హమ్జా బిన్ లాడెన్: ఒసామా బిన్ లాడెన్ కుమారుడు మృతి... అమెరికా ప్రకటన

ఫొటో సోర్స్, cia
అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా చనిపోయాడని అమెరికా నిఘా విభాగం అధికారులు ప్రకటించారు.
అయితే, హమ్జా బిన్ లాడెన్ ఎప్పుడు, ఎక్కడ చనిపోయిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు.
అమెరికా ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో హమ్జా జాడ తెలిపిన వారికి 10 లక్షల బహుమతి ప్రకటించింది.
హమ్జా వయసు 30 ఏళ్ళు ఉండవచ్చని భావిస్తున్నారు. అమెరికా మీద, ఇతర దేశాల మీద దాడులు చేయాలంటూ అతను ఆడియో, వీడియో సందేశాలు విడుదల చేశాడు.
హమ్జా మరణవార్తను మొదటగా ఎన్‌బీసీ, న్యూయార్క్ టైమ్స్ వెల్లడి చేశాయి.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ దీని మీద వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. వైట్ హౌజ్ జాతీయ సెక్యూరిటీ సలహాదారు జాన్ బోల్టన్ కూడా హమ్జా మృతిపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు బదులివ్వలేదు.
అమరికా ప్రత్యేక దళాలు పాకిస్తాన్‌లో 2011 మే నెలలో తన తండ్రిని హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని హమ్జా బిన్ లాడెన్ జిహాదీలకు పిలుపునిచ్చాడు.
అరేబియా ద్వీపకల్పంలోని ప్రజలను కూడా ఆయన అదే విధంగా కోరాడు. సౌదీ అరేబియా గత మార్చి నెలలో అతడి పౌరసత్వాన్నిరద్దు చేసింది.
అతడు ఇరాన్‌లో గృహ నిర్బంధంలో ఉన్నట్లు భావించారు. అయితే, అతడు అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, సిరియాలలో నివసించినట్లు కొన్ని నివేదికలు సూచించాయి.
పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో 2011లో ఒసామాను హతమార్చినప్పుడు స్వాధీనం చేసుకున్న కొన్ని పత్రాలు, అల్ ఖైదా హమ్జాను ఒసామాకు వారసుడిగా తీర్చిదిద్దేందు ప్రయత్నంలో ఉన్నట్లు సూచించాయని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.
మరో అల్ ఖైదా సీనియర్ నేత కూతురితో హమ్జా లాడెన్‌కు వివాహం జరిగినట్లు చెబుతున్న ఒక వీడియోను కూడా అమెరికా దళాలు సంపాదించాయి. అది ఇరాన్‌లో జరిగినట్లు చెబుతున్నారు.
1998లో టాంజానియా, కెన్యాలోని అమెరికా ఏంబసీలపై జరిగిన బాంబు దాడులకు హమ్జా కొత్త మామ అబ్దుల్లా అహ్మద్ అబ్దుల్లా లేదా అబూ ముహమ్మద్ అల్-మస్రీ కారణం అని సూచించాయి.
2001 సెప్టంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడి వెనుక అల్ ఖైదా హస్తం ఉంది. కానీ ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలు పెరగడంతో గత దశాబ్ద కాలంగా ఇది బలహీనమైపోయింది.

ఫొటో సోర్స్, Rewards for Justice

అమెరికా పట్ల ద్వేషంతో పెరిగిన వారసుడు
బీబీసీ ప్రతినిధి క్రిస్ బక్లర్ విశ్లేషణ
హమ్జా బిన్ లాడెన్ వయసెంతో ధ్రువీకరించకపోవడం, అమెరికా అధికారులకు అతడి గురించి ఎంత తెలుసనే విషయాన్ని చెబుతోంది.
గత కొన్ని నెలలుగా హమ్జా అప్గానిస్తాన్, పాకిస్తాన్ లేదా ఇరాన్‌లో ఉండవచ్చని వారికి ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ తమ 'మోస్ట్ వాంటెడ్' హమ్జా వీటిలో ఏ దేశంలో దాగున్నాడో వారు కచ్చితంగా చెప్పలేకపోయారు
9/11 దాడుల కుట్రకు తండ్రి ఒసామా బిన్ లాడెన్ సాయం చేసినపుడు హమ్జా చిన్న పిల్లవాడు. కానీ మిలిటెంట్ గ్రూపులోని ఒక అగ్రనేత అప్పుడతడు తన తండ్రి పక్కనే ఉన్నాడని చెప్పారు.
అమెరికాను ద్వేషించే కొడుకుగా పెరిగిన అతడు ప్రత్యేక దళాల చేతుల్లో చనిపోవడం అనేది, ఎప్పుడూ ఒక ముట్టడిలాగే ఉంటుంది.
కొన్నేళ్ల క్రితం అమెరికా, దాని మిత్ర దేశాలపై దాడులకు పిలుపునిస్తూ హమ్జా ఆన్‌లైన్ సందేశాలు కూడా ఇచ్చాడు.
హమ్జా బిన్ లాడెన్ మరణాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తే, అది అల్ ఖైదాకు కొత్త గొంతుగా ఆవిర్భవించే వారు మౌనంగా ఉండిపోయేలా చేస్తుంది. అయితే, ప్రపంచంలోనే అత్యంత దారుణమైన దాడి చేసిన ఒక సంస్థ నుంచి వచ్చే ముప్పుకు తెరదించలేదు.


ఫొటో సోర్స్, Getty Images
అల్ ఖైదా-ఆవిర్భావం
- అమెరికా మద్దతుతో అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించిన సోవియట్ యూనియన్‌ను తరిమికొట్టేందుకు పోరాడుతున్న అఫ్గాన్ ముజాహిదీలతో చేతులు కలిపిన అరబ్ వాలంటీర్లుగా 1980లలో ఇది ఆవిర్భవించింది.
- ఒసామా బిన్ లాడెన్ ఈ వాలంటీర్లకు సాయం చేసేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేసాడు. దానిని అల్ ఖైదా లేదా 'ది బేస్' అనేవారు.
- ఒసామా బిన్ లాడెన్ 1989లో అఫ్గానిస్తాన్ వదిలివెళ్లాడు. వేలాది విదేశీ ముస్లింలకు మిలిటరీ శిక్షణ శిబిరాలు నడిపేందుకు 1996లో మళ్లీ తిరిగి వచ్చాడు.
- అమెరికన్లు, యూదులు, వారి మిత్రులపై అల్ ఖైదా 'పవిత్ర యుద్ధాన్ని' ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- ఉన్నావ్ రేప్ కేసు: కులదీప్ సింగ్ సెంగర్‌ను బీజేపీ నుంచి ఎందుకు తప్పించడం లేదు?
- రబ్బర్ పరిశ్రమ... భయంకర రక్తచరిత్ర
- అనంతపురం: ఆలయంలో అడుగుపెట్టారని దళిత కుటుంబానికి జరిమానా
- చంద్రయాన్-2 భూకక్ష్యలోకి చేరింది.. దీనివల్ల భారత్‌కు ఏం లభిస్తుంది?
- టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








