది.

ఇప్పటికే ఈ బిల్లుకు మద్దతు తెలుపుతూ అమెరికా పార్లమెంట్ సభ్యులు ఓటు వేశారు.

వచ్చే ఏడాదికి రక్షణ విధానానికి కావలసిన నిధులను సమకూర్చేందుకు 740 బిలియన్ డాలర్లను ఈ బిల్లులో కేటాయించారు.

కొద్ది రోజులలో అధ్యక్ష పదవిని విడిచి పెట్టనున్న ట్రంప్ ఈ బిల్లులోని కొన్ని నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఈ రక్షణ బిల్లుకు సెనేట్‌లో 81:13 నిష్పత్తిలో ఓట్లు వేశారు. రెండు చట్ట సభల్లోనూ ఈ బిల్లు పాస్ అవ్వడానికి మూడింట రెండొంతుల మెజారిటీ రావాలి.

అఫ్గానిస్తాన్, యూరప్‌ల నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలన్న తన నిర్ణయానికి ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందంటూ ట్రంప్ అభ్యంతరాలు తెలిపారు. ఇందులో ముఖ్యమైన జాతీయ భద్రతా చర్యలను చేర్చలేదని ట్రంప్ అన్నారు.

ఎన్‌డీఏఏ బిల్లు గత 59 ఏళ్లుగా ఆమోదం పొందుతూనే ఉందని, ఇప్పుడు 60వ సారి కూడా దీన్ని చట్టబద్ధం చేసి తీరుతామని సెనేట్‌లో రిపబ్లికన్ నాయకుడు మిచ్ మెక్‌కానెల్ వ్యాఖ్యానించారు.

దీనిపై ట్రంప్ స్పందిస్తూ..."పెద్ద పెద్ద టెక్ కంపెనీలకు అపరిమితమైన అధికారాన్ని ఇచ్చే సెక్షన్ 230ని తొలగించే మంచి అవకాశాన్ని రిపబ్లికన్ సెనేట్ పోగొట్టుకుంది. ఇది చాలా విచారకరం" అంటూ ట్వీట్ చేశారు.

ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలు సైనిక దళాలకు హాని కలిగించేవిగానూ, భద్రతా వ్యవస్థకు అపాయం కలిగించేవిగానూ ఉన్నాయని స్పేకర్ నాన్సీ పెలోసీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)