కన్యత్వాన్ని పునరుద్ధరిస్తామంటూ క్లినిక్‌ల అనైతిక వ్యాపారం

శిక్షణ పేరుతో పెళ్లి చేసేశారు

ఫొటో సోర్స్, iStock

ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచిన 100 మంది మహిళల పేర్లతో బీబీసీ ‘100 వుమెన్’ జాబితాను ప్రకటించింది.

బ్రిటన్ లోని క్లినిక్లలో మహిళలకు కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బీబీసీ న్యూస్ బీట్, బీబీసీ 100 విమెన్ బృందాల పరిశీలనలో బయపడింది.

ఈ కన్యత్వ పరీక్షలను మానవ హక్కుల ఉల్లంఘనగా ఐక్య రాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటున్నాయి. వీటిని నిషేధించాలని కూడా చెబుతున్నాయి.

ఈ పరీక్షలు మహిళ కన్యత్వాన్ని నిర్ధరించలేవని, ఇది అశాస్త్రీయమైనదని విమర్శకులు అంటున్నారు. ఇదొక రకమైన వేధింపుల కిందకు వస్తుందని అంటున్నారు.

ఈ పరీక్షలలో మహిళల యోనిని పరీక్షించి హైమెన్ సరిగ్గా ఉందో లేదో చూస్తారు.

కన్యత్వాన్ని సరిదిద్దుతామంటూ (వర్జినిటీ రిపేర్) కొన్నిప్రైవేటు క్లినిక్ లు ప్రచారం చేసుకుంటున్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది. వారిని మేము సంప్రదించినప్పుడు కూడా 150 - 300 పౌండ్లకు ఈ చికిత్స చేస్తామని చెప్పారు.

కన్యత్వ పరీక్షలు నిర్వహించేవి 21 క్లినిక్ లు ఉన్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది. అందులో 16 మందిని సంప్రదించగా, తాము కన్యత్వ పరీక్షలు చేస్తామని ఏడుగురు చెప్పారు. అయితే, మిగిలిన చాలా మంది వారు చేసే పని గురించి ఏ వివరాలూ చెప్పలేదు.

అయితే, హైమెన్ ని సరిదిద్దే శస్త్ర చికిత్సను చేస్తామని మాత్రం అందరూ చెప్పారు.

గత అయిదేళ్లుగా 64 రకాల హైమెన్ సరిదిద్దే ప్రక్రియలు జరిగినట్లు నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ఎచ్ఎస్ ఇంగ్లండ్) తెలిపింది.

A bride

ఫొటో సోర్స్, AFP

కర్మ నిర్వాన అనే స్వచ్చంద సంస్థ ద్వారా ఒక మహిళతో బీబీసీ మాట్లాడింది. ఈ సంస్థ లైంగిక వేధింపులు, బలవంతపు వివాహాల బాధితులకు సహాయం అందిస్తుంది.

"నేను తల్లితండ్రుల వలన చాలా మానసికంగా వేధింపులకు గురయ్యాను. వారు కుదిర్చిన వివాహం చేసుకోమన్నారు.

అప్పుడు ఇంట్లోంచి పారిపోవడం మాత్రమే నాకున్న ఒకే ఒక్క మార్గం.ఒక రోజు మాకు తెలిసిన వ్యక్తి ఒకరు నన్ను నా స్నేహితులతో కలిసి చూశారు. అక్కడ నాతో పాటు ఉన్న ఒక అబ్బాయిని నా బాయ్ ఫ్రెండ్ అని భావించి అదే విషయాన్ని మా అమ్మతో చెప్పారు. దాని గురించి మా బంధువర్గంలో పుకార్లు మొదలయ్యాయి. దాంతో ఆమె తల్లి తండ్రులు ఆమెకు కన్యత్వ పరీక్ష చేయిస్తామని బెదిరించారు. మా తల్లి తండ్రులతో పాటు నన్ను వివాహం చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి కుటుంబం కూడా పెళ్లి జరగాలంటే నేను కన్యగా నిరూపితం కావాలని పట్టుపట్టారు. నాకు చాలా భయం వేసింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కన్యత్వ పరీక్షలంటే ఏమిటో తెలియలేదు. పారిపోవడమొక్కటే నాకున్న మార్గం. దాంతో పారిపోయాను" అని ఆమె చెప్పారు.

కర్మ నిర్వానా సంస్థను ప్రియా మనోట నడుపుతున్నారు.

"దీని గురించి భయపడుతున్న వారి నుంచి మాకు కాల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎవరితోనైనా సంబంధంలో ఉన్నట్లు వాళ్ళ కుటుంబాలకు తెలిసిపోయిందని విచారిస్తూ ఉండవచ్చు. లేదా వాళ్ళు కన్యలు కాకపోవచ్చు. లేదా వాళ్ళు ఎవరితోనైనా సంబంధంలో ఉండి ఉండవచ్చు. అయితే, ఈ పరీక్షలు చేయించుకోవాలని కుటుంబం వారిపై ఒత్తిడి చేస్తూ ఉండి ఉండవచ్చు. దాంతో కలిగే పరిణామం గురించి వారికి ఆందోళన ఉండి ఉండవచ్చు" అని ఆమె అన్నారు.

"ఎవరితోనైనా సంబంధంలో ఉన్నప్పుడు, తమ భాగస్వామిని తామే ఎన్నుకున్నప్పుడు, లేదా ఎవరితోనైనా శారీరక సంబంధం కలిగి ఉన్నప్పుడు పరువు పేరుతో వేధింపులు, బలవంతపు పెళ్లిళ్లకు దారి తీసే అవకాశం ఉంటుంది. కొన్ని కేసులలో బాధితులను చంపేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కొంత మంది బాధితులను వారి కుటుంబం పూర్తిగా వదిలేస్తుంది" అని ఆమె చెప్పారు.

కన్యత్వ పరీక్షలను 20కి పైగా దేశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎవరైనా అమ్మాయి కన్యో కాదో ఈ పరీక్షలు నిరూపిస్తాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పింది. స్త్రీ శరీరంలో ఉండే హైమెన్ పొర టామ్పోన్ల వాడకం వలన గాని, లేదా వ్యాయామం లాంటి చాలా కారణాల వలన కూడా పగిలిపోవచ్చు.

ట్వీజర్లు - నకిలీ రక్తం

ఆన్ లైన్లో 50 పౌండ్లకు హైమెన్ రిపేరు కిట్లు అమ్ముతున్నారని బీబీసీ పరిశీలనలో తేలింది. కన్యత్వాన్ని పునరుద్ధరిస్తామని ఆ కిట్లను అమ్మేవారు చెబుతున్నారు.

జర్మనీ నుంచి 104 పౌండ్ల ఖరీదు చేసే కిట్ వచ్చింది. అందులో 60 ఎంఎల్ వజైనా టైటనింగ్ జెల్, ప్లాస్టిక్ ట్వీజర్లు, ఒక నకిలీ రక్తం క్యాప్సూల్, నకిలీ రక్తం ఉన్న మూడు సాచెట్లు ఉన్నాయి. వాటిని ఎలా వాడాలో దాని మీద ఎటువంటి సూచనలు లేవు.

కన్యత్వ పరీక్షలు, హైమెన్ రిపేర్ కోసం అభ్యర్థనలు తరచుగా వస్తుంటాయని స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ అష్ఫఖ్ ఖాన్ చెప్పారు.

"ఇదింకా యూకేలో చట్ట వ్యతిరేకం ఎందుకు కాదో నాకర్థం కావడం లేదు. దీనిని చట్ట విరుద్ధం చేయాలని" అని ఆయన అన్నారు.

"హైమెన్ పొర లేదంటే కన్య కాదు అనే ఆలోచనే పెద్ద తప్పు. అది చాలా కారణాల వలన చీలవచ్చు. అది చీలిందని చెబితే, దానికి చికిత్స చేసి మళ్ళీ ఒక ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. అంటే నేనొక దొంగ సర్టిఫికేట్ ఇస్తున్నట్లే" అని అన్నారు.

doctor

ఫొటో సోర్స్, Getty Images

చైతన్యం రావాలి

ఈ ఆచారానికి వ్యతిరేకంగా చాలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు.

"ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్" కి సంబంధించిన విషయాలకు వ్యతిరేకంగా ఎలా ప్రచారం చేస్తున్నామో, కన్యత్వ పరీక్షలకు వ్యతిరేకంగా కూడా అదే రీతిలో ప్రచారం జరగాలి" అని ఆయన అంటారు.

"ఇది నా దృష్టిలో ఒక నేరం. మనం నైతికంగా సరైనది కాని విధానాన్ని పాటిస్తున్నాం".

ఈ సంవత్సరం మొదట్లో ఈ కన్యత్వ పరీక్షలను నిషేధించాలని మిడిల్ ఈస్టర్న్ విమెన్ అండ్ సొసైటీ ఆర్గనైజషన్ ప్రచారం నిర్వహించింది. ఈ అంశం పై మరింత అవగాహన కలిగించాలని పిలుపునిచ్చింది.

."ఈ హైమెన్ రిపేరు ప్రక్రియను నిషేధించాలని మేము కోరుతున్నప్పటికీ, దీని పట్ల సరైన అవగాహన కలిగించకుండా నిషేధించడం వలన జరిగే మంచి కంటే చెడే ఎక్కువగా ఉంటుంది. కన్యత్వానికి సంబంధించి వెనుకబడిన ఆలోచనలు ఉండటం వలనే ఇలాంటి విధానాలు అమలులో ఉన్నాయి" అని సంస్థ వ్యవస్థాపకులు హలాలే తహిరి అన్నారు.

"సమాజంలో అవగాహన కలిగించి ఈ నమ్మకాన్ని పోగొట్టగల్గితే , ఇక హైమెన్ రిపేర్ అవసరమే ఉండదు. దాంతో అది దానంతటదే వ్యాపారం నుంచి కనుమరుగవుతుంది" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)