లీజా స్టాలేకర్: పుణె అనాథాశ్రమం నుంచి ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్' దాకా...

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ లీజా స్టాలేకర్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చేర్చారు.
41 ఏళ్ల స్టాలేకర్ ‘హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం పొందిన 9వ మహిళ అయ్యారు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టాలేకర్ తన గోల్డెన్ కెరియర్‌లో జట్టుకు 2005, 2013 ప్రపంచకప్ అందించారు. టెస్ట్, వన్డేల్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లో టాప్ ర్యాంకులో నిలిచారు.
తనను ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చేర్చడంపై స్టాలేకర్ సంతోషం వ్యక్తం చేశారు.
“ఆటగాళ్ల ఇంత అద్భుత సమూహంలో నాకు భాగం అయ్యే అవకాశం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు” అన్నారు.
ఆల్ రౌండర్ స్టాలేకర్ 2013లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. కానీ ఆమె ఇప్పటికీ దేశవాళీ పోటీల్లో న్యూ సౌత్ వేల్స్ కోసం ఆడుతున్నారు. స్టాలేకర్ 12 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
భారత్‌తో బంధం
లీజా స్టాలేకర్ 2013లో ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందించారు. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ముంబయిలో జరిగింది. అందులో ఆస్ట్రేలియా వెస్టిండీస్‌ను ఓడించింది.
లీజా అందుకున్న ఒక అద్భుతమైన క్యాచ్‌తో ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ 2013 ఆస్ట్రేలియాకు దక్కింది. ఆ మ్యాచ్‌లో ఆమె రెండు పెద్ద వికెట్లు కూడా పడగొట్టారు.
చిరస్మరణీయంగా నిలిచిపోయే అదే మ్యాచ్‌తోనే ఆమె తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్‌కు గుడ్‌బై చెప్పారు.
అదే సమయంలో భారత్ అంటే తన మొదటి జ్ఞాపకం ఇది కాదని చెప్పిన ఆమె, భారత్ నుంచే తన జీవితం ఈ స్థాయికి చేరుకుందని తెలిపారు.
వివరాల ప్రకారం స్టాలేకర్ 1979 ఆగస్టు 13న జన్మించారు. నిజానికి ఆమెను చిన్నతనంలోనే పుణెలోని ఒక అనాథాశ్రమంలో వదిలేశారు. అప్పుడు 3 వారాల వయసున్న ఆమెను స్టాలేకర్ కుటుంబం దత్తత తీసుకుంది.
cricket.com.au వివరాల ప్రకారం పుణెలో పుట్టిన సమయంలో ఆమెకు లైలా అనే పేరు పెట్టారు. కానీ, ఆమెను పోషించలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు, పాపను శ్రీవత్స అనాథాశ్రమంలో వదిలేశారు.
కానీ, తర్వాత ఆమెను మిచిగాన్‌కు చెందిన దంపతులు అక్కున చేర్చుకున్నారు. వారిలో హరేన్ ముంబయిలోనే జన్మించగా, ఆయన భార్య పేరు సోయే స్టాలేకర్.
ఈ దంపతులు లైలాను(ఇప్పుడు లీజా) దత్తత తీసుకున్న సమయంలో ఆమె వయసు మూడు వారాలు. తర్వాత లీజా తన కొత్త కుటుంబంతో అమెరికా వెళ్లింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
నా రక్తంలోనే క్రికెట్ ఉంది-లీజా
“నేను భారత్‌లోని పుణెలో పుట్టాను. అక్కడ నన్ను దత్తత తీసుకున్నారు. తర్వాత రెండేళ్లు అమెరికాలో ఉన్నాను. తర్వాత రెండేళ్లు కెన్యాలో, చివరికి ఆస్ట్రేలియాకు వెళ్లి స్థిరపడ్డాం. మా నాన్న భారతీయుడు, మా అమ్మ ఇంగ్లిష్” అని లీజా స్టాలేకర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
“భారతీయులకు క్రికెట్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. నా రక్తంలో కూడా అది ఉందని నాకు కచ్చితంగా అనిపిస్తుంది” అన్నారు.
9 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడాలనుకుంటున్నట్టు లీజా తనతో చెప్పిందని ఆమె తండ్రి డాక్టర్ హరేన్ స్టాలేకర్ తెలిపారు. తను ఇంటి వెనక క్రికెట్ ఆడేది. చాలా బాగా ఆడుతుండేది అని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఒక స్థానిక క్లబ్‌లో 600 మంది అబ్బాయిల మధ్య అడ్మిషన్ పొందిన ఏకైక అమ్మాయి తనేనని లీజా స్టాలేకర్ ఈ ఏడాది ప్రారంభంలో ఎస్జీసీ పాడ్‌కాస్ట్ కు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్ కెరియర్ ప్రారంభం
స్టాలేకర్ క్రికెట్ కెరియర్ చాలామంది అమ్మాయిల్లాగే, అబ్బాయిలతో కలిసి ఆడడంతో మొదలైంది. అప్పట్లో నేను మహిళా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడవచ్చనే విషయం ఆమెకు తెలీదు.
కానీ 13 ఏళ్ల వయసులో ఆమెను గార్డెన్ విమెన్స్ క్రికెట్ క్లబ్‌కు పరిచయం చేశారు. మహిళలు తమ దేశం కోసం క్రికెట్ ఆడచ్చనే విషయం ఆమెకు తెలిసింది అప్పుడే.
“అప్పట్లో మహిళా క్రికెట్‌ను టీవీల్లో ఎవరూ చూసేవారు కాదు. దాని గురించి ఆర్టికల్స్ కూడా వచ్చేవి కావు. ఆటగాళ్ల కుటుంబం, స్నేహితులకు మాత్రమే మహిళా క్రికెట్ గురించి తెలిసేది” అని లీజా ఒక వెబ్‌సైట్‌కు చెప్పారు.
లీజా స్టాలేకర్ 2001 జూన్ 29న ఇంగ్లండ్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున డెబ్యూ అయ్యారని ఐసీసీ వెబ్‌సైట్‌లో ఉంది. ఆమె కుడి చేత్తో బ్యాటింగ్, ఎడమ చేత్తో స్పిన్ బౌలింగ్ చేస్తారు.
స్టాలేకర్ రిటైరయ్యే సమయానికి 125 వన్డే మ్యాచ్‌లు ఆడారు. ఒక ఆస్ట్రేలియా మహిళ ఆడిన క్రికెట్ మ్యాచ్‌ల్లో ఇది అత్యధికం. ఆమె వన్డేలతోపాటూ 8 టెస్ట్ మ్యాచ్‌లు, 54 టీ-20లు కూడా ఆడారు.
రెండు వన్డే, రెండు టీ20 టోర్నీలు కలిపి మొత్తం నాలుగు వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఆమె ఆడారు. మూడు అంతర్జాతీయ సెంచరీలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
2008-09లో ఐసీసీ ర్యాంకింగ్స్ పరిచయం చేసినపుడు, అందులో లీజా స్టాలేకర్‌కు ప్రపంచంలోని మేటి ఆల్-రౌండర్‌గా రేటింగ్ ఇచ్చారు.
వన్డేల్లో వెయ్యి పరుగులు, వంద వికెట్లు తీసుకున్న మొదటి మహిళా క్రికెటర్‌గా కూడా లీజా చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ కెరీర్‌లో ఆమె మొత్తం 3913 పరుగులు చేశారు. 229 వికెట్లు పడగొట్టారు.
రిటైరయ్యే సమయానికి లీజా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన పదో మహిళా క్రికెటర్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ప్లేయర్ అయ్యారు.
వన్డేల్లో 146 వికెట్లు పడగొట్టిన లీజా స్టాలేకర్ అప్పట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో మహిళా ప్లేయర్‌గా నిలిచారు. ఇప్పటికీ ఆమె టాప్ 10లో ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే సమయానికి టీ20 మ్యాచుల్లో 60 వికెట్లు పడగొట్టిన లీజా, ఆ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో మహిళా బౌలర్ అయ్యారు.
లీజా స్టాలేకర్ రిటైరయిన తర్వాత కామెంటేటర్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు.
తాజాగా హాల్ ఆఫ్ ఫేమ్‌లో లీజా స్టాలేకర్‌తోపాటూ జహీర్ అబ్బాస్, జాక్ కలిస్‌లకు కూడా చోటు లభించింది.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ ఈ సందర్భంగా ముగ్గురికీ శుభాకాంక్షలు తెలిపాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
“సరిహద్దులకు అతీతంగా క్రీడలు ప్రపంచాన్ని ఏకం చేయగలవు. మన అందమైన ఆటకు అద్భుతమైన రాయబారులుగా మీరు ముగ్గురూ దీనికి మీ వంతు తోడ్పాటును అందించారు” అని ట్వీట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా వుమెన్స్ క్రికెట్ టీమ్ కూడా జట్టుకు ఆమె సహకారాన్ని గుర్తు చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- "సినిమా వాళ్లు, మీడియావాళ్లు, రాజకీయ నాయకుల మనుషులు.. నాపై అత్యాచారాలు చేశారు’’
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- ఏపీలో వరుస వివాదాల్లో పోలీసులు: అక్రమాలు పెరిగాయా? చర్యలు పెరిగాయా?
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








