అమెరికా 2020 ఎన్నికల సర్వే: ట్రంప్, బైడెన్‌లలో పైచేయి ఎవరిది?

- రచయిత, విజువల్ డేటా జర్నలిజం టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
డోనల్డ్ ట్రంప్ మరో నాలుగేళ్లు శ్వేత సౌధంలో ఉండబోతున్నారా, లేదా అనేది నవంబర్ 3న అమెరికా ఓటర్లు తేల్చేయబోతున్నారు.
రిపబ్లికన్ అధ్యక్షుడికి డెమాక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ నుంచి సవాలు ఎదురవుతోంది. 1970ల నుంచీ అమెరికా రాజకీయాల్లో ఉన్న ఆయన బరాక్ ఒబామా పాలనలో ఉపాధ్యక్షుడుగా పేరు తెచ్చుకున్నారు.
మీకు నచ్చిన అభ్యర్థి ఎవరని అడుగుతున్న అమెరికాలోని సర్వే సంస్థలు ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్దీ దేశంలో మూడ్‌ను కొలవడానికి ప్రయత్నిస్తున్నాయి.
మేం ఇక్కడ ఆ సర్వేల సరళిని గమనిస్తున్నాం. ఎన్నికల్లో విజయం ఎవరిదనేదానిపై వారు ఏం చెప్పగలరో, ఏం చెప్పలేరో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాం.
అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థుల హవా దేశవ్యాప్తంగా ఎలా ఉంది?
జాతీయ సర్వేలు దేశవ్యాప్తంగా ఏ అభ్యర్థికి ఎంత జనాదరణ ఉందో, తెలుసుకోడానికి బాగా ఉపయోగపడతాయి. కానీ, ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి అత్యుత్తమ మార్గం అదే అనుకోవాల్సిన అవసరం లేదు.
ఉదాహరణకు, 2016లో జరిగిన సర్వేల్లో హిల్లరీ క్లింటన్ దాదాపు 30 లక్షల పైగా ఓట్లతో డోనల్డ్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారు. అయినా, ఆమె ఓడిపోయారు. ఎందుకంటే అమెరికాలో ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ ఉంది. అంటే ఎక్కువ ఓట్లు గెలుచుకున్నంత మాత్రాన, ఎప్పుడూ ఎన్నికల్లో విజయం సాధించడం అనేది జరగదు.
దానిని పక్కనపెడితే.. జో బైడెన్ ఏడాదిలో ఎక్కువకాలం జాతీయ సర్వేల్లో డోనల్డ్ ట్రంప్ మీద పైచేయి సాధిస్తూనే ఉన్నారు. ఇటీవలి వారాల్లో ఆయన హవా 50 శాతం పెరిగింది. కొన్ని సార్లు ఆయన 10 పాయింట్ల ఆధిక్యం కూడా సంపాదించారు.
దీనికి విరుద్ధంగా 2016లో జరిగిన సర్వేలు అస్పష్టంగా వచ్చాయి. ఎన్నికల తేదీ సమీపించేకొద్దీ చాలా పాయింట్లలో ట్రంప్, ఆయన అప్పటి ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌ను కొన్ని శాతం పాయింట్లు మాత్రమే వేరు చేయగలిగాయి.
ఎన్నికలను నిర్ణయించే రాష్ట్రాలు ఏవి?
2016లో హిల్లరీ క్లింటన్‌కు తెలిసొచ్చినట్లే, మనం గెలుచుకున్న ఓట్లు, వాటిని మనం ఎక్కడ గెలిచాం అనే దానికంటే అంత ముఖ్యం కాదు.
చాలా రాష్ట్రాలు దాదాపు ఎప్పుడూ ఒకేలా ఓటింగ్ చేస్తాయి. అంటే నిజానికి, ఇద్దరు అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్న రాష్ట్రాలు వేళ్ల మీద లెక్కించగలిగినవే ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపు, ఓటమిలను అందించే ఆ ప్రాంతాలను బాటిల్ గ్రౌండ్ స్టేట్స్(యుద్ధభూమి రాష్ట్రాలు)గా పిలుచుకుంటారు.
అమెరికా తన అధ్యక్షుడిని ఎన్నుకోడానికి ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థను ఉపయోగిస్తుంది. ప్రతి రాష్ట్రానికీ అక్కడి జనాభాను బట్టి కొన్ని ఓట్లు ఇస్తారు. అలా మొత్తం 538 ఓట్లు ఉంటాయి. అంటే, ఒక అభ్యర్థికి గెలవాలంటే 270 ఓట్లు సంపాదించాలి.
పైన మ్యాప్‌లో చూపిస్తున్నట్లు కొన్ని యుద్ధభూమి రాష్ట్రాల్లో మిగతా వాటికంటే ఎక్కువ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయి. అందుకే, అభ్యర్థులు తరచూ ఆ రాష్ట్రాల్లో ప్రచారం కోసం చాలా సమయం వెచ్చిస్తుంటారు.
యుద్ధభూమి రాష్ట్రాల్లో ఆధిపత్యం ఎవరిది?
ప్రస్తుతం యుద్ధభూమి రాష్ట్రాల్లో జరిగిన సర్వేలను బట్టి చూస్తే జో బైడెన్‌కు అనుకూలంగా ఉంది. కానీ ఎన్నికల తేదీకి ఇంకా చాలా రోజుల సమయం ఉంది. ముఖ్యంగా డోనల్డ్ ట్రంప్ రంగంలోకి దిగితే, అక్కడి పరిస్థితులు చాలా వేగంగా మారిపోవచ్చు.
మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో బైడెన్‌కు భారీ ఆధిక్యం లభిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. 2016లో ఈ మూడు పారిశ్రామిక రాష్ట్రాల్లో రిపబ్లికన్ ప్రత్యర్థి 1 శాతం కంటే తక్కువ మార్జిన్ ఓట్లతో విజయం సాధించారు.

కానీ, 2016లో ట్రంప్‌కు ఘన విజయం అందించిన ఈ యుద్ధభూమి రాష్ట్రాలు ఇప్పుడు ఆయన ప్రచార బృందంలో ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పుడు లోవా, ఒహాయో, టెక్సాస్‌లో ఆయన గెలిచిన ఓట్ల మార్జిన్ 8-10 శాతం మధ్య ఉంది. కానీ ప్రస్తుతం ఆ మూడు రాష్ట్రాల్లో ఆయనకు బైడెన్‌తో పోటాపోటీగా ఉంది.
జులైలో తన రీ-ఎలక్షన్ కాంపైన్ మేనేజర్‌ను మార్చాలనే నిర్ణయం, తరచూ ఆయన చెప్పిన ‘ఫేక్ పోల్స్’ గురించి వివరించడానికి ఆయనకు ఇది సాయం చేయచ్చు. అయితే, ‘బెట్టింగ్ మార్కెట్లు’ కచ్చితంగా ఇప్పటివరకూ ట్రంప్ గురించి రాయడం లేదు. తాజా వ్యత్యాసాలతో నవంబర్ 3న గెలిచేందుకు ఆయనకు మూడింట ఒక అవకాశం ఉంది.
ట్రంప్ గణాంకాలపై కరోనా వైరస్ ప్రభావం చూపిందా?
కరోనా మహమ్మారి అమెరికాలో ఈ ఏడాది ప్రారంభం నుంచీ పతాక శీర్షికల్లో నిలిచింది. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న చర్యలు, పార్టీ శ్రేణుల మధ్య ఊహించినట్లే చీలికలను తీసుకొచ్చింది.
దీనిని జాతీయ అత్యవసర స్థితిగా ప్రకటించి, వైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి రాష్ట్రాలకు 50 బిలియన్ డాలర్లు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత, మార్చి మధ్యలో ట్రంప్ విధానానికి మద్దతు పెరిగింది. ప్రముఖ సర్వే సంస్థ ఇప్సాస్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం 55 శాతం మంది అమెరికన్లు ఆయన చర్యలను సమర్థిస్తున్నారు.
కానీ, ఆ తర్వాత రిపబ్లికన్లు తమ అధ్యక్షుడికి తమ మద్దతు కొనసాగిస్తుంటే, డెమాక్రాట్ల నుంచి మాత్రం ఆయనకు మద్దతు మాయమైపోయింది.

అయితే, దేశంలో పశ్చిమ, దక్షిణ రాష్ట్రాల్లో వైరస్ కేసులు మళ్లీ పెరగడంతో సొంత మద్దతుదారులు కూడా ఆయన స్పందనను ప్రశ్నించడం ప్రారంభించారు. దీంతో రిపబ్లికన్ల మద్దతు జులై ప్రారంభంలో 78 శాతానికి పడిపోయిందని తాజా గణాంకాల చెబుతున్నాయి.
ఇటీవల కరోనావైరస్ గురించి ఆయన ఎందుకు ఆశలు వదులుకున్నారో, “మెరుగుపడేలోపే పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంద”ని హెచ్చరించారో ఇది వివరిస్తోంది.
ఇటీవల ఫేస్ మాస్క్ కూడా వేసుకున్న ఆయన అందరూ వాటిని ధరించాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు. “వాటి ప్రభావం ఉంటుంది, దేశభక్తి చూపించండి” అన్నారు.
వాషింగ్టన్ యూనివర్సిటీలో నిపుణులు రూపొందించిన ఒక ప్రముఖ మోడల్.. ఎన్నికల రోజు నాటికి దేశంలో మృతుల సంఖ్య రెండున్నర లక్షలు దాటుతుందని అంచనా వేసింది.
మనం సర్వేలను నమ్మవచ్చా?
2016లో తల్లకిందులయ్యాయంటూ సర్వేలను కొట్టిపారేయడం సులభమే. అధ్యక్షుడు ట్రంప్ తరచూ అలాగే చేస్తుంటారు. కానీ, అది పూర్తిగా నిజం కాదు.
దేశంలో జరిగిన చాలా సర్వేల్లో హిల్లరీ క్లింటన్ కొన్ని శాతం పాయింట్లతో ముందంజలో ఉన్నారని చెప్పారు. కానీ, అంతమాత్రాన వారు చెప్పింది తప్పని కాదు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఆమె తన ప్రత్యర్థి కంటే 30 లక్షలకు పైగా ఓట్లు గెలుచుకున్నారు.
2016లో సర్వే చేసేవారికి కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా కాలేజీ డిగ్రీ కూడా లేనివారు ఓటర్లకు ప్రాతినిధ్యం వహించడంలో విఫలం అయ్యారు. అంటే కీలకమైన కొన్ని యుద్ధభూమి రాష్ట్రాల్లో ట్రంప్‌కు ఉన్న ప్రయోజనాన్ని రేసులో చివరివరకూ గుర్తించలేకపోయారు. ఇప్పుడు చాలా సర్వే సంస్థలు దానిని సరిదిద్దుకుంటున్నాయి.
కానీ, ఈ ఏడాది కరోనా వైరస్ మహమ్మారి, ఆర్థికవ్యవస్థ రెండింటి ప్రభావం వల్ల నవంబర్‌లో ప్రజలు ఎలా ఓటు వేయబోతున్నారు అనేదానిపై సాధారణం కంటే ఎక్కువ అనిశ్చితి నెలకొని ఉంది. అంటే, అన్ని సర్వేలనూ కాస్త సందేహంగానే చూడాలి. ముఖ్యంగా ఎన్నికల తేదీ ఇంకా చాలాదూరంగా ఉన్నప్పుడు అది తప్పదు.
ఇవి కూడా చదవండి:
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- ఒక మహిళ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేది ఎప్పుడు?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ వణికిపోయారు'
- 'కరోనావైరస్ తొలి వ్యాక్సీన్ మేం తయారు చేశాం... నా బిడ్డకు కూడా టీకా ఇచ్చాం' - రష్యా అధ్యక్షుడు పుతిన్
- ‘‘దేశ ప్రజలకు ప్రత్యక్ష నగదు సహాయం చేయాలి’’: మన్మోహన్ మూడు సలహాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- ’గాంధీ కళ్లద్దాల విలువ చెప్పినప్పుడు.. వాటి యజమానికి గుండె ఆగినంత పనైంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








