స్పేస్ ఎక్స్ మిషన్: ప్రైవేట్ స్పేస్ షిప్ 'క్రూ డ్రాగన్'లో అంతరిక్షంలోకి నాసా వ్యోమగాములు

ఫొటో సోర్స్, NASA
- రచయిత, జొనాథన్ ఆమోస్
- హోదా, బీబీసీ సైన్స్ కరెస్పాండెంట్
స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ (ఐఎస్ఎస్) నింగిలోకి పంపిన క్రూ డ్రాగన్ రాకెట్‌లోని వ్యోమగాముల క్యాప్సుల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది.
అంతరిక్ష కేంద్రంలోని బో సెక్షన్‌కు ఉన్న పోర్ట్‌తో ఈ క్యాప్సుల్ అనుసంధానమైంది.
ఇందులో ఉన్న వ్యోమగాములు బాబ్ బెంకెన్, డగ్ హార్లీ... లీకేజీ, పీడనం తనిఖీలు పూర్తయ్యాక అంతరిక్ష కేంద్రం లోపలికి ప్రవేశిస్తారు.
ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో ఉన్న రష్యన్, అమెరికన్ వ్యోమగాములను వారు కలుస్తారు.
అనుకున్న సమయం కన్నా కాస్త ముందే, భారత కాలమాన ప్రకారం ఆదివారం 7.46కి క్రూ డ్రాగన్ క్యాప్సుల్ ఐఎస్ఎస్‌తో అనుసంధానమైనట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ధ్రువీకరించింది.
హార్లీ, బెంకెన్ ప్రమేయం లేకుండానే, పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో ఈ అనుసంధానం జరిగింది. అయితే, మ్యానువల్ పద్ధతిలోనూ దీన్ని చేసేందుకు వారికి శిక్షణ ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అంతకుముందు..స్పేస్ఎక్స్ అంతరిక్షనౌక ‘ద క్రూ డ్రాగన్’ ఇద్దరు నాసా వ్యోమగాములను తీసుకుని మిషన్ కోసం బయలుదేరింది. ఈ మిషన్‌ను అమెరికాలో ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేశారు.
9 ఏళ్ల తర్వాత అమెరికా ఇలాంటి మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఒక ప్రైవేటు అంతరిక్ష నౌక ద్వారా వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్(ఐఎస్ఎస్) దగ్గరకు పంపించడం ఇదే మొదటిసారి.

ఫొటో సోర్స్, @JIMBRIDENSTINE
క్రూ డ్రాగన్ అంతరిక్షనౌకలో వెళ్లిన వ్యోమగాముల పేర్లు బాబ్ బెంకెన్, డగ్ హార్లీ. వీరిని 2000 సంవత్సరంలో ఈ మిషన్ కోసం ఎంపిక చేశారు. ఇద్దరూ స్పేస్ షటిల్ ద్వారా రెండేసి సార్లు అంతరిక్షంలోకి వెళ్లివచ్చారు.
వీరు నాసా ఆస్ట్రనట్ కోర్స్ తీసుకున్న అత్యంత అనుభవజ్ఞులైన వ్యోమగాములు.
ఇద్దరినీ ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్ ‘ద క్రూ డ్రాగన్’ అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్ దగ్గరకు వెళ్లారు.
బెంకెన్, హర్లీ కక్ష్యలోకి చేరుకుని జీరో గ్రావిటీలో ఉంటారు. వీరు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ చేరుకోడానికి దాదాపు 19 గంటలు పట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
బుధవారం చివరి నిమిషంలో లాంచ్ వాయిదా
’క్రూ డ్రాగన్’ లాంచ్ కోసం మొదట బుధవారం ప్రయత్నించారు. కానీ వాతావరణం సరిగా లేకపోవడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని వాయిదా వేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
2011 తర్వాత అమెరికా ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి. ఈ చారిత్రక ఘటనను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా వీక్షించారు.
బుధవారం మొదటిసారి లాంచ్ చేయాలనుకున్నప్పుడు కూడా ఆయన కెనెడీ స్పేస్ సెంటర్ కు వచ్చారు.
నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్ స్టెయిన్ లాంచింగ్ సమయంలో తను ప్రార్థన చేస్తున్నానని చెప్పారు.
“నేను ఉరుములు విన్నాను. కానీ ఆ సమయంలో నేను వేరే ఏదో అనుకుంటున్నా. మన టీం రాకెట్‌లో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. ఇది మా టీమ్. ఇది అమెరికా టీమ్. ఇది మాకు చాలా కఠిన సమయం అనేది వాస్తవం. కానీ ఈ లాంచింగ్ నుంచి మిగతావారికి ప్రేరణ లభిస్తుంది” అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా సహా, ప్రపంచాన్ని కరోనా కల్లోలం కుదిపేస్తున్న సమయంలో శనివారం ఈ ప్రయోగం నిర్వహించారు.
దీంతో కెనెడీ స్పేస్ కాంప్లెక్స్ దగ్గర జనాలు ఎవరూ గుమిగూడవద్దని అధికారులు కోరారు. నాసా కూడా ఈ ప్రయోగం వీక్షించడానికి స్పేస్ పోర్ట్‌లోకి అనుమతించేందుకు చాలా తక్కువ మంది అతిథులను ఆహ్వానించింది.
దీంతో చాలా మంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచీ, సముద్ర తీరాల దగ్గర నుంచే క్రూ డ్రాగన్ ప్రయోగాన్ని వీక్షించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక, వ్యోమగాముల విషయానికి వస్తే అంతరిక్షంలోకి వెళ్లే ముందు వారు సాధారణంగా క్వారంటైన్లోనే ఉంటారు.
కానీ నాసా లాంచింగ్ ఏర్పాట్లు మొదైనలప్పటి నుంచి గత కొన్ని వారాలుగా వ్యోమగాములకు దగ్గరగా పనిచేసేవారి సంఖ్యను చాలా తగ్గించింది. వ్యోమగాములకు దగ్గరగా వెళ్లేవారు కచ్చితంగా మాస్కులు వేసుకోవాలని సూచించింది.
శనివారం క్రూ డ్రాగన్ లాంచ్‌తో 18 ఏళ్ల క్రితం స్థాపించిన స్పేస్ ఎక్స్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. మళ్లీ మళ్లీ వినియోగించే వాహనాలతో స్పేస్‌ఎక్స్ సంస్థ రాకెట్ లాంచింగ్ పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లనుంది.


ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మానవ సహిత అంతరిక్ష రవాణాలో ఒక కొత్త మార్కెట్‌కు ఇది నేతృత్వం వహించబోతోంది.
ఇవి కూడా చదవండి:
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- పాకిస్తాన్: 'పది అడుగుల ఎత్తు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాను...' - కరాచీ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ జుబైర్
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- ‘వీడియో కాల్లో చూస్తుండగానే అమ్మ తుదిశ్వాస విడిచింది.. కోవిడ్-19 మా అమ్మ ప్రాణాలు తీసింది’
- "మా సిబ్బందికి కరోనావైరస్ వస్తుందో లేదో తెలియదు, కానీ వాళ్లు ఆకలితో చనిపోయేలా ఉన్నారు"
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








