సోనియా గాంధీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతారని సీడబ్ల్యూసీ నిర్ణయం

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ మరికొంత కాలం కొనసాగాలని సీడబ్ల్యుసీ తీర్మానించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేంతవరకు ఆమె తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతారని పార్టీ ప్రకటించింది. అందుకు, సోనియా గాంధీ ఆమోదం తెలిపారు.
ఆరు నెలల్లోగా నిర్వహించబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుందని వర్కింగ్ కమిటీ సభ్యుడు పీఎల్ పూనియా తెలిపారు.
పార్టీ సీనియర్ నేతలు రాసిన లేఖ పత్రికలకెక్కడంపై ఈ సమావేశం విచారం వ్యక్తం చేసిందని పూనియా అన్నారు. "ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పవచ్చు. ఆ స్వతంత్రం వారికి ఉంటుంది. కానీ, వాటిని పార్టీ వేదికల మీద వినిపించాలి. కానీ, బహిరంగం చేయకూడదు. ఈ లేఖ మీడియాలో కనిపించడం కచ్చితంగా విచారకరమైన విషయం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, EPA
సీడబ్ల్యూసీ తీర్మానాలు
ఒకటి: గడిచిన ఆరు నెలల్లో దేశం అనేక సంక్షోభాలను చవి చూసింది. కరోనా మహమ్మారి వేలమందిని బలి తీసుకుంది.మరోవైపు దేశ ఆర్ధిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. దేశవ్యాప్తంగా వేలమంది ఉద్యోగాలు కోల్పోగా, పేదరికం పెరిగింది. మరోవైపు చైనా భారత్‌లోకి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించిందని మొదటి తీర్మానం సీడబ్ల్యూసీ పేర్కొంది.
రెండు: సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని, దేశంలో ప్రజల మధ్య విభజన రేఖలు గీసేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించిన సీడబ్ల్యూసీ, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నిరంతరం నిలదీశారని ప్రశంసించింది. ముఖ్యంగా వలస కార్మికులకు సహాయం చేయడంలో ప్రభుత్వ ఘోరంగా విఫలమైందని, ఇది దేశానికి, ప్రభుత్వానికి సిగ్గు చేటుగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అభివర్ణించారని గుర్తు చేసింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కరోనా మహమ్మారి వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సోనియాగాంధీ భరోసా ఇచ్చారని పేర్కొంది. ప్రజాస్వామ్యం మీద మోదీ ప్రభుత్వం జరుపుతున్న దాడులను ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా అడ్డుకోవాలని తీర్మానం పిలుపునిచ్చింది.
మూడు: సోనియా, రాహుల్ గాంధీలు తమ నాయకత్వ లక్షణాలతో దేశవ్యాప్త కాంగ్రెస్ కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చారని, కల్పిత సమస్యలతో కాలం నెట్టుకొస్తున్న ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నించారని తీర్మానం పేర్కొంది. ప్రభుత్వం పట్టించుకోని అనేక అంశాలను కార్యకర్తలు గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నించారని, నిరుపేదలు, హక్కుల కోసం పోరాడుతున్న వారికి గొంతుకగా నిలిచారని తీర్మానం స్పష్టం చేసింది.
నాలుగు: పార్టీలో అంతర్గతంగా అభిప్రాయభేదాలను,భిన్నాభిప్రాయాలను ప్రజల ముందుకు, మీడియాకు తీసుకెళ్లవద్దని, సమస్యలుంటే క్రమశిక్షణాయుతంగా, సంబంధిత వేదికల మీద మాత్రమే పరిష్కరించుకోవాలని పార్టీ నేతలకు సీడబ్ల్యూసీ సూచించింది.
అయిదు: ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు పార్టీలో అవసరమైన నాయకత్వ మార్పులు, చేర్పులను చేయడానికి అధ్యక్షురాలికి పూర్తి అధికారం కట్టబెడుతున్నట్లు సీడబ్ల్యూసీ ప్రకటించింది. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం ఏఐసీసీ సమావేశం నిర్వహించే దాకా పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాలని సోనియాగాంధీకి సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానంతో విజ్జప్తి చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
లేఖ రేపిన వివాదం
పార్టీని మెరుగుపరచాలంటూ లేఖ రాసిన నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ గాంధీ అసలు అనలేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ అన్నారు.
రాహుల్ చేశారని చెబుతున్న ఆ వ్యాఖ్యలపై ఆజాద్ కన్నా ముందు కపిల్ సిబల్ స్పందించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు అభ్యంతరం చెబుతూ ట్వీట్ చేశారు. ఆ తరువాత రాహుల్ గాంధీ తాను అలా అనలేదని వ్యక్తిగతంగా చెప్పారని అంటూ సిబల్ తన ట్వీట్‌ను తొలగించారు.
సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతున్నప్పుడు లేఖ రాసిన నాయకుల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆ లేఖ రాసిన వారు బీజేపీతో కుమ్మక్కయ్యారని అన్నారని మీడియాలో కథనాలు వినిపించాయి.
దానికి స్పందిస్తూ కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. "మేం బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్ గాంధీ అన్నారు. రాజస్థాన్‌లో కోర్టులో కాంగ్రెస్‌ను గెలిపించాం. మణిపూర్‌లో బీజేపీ సర్కార్‌ను పడగొట్టి పార్టీని కాపాడాం. గత 30 ఏళ్ళలో ఎన్నడూ బీజేపీకి అనుకూలంగా ఏ విషయంలోనూ మాట్లాడలేదు. అయినాసరే, బీజేపీతో కుమ్మక్కయ్యామని అంటున్నారు!" అని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌కు బదులిస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా, రాహుల్ గాంధీ అలా అన్నారని ప్రచారం జరుగుతోంది కానీ, ఆయన ఆ మాట అసలు అనలేదని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఏఐసీసీ ప్రెసిడెంట్ సోనియాగాంధీ అధ్యక్షన ప్రారంభమైన ఈ వర్చువల్ మీటింగ్ జరుగుతుండగానే, అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగించాలంటూ ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ముందు కొందరు కార్యకర్తలు ఆందోళ నిర్వహించారు.
పార్టీని మెరుగుపరచాలంటూ కాంగ్రెస్ సీనియర్లు రాసిన లేఖపై ఈ సమావేశంలో రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారని, ఇలా లేఖ రాసిన వారంతా బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించినట్లు కథనాలు వెలువడ్డాయి.
రాహుల్ గాంధీ చేసినట్లుగా చెబుతున్న విమర్శలతో పార్టీలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. సోనియాగాంధీకి రాసిన లేఖపై పార్టీ సీనియర్ నేతలు గులాం నబీఆజాద్, కపిల్ సిబల్, శశిథరూర్,పృథ్వీరాజ్ చవాన్, ఆనంద్ శర్మ తదితరుల సంతకాలు ఉన్నాయి.
ఈ లేఖ రాసినవారిలో చాలామంది గాంధీ కుటుంబానికి విధేయులుగా చెబుతారు. ముఖ్యంగా గులాంనబీ ఆజాద్‌ను గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడే కాక, సీడబ్ల్యూసీ సభ్యుడు కూడా.
రాహుల్ గాంధీ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. ఈ ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను పార్టీకి రాజీనామా చేస్తానని సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌ఆజాద్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనే వెల్లడించినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కాంగ్రెస్ మాత్రం ఈ విమర్శలను తోసిపుచ్చింది. మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని వ్యాఖ్యలు చేయవద్దని కపిల్ సిబల్‌ను ఉద్దేశించి పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని అన్నారు.
ఇక పార్టీ నాయకత్వం అంశంలో సీడబ్ల్యుసీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరుతుండగా, రెండో వర్గం గాంధీ-నెహ్రూ కుటుంబపై విశ్వాసం ప్రకటించింది.
ఈ సమావేశాలలోనే సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయవచ్చని పీటీఐ వర్గాలు తెలిపాయి. అయితే సోనియా గాంధీయే పూర్తి కాల అధ్యక్షురాలిగా ఉండాలంటూ సుమారు 20మంది నాయకులు లేఖలో రాశారు. పార్టీలో మార్పులు చేర్పులు చేయాలని వారు ఈ లేఖలో సూచించారు.
నాయకత్వ మార్పు గురించి లేఖలో డిమాండ్ వినిపించిన తర్వాత చాలామంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆదివారంనాడు గాంధీ కుటుంబానికి మద్దతుగా నిలిచారు.
కనీసం రాహుల్ గాంధీ తిరిగి బాధ్యతలు తీసుకునే వరకైనా సోనియా గాంధీ అధ్యక్షురాలిగా కొనసాగాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొందరు ఎంపీలు డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఢిల్లీ, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ విభాగాలు గాంధీ-నెహ్రూ కుటుంబానికి మద్దతు పలికాయి. నాయకత్వ మార్పు, పార్టీ ప్రక్షాళన గురించి మాట్లాడిన వారిలో గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్‌లు సీడబ్ల్యూసీ సభ్యులు.
అయితే నాయకత్వ మార్పు కోరుతున్నవారు బీజేపీతో కుమ్మక్కయ్యారని పార్టీలో విమర్శలు వినిపించాయి.“ మేం సోనియాగాంధీతో నిలబడతాం. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలి. మనలో విభేదాలు ఉండకూడదు’’ అని హర్యానా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుమారి సెల్జా వ్యాఖ్యానించారు.
లేఖ ద్వారా పార్టీ పక్షాళన కోరిన వారిలో కొందరు గాంధీ-నెహ్రూ కుటుంబం చురుకైన పాత్ర పోషించాలని అంటే మరికొందరు మాత్రం అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని, కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని కోరారు.
కాంగ్రెస్‌కు చెందిన 300మంది ప్రాంతీయ నాయకులు ఈ లేఖకు మద్దతు తెలిపారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా పార్టీలో గొంతులు వినిపించడం అనూహ్యమైన ఘటనగా చెబుతున్నారు. “ కాంగ్రెస్‌లోని 23మంది నేతలు ఎగ్జిక్యూటివ్ కమిటీకి లేఖ రాయడం దురదృష్టకరం’’ అని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్‌గెహ్లాట్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇక కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన విభేధాలపై బీజేపీ కూడా స్పందించింది
“ఒకప్పుడు సింధియా ఎదురు తిరిగితే బీజేపీతో కుమ్మక్కయ్యారని అన్నారు. ఇప్పుడు సోనియాగాంధీ ఫుల్‌టైమ్ అధ్యక్షురాలిగా ఉండాలని కోరుతుంటే వారిని కూడా బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. ఇక ఆ పార్టీని ఎవరూ బాగు చేయలేరు’’ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఈ వ్యవహారంపై ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు.
“గతంలో నేను బీజేపీతో కుమ్మక్కయినట్లు గులాంనబీ ఆరోపించేవారు. ఇప్పుడు ఆయన అదే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 45 సంవత్సరాలుగా సేవ చేసినందుకు మీకు లభించిన ప్రతిఫలమా ఇది ? దీనినిబట్టి కాంగ్రెస్ వంశపారంపర్యాన్ని అంగీకరించని వారు బి-టీమ్‌గానే మిగిలిపోతారు” అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల కోడ్ వచ్చాక సర్వాధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయా?
- డెబిట్-క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ లావాదేవీలకు కొత్త నిబంధనలు... ఇవాళ్టి నుంచే అమలు
- తెలంగాణ శాసనసభ: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి ఆమోదం
- కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- CAA, దిల్లీ హింసలపై ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి
- కశ్మీర్, దిల్లీలకు చెందిన ఇద్దరు కలం స్నేహితులు రాసుకున్న ఉత్తరాల్లో ఏముంది...
- కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్న గర్భిణీ - ప్రభుత్వ మీడియాపై తీవ్ర విమర్శలు
- కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








