అమెరికా నిరసనలు: "ట్రంప్.. చెప్పడానికి ఏమీ లేకపోతే నోరు మూసుకో" - హ్యూస్టన్ పోలీస్ చీఫ్

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో నల్లజాతి ప్రజలపై దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ట్రంప్‌పై హ్యూస్టన్ నగర పోలీస్ చీఫ్ ఆర్ట్ అసివీదో పదునైన వ్యాఖ్యలు చేశారు.
"దేశంలోని పోలీస్ చీఫ్‌ల తరఫున ట్రంప్‌కు ఒక మాట చెబుతున్నా. అల్లర్లు సద్దుమణిగేలా చెప్పేందుకు మీ దగ్గర ఏమీ లేకపోతే.. నోరు మూసుకోండి. ఎందుకంటే మీరు యువతను ముప్పులోకి నెడుతున్నారు"అని అసివీదో వ్యాఖ్యానించారు.
క్యూబా వలసదారుడైన అసివీదో నాలుగేళ్ల వయసులో అమెరికా వచ్చారు. హ్యూస్టన్‌లో పోలీస్ చీఫ్ అయిన తొలి క్యూబా వలసదారుడు ఆయనే.
మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే ఓ నల్ల జాతీయుడు.. పోలీసుల చేతుల్లో మరణించాడు. మే 25న జరిగిన ఈ ఘటన అనంతరం అమెరికాలోని చాలా నగరాల్లో హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
గతవారం హ్యూస్టన్‌లోని అల్లర్లు జరుగుతున్న చోట అసివీదో భావోద్వేగంతో మాట్లాడారు.
"ఓ వలసదారుడిగా మాట్లాడుతున్నా. మనల్ని దొంగలు, నేరస్థులుగా అభివర్ణిస్తున్నవారికి ఓ సందేశమిస్తున్నా. మనమే ఈ దేశాన్ని నిర్మించాం. మనం ఎక్కడికీ పోవట్లేదు.ఇక్కడే ఉంటున్నాం. నీ మనసులో జాతి విద్వేషముంటే.. దాన్ని వదిలించుకో. ఈ నగరంలో మైనారిటీలే మెజారీటీలు. ఇక్కడ అన్ని వర్ణాల వారూ కలిసి జీవిస్తున్నారు. నేను నల్ల జాతివాణ్ని కాకపోయినా.. ఫ్లాయిడ్ వీడియోలో అమ్మా అని అరిచినప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది. న్యాయం కోసం మా పోలీసు విభాగం మొత్తం మీతో కలిసి నడుస్తుంది. నేను కూడా మీతో నడుస్తా. ఎందుకంటే నేను చూస్తూ కూర్చోలేను. ఈ నగరాన్ని చిన్నాభిన్నం కానివ్వను."అని నిరసనకారులతో అసివీదో చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది.
మరోవైపు గవర్నర్లతో కాన్ఫెరెన్స్ కాల్‌లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మాట్లాడారు. "మీలో చాలామంది మెతకగా వ్యవహరిస్తున్నారు. అలా ఉండకూడదు. మనం ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నాం. మీరు బలం చూపించాలి. మీరు బలం చూపించాలి."అని ట్రంప్ అన్న వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి.
ఈ రెండింటితోపాటు అల్లర్లకు సంబంధించి వివిధ అంశాలపై సీఎన్ఎన్ ప్రతినిధి క్రిస్టియాన్ అమన్‌పోర్ నిర్వహించిన కార్యక్రమంలో అసివీదో మాట్లాడారు.

ఫొటో సోర్స్, Reuters
"అధికారులతోపాటు ప్రజలు గాయలపాలవుతున్న సమయంలో చెప్పడానికి ఏమీ లేకపోతే.. ఏం మాట్లాడొద్దు. ఎందుకంటే అది నాయకులకు ఉండాల్సిన ప్రధాన లక్షణం. ఈ సమయంలో నాయకత్వం అవసరం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మేం ఓటు వేసినా.. వేయక పోయినా మీరు మా అధ్యక్షుడే"అని ట్రంప్‌ను ఉద్దేశించి అసివీదో వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"ఇది అధ్యక్షుడిలా ఉండాల్సిన సమయం. అంతేకానీ 'ద అప్రంటీస్' రియాలిటీ షోలో ఉన్నట్లు ఉండకూడదు. ఇదేమీ హాలీవుడ్ కాదు. ఇది నిజ జీవితం. మీరు ప్రజల జీవితాలను ముప్పులోకి నెడుతున్నారు."అని అసివీదో అన్నారు.
"ఇది బల ప్రదర్శన కాదు. ఇది హృదయాలను, మనసులను గెలుచుకోవడానికి సంబంధించిన అంశం."
"దయను నిస్సహాయతగా అనుకోవద్దని ప్రజలను అభ్యర్థిస్తున్నాం."

ఫొటో సోర్స్, DARNELLA FRAZIER
"ఈ దేశంలోని పోలీసుల్లో చాలామంది బాగా పనిచేస్తున్నారు. కొందరైతే 30 ఏళ్లు, 35ఏళ్లు, 40 ఏళ్ల సర్వీసులో ఒక్కసారి కూడా కాల్చలేదు. ఎవరినీ గాయాలపాలు చేయలేదు. అదే సమయంలో వేధించే పోలీసులనూ ఈ దేశం భరిస్తోంది."
"ఎంత వేడుకొంటున్నా పట్టించుకోకుండా.. చేతులకు సంకెళ్లు వేసివున్న ఒక వ్యక్తి మెడపై మోకాలు పెట్టిన పోలీసు అధికారిని క్షమించలేం. అక్కడ జరుగుతున్న ఘటనను ఆపకుండా కూర్చున్న ముగ్గురు పోలీసు అధికారులనూ క్షమించలేం. చట్టం, న్యాయం పక్కన పెట్టినా.. కనీసం వారు తమ మనస్సాక్షిని అనుసరించైనా నడుచుకొని ఉండాల్సింది."
"మేం ఫ్లాయిడ్ కుటుంబానికి మద్దతు తెలుపుతున్నాం. అన్ని జాతులు, వర్ణాలు, తెగలు కలిసి జీవిస్తున్న ఈ హ్యూస్టన్ నగర ప్రజలకు మేం అండగా ఉంటాం. అలాగే వారికి న్యాయం జరిగే వరకూ వారితో కలిసి నడుస్తాం."అని అసివీదో వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ట్విటర్‌లో అసివీదో తన ప్రొఫైల్ పిక్ స్థానంలో ఫ్లాయిడ్ ఫోటోను పెట్టారు.
అసివీదో వ్యాఖ్యలపై అమెరికాతోపాటు భారత్‌లోని ప్రముఖులూ స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"ట్రంప్‌ను అభిశంసన చేసినప్పుడు.. ఆయన నియంతలా అవుతాడని మేం హెచ్చరించాం. నా అభిప్రాయమేమీ మారలేదు. అమెరికా ప్రజలు, కుటుంబాలు, ప్రజాస్వామ్యానికి ఆయన ముప్పు లాంటివారు."అని అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు, డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు వాల్ డెమింగ్స్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
"అధ్యక్షుణ్ని ఓ పోలీసు అధికారి విమర్శిస్తున్నారు. మన దేశంలో పోలీస్ చీఫ్‌ల ఉద్యోగానికి ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ.. ప్రధానిని ఇలా విమర్శించగలరా? అని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
"మన దేశంలో ఏ పోలీస్ చీఫ్ అయినా ఇలా మాట్లాడితే..? దేశ ద్రోహం అభియోగాలు మోపుతారు. అని సినీ ప్రముఖుడు హన్సల్ మెహతా వ్యాఖ్యానించారు."
ఇవి కూడా చదవండి:
- కూతురి కోసం దాచిన రూ. 5 లక్షలు లాక్డౌన్ బాధితులకు ఖర్చు చేసిన సెలూన్ యజమాని
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- ప్రైవేట్ స్పేస్ షిప్లో అంతరిక్షంలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు.. నింగిలోకి ఎగసిన 'క్రూ డ్రాగన్'
- భారత్‌లో కరోనా మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నారా? వాస్తవ సంఖ్యను గుర్తించడం ఎందుకంత కష్టం?
- వైఎస్ జగన్మోహన్రెడ్డి: ‘ఆటుపోట్లను తట్టుకుని గెలిచిన సీఎం... ఎవరినయినా ఎదిరించి నిలిచే తత్వం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)