బంగారాన్ని గనుల్లో నుంచి బయటకు తీయడం ఎందుకు అంత కష్టం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్రిస్ బరానియుక్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
కరోనావైరస్ వ్యాప్తి నడుమ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పసడి ధరలు ఎవరూ ఊహించని రీతిలో ఒక్కసారిగా పెరిగిపోయాయి.
గతేడాది బంగారం ఉత్పత్తి అంతర్జాతీయ స్థాయిలో ఒక శాతం వరకు తగ్గింది. గత దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో బంగారం ఉత్పత్తి పడిపోవడం ఇదే తొలిసారి.
గనుల నుంచి బంగారం వెలికితీత పరిమితి ఇప్పటికే పతాక స్థాయికి చేరుకుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. బంగారం ఉత్పత్తి కొంతకాలం పాటు నిలిపివేస్తేనే.. మళ్లీ ఉత్పత్తి పెరుగుతుందని, లేకపోతే ఈ తగ్గుదల కొనసాగుతుందని వివరిస్తున్నారు.
మరోవైపు బంగారం ధరల్లో పెరుగుదలకు అక్రమ మైనింగ్ కూడా ఒకరణం. అమెజాన్ అడవుల్లో అక్రమంగా భారీ స్థాయిలో బంగారం గనులను కొల్లగొడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ.. డిమాండ్ మాత్రం తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. మరోవైపు ఇదివరకటితో పోలిస్తే... ప్రస్తుతం బంగారం డిమాండ్ చాలా ఎక్కువగా పెరిగిందని సీఎఫ్‌ఆర్ ఈక్విటీ రీసెర్చ్ సంస్థకు చెందిన నిపుణుడు మ్యాట్ మిల్లర్ చెప్పారు.
ప్రపంచంలో అందుబాటులో ఉన్న సగం బంగారం ఆభరణాల రూపంలోనే ఉందని మిల్లర్ చెప్పారు.
భూమిలోపల ముడి పదార్థం రూపంలో ఉండే బంగారం దీనికి అదనం. ఆభరణాల తర్వాత.. మిగిలిన సగంలో పావు వంతు కేంద్ర రిజర్వు బ్యాంకుల దగ్గర ఉంది. మిగతాది ప్రైవేటు మదుపరుల దగ్గర ఉంది.

ఫొటో సోర్స్, Alamy
విశ్వసనీయ ఆస్తి
కోవిడ్-19 వ్యాప్తితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయని మిల్లర్ చెప్పారు. అమెరికా డాలర్ నుంచి భారత రూపాయి వరకు అన్ని కరెన్సీలు బలహీన పడ్డాయని వివరించారు.
కరోనావైరస్ వ్యాప్తి కట్టడికి ప్రపంచ దేశాలు చాలా నిధులు వెచ్చించాయి. మరోవైపు చాలా దేశాలు పక్క దేశాల నుంచి నిధులను రుణాల రూపంలో తీసుకున్నాయి.
అందుకే కరెన్సీల విలువ తగ్గిపోతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో బంగారం విలువ మాత్రం.. డిమాండ్‌కు అనుగుణంగా పెరుగుతోంది. దీన్ని విశ్వసనీయ పెట్టుబడిగా నిపుణులు చెబుతున్నారు.
మార్కెట్‌లోకి వస్తున్న బంగారంలో చాలా వరకు రీసైకిల్ చేసిన బంగారమే ఉంటోందని, అందుకే డిమాండ్ నానాటికీ పెరుగుతోందని మిల్లర్ అంటున్నారు.
భవిష్యత్‌లో రీసైకిల్ బంగారం, బంగారు నాణేలతోపాటు ఎలక్ట్రానిక్ బోర్డుల్లో ఉపయోగించే సర్క్యూట్ బోర్డులలోని బంగారానికీ విలువ భారీగా పెరుగుతుందని మిల్లర్ చెప్పారు.
గత 20 ఏళ్లలో చెలమణీలో ఉన్న బంగారంలో 30 శాతం రీసైక్లింగ్ నుంచి వచ్చినదేనని ఓ పరిశోధన చెబుతోంది.

ఫొటో సోర్స్, Alamy
తవ్వకాలకు వ్యతిరేకత
బంగ్లారం రీసైక్లింగ్‌లో హానికర రసాయనాలను ఉపయోగిస్తారు. వీటితో పర్యావరణానికి చాలా హాని జరుగుతుంది. అయితే, వీటి కంటే బంగారాన్ని తవ్వితీయడంతోనే పర్యావణానికి ఎక్కువ హాని జరుగుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
ఒక కేజీ బంగారాన్ని రీసైకిల్ చేసేటప్పుడు దాదాపు 53 కేజీల కార్బన్ డై ఆక్సైడ్ పరిసరాల్లోకి విడుదల అవుతుందని జర్మనీకి చెందిన బంగారు రీసైక్లింగ్ సంస్థ పరిశోధనలో తేలింది.
అదే సమయంలో, బంగారాన్ని వెలికి తీసే సమయంలో ప్రతి కేజీకి 16 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది.
పర్యావరణంపై బంగారు గనుల తవ్వకాలు చాలా ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అందుకే పరిసరాల్లోని స్థానికులు ఎప్పటికప్పుడే నిరసనలు చేపడుతుంటారు.
ఇలాంటి నిరసనల వల్ల బంగారు గనుల తవ్వకాలకు ఆటంకాలకు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు చిలీలోని పాస్కువా-లామా గనుల దగ్గర పర్యావరణ వేత్తలు నిరసనలు చేపట్టడంతో అక్కడ తవ్వకాలను నిలిపివేశారు.
అదే విధంగా ఉత్తర ఐర్లండ్ టైరన్ స్ట్రీట్స్ ప్రాంతంలో బంగారం నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ తవ్వకాలు చేపట్టేందుకు చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. అయితే, పర్యావరణ వేత్తలు ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు.
తవ్వకాలతో వచ్చే దుష్ప్రభావాల వల్ల స్థానికులకు కంపెనీలు పరిహారం చెల్లించాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ప్రాంతాన్ని గత 30ఏళ్లుగా నిరుద్యోగ సమస్య వెంటాడుతోంది. ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇస్తామని కంపెనీలు చెబుతున్నాయి. అయినప్పటికీ గనుల తవ్వకానికి స్థానికులు అనుమతించడం లేదు.

ఫొటో సోర్స్, Alamy
జీవితాల్లో పెను మార్పులు
అయితే, బంగారం తవ్వకాలు జరిపిన ప్రాంతాలకు పరిసరాల్లో ఉండే వారి జీవితాలు చాలా మారినట్లు అనుభవాలు చెబుతున్నాయి.
అమెరికాలోని నెవాడాలో బంగారం గనులు ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం గనులు. ఇక్కడ నుంచి ఏటా 100 టన్నుల బంగారాన్ని వెలికి తీస్తుంటారు.
ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. అంతేకాదు వీరి జీవితాలు కూడా చాలా మెరుగుపడ్డాయి.
బంగారం గనుల్లో బంగారంతోపాటు ఎంతో విలువైన రాగి సహా ఇతర ఖనిజాలూ లభిస్తాయి.

ఫొటో సోర్స్, Charles O'Rear/Getty Images
బ్రిటన్‌లోని ఇప్పటివరకు వెలుగుచూసిన బంగారు గనుల్లో కరెంగినాల్ట్ గనులు అతిపెద్దవి. ఉత్తర ఐర్లండ్‌లోని ఈ గనుల దగ్గర చాలా నిరసనలు జరిగాయి.
ఈ పరిసరాల్లో దాదాపు 20,000 మంది నివసిస్తారు. అందమైన ప్రకృతి సహజ సంపదకు ఈ ప్రాంతం నిలయం.
ఈ చుట్టు పక్కల దట్టమైన అడవులు ఉన్నాయి. ఇక్కడ గనుల తవ్వకాలు చేపట్టేలా స్థానికులను ఒప్పించేందుకు చాలా సంస్థలు ప్రయత్నించాయి.
బహిరంగ ప్రాంతంలో తవ్వకాల(ఓపెన్ పిట్ మైనింగ్)కు బదులు.. భూగర్భ మైనింగ్ చేపడతామని, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తామని సంస్థలు చెప్పాయి. కార్బన్ ఉద్గారాలను సైతం 25 శాతం తగ్గేలా చూస్తామని హామీ ఇచ్చాయి. అయితే, ప్రజలు మాత్రం అంగీకరించలేదు. దీంతో 2019లో ఈ గనుల తవ్వకాన్ని నిలిపివేశారు.
ఇవి కూడా చదవండి:
- జీహెచ్ఎంసీ: టీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే మేయర్ పీఠం దక్కించుకోవచ్చా?
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








