ఇమ్రాన్ ఖాన్‌: ‘ఒసామా బిన్ లాడెన్‌ అమరవీరుడు.. అమెరికా కోసం వేలమంది పాకిస్తానీలు బలయ్యారు’

ఒసామా బిన్ లాడెన్, ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images/REUTERS

అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌లాడెన్‌ను పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ అమరవీరుడిగా కొనియాడారు.

"పాకిస్తానీయులకు అది ఇబ్బందికరమైన ప్రకటన, నాతోపాటు అందరం ఇబ్బందిపడ్డాం. ఒసామా బిన్‌ లాడెన్ అబోటాబాద్ వచ్చిన తరువాత అమెరికన్‌ సైనికుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆయన అమరుడు(షాహీద్)'' అని ఇమ్రాన్‌ అన్నారు.

గురువారంనాడు పాకిస్తాన్ పార్లమెంటులో ప్రసంగం సందర్భంగా ఇమ్రాన్‌ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

''ప్రపంచమంతా మన పేరును వాడుకుంది. కొందరు మంచివాళ్లన్నారు. కొందరు చెడ్డవాళ్లన్నారు. మన మిత్రుడు అనుకుంటున్న అమెరికా మనకు చెప్పకుండా పాకిస్తాన్‌ వచ్చి ఒకరిని చంపేసింది. వారి యుద్ధం కోసం 70వేలమంది పాకిస్థానీలు చనిపోయారు'' అన్నారు ఇమ్రాన్‌ ఖాన్‌. ఇంతకంటే ఏ పాకిస్తానీకైనా బాధాకరమైన అంశం ఏముంటుందని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రశ్నించారు.

ఒకవైపు రాజధాని ఇస్లామాబాద్‌లోని ఇమ్రాన్‌ఖాన్ లాడెన్‌ను అమరవీరుడని పొగుడుతున్నారు. మరోవైపు, పంజాబ్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు అల్-ఖైదా సభ్యులను శిక్షిస్తోంది. పంజాబ్‌లోని గుజ్రావాలాలోని యాంటీ టెర్రరిస్ట్‌ కోర్టు అల్-ఖైదాకు చెందిన ఐదుగురు సభ్యులను ఉగ్రవాదనిధులు, పేలుడు పదార్థాలను కలిగి ఉన్న కేసులో దోషులుగా గుర్తించింది.

శిక్షను పొందిన వారిలో అబ్దుల్లా ఉమైర్, అహ్మద్ ఉర్ రెహ్మాన్, అసిమ్ అక్బర్ సయీద్, మహ్మద్ యాకుబ్, మహ్మద్ యూసుఫ్ ఉన్నారు. కోర్టు వారికి 16 సంవత్సరాల జైలుశిక్ష, జరిమానా విధించింది. ఐదుగురు దోషుల వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. వీరందరూ 2019 డిసెంబర్ 26న గుజరాత్‌లో ఉగ్రవాద దాడికి ప్రయత్నించిన సందర్భంగా అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)