అమెరికాలో బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపివేస్తున్నాం: జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటన

ఫొటో సోర్స్, GETTY IMAGES
అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ అమెరికా, కెనడా దేశాలలో తమ బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపి వేయనున్నది.
జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తుల వల్ల తమకు క్యాన్సర్ వచ్చిందనే ఆరోపణలతో నమోదైన వేలాది కేసులను సంస్థ ఎదుర్కొంటోంది.
కొన్ని సంవత్సరాలు పాటు సాగిన కోర్ట్ వివాదాల తర్వాత సంస్థ కొన్ని కోట్ల డాలర్ల పరిహారాన్ని చెల్లించవలసి వస్తోంది.
అయితే కంపెనీ మాత్రం తమ ఉత్పత్తులు సురక్షితమైనవేనని సమర్ధించుకుంటూనే వస్తోంది.
అమెరికా కన్స్యూమర్ వ్యాపారంలో 0. 5 శాతం ఉండే టాల్క్ అమ్మకాలని క్రమేపీ తగ్గించుకుంటూ వస్తామని జాన్సన్ అండ్ జాన్సన్ పేర్కొంది. అయితే, ఇప్పటికే ఉత్పత్తి అయి ఉన్న సరుకుల్ని మాత్రం రిటైల్ మార్కెట్లో అమ్ముతారని తెలిపింది.
సంస్థ టాల్కం పౌడర్‌లో ఆస్‌బెస్టాస్ ఆనవాళ్లు ఉన్నాయన్న ఆరోపణలతో మొత్తం 16,000 కేసులను ఎదుర్కొంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజల అలవాట్లు మారడం వలన, తమ ఉత్పత్తుల సురక్షణ పట్ల తప్పుడు సమాచారం ప్రచారం కావడం వలన కంపెనీ ఉత్పత్తులకు నార్త్ అమెరికాలో డిమాండ్ తగ్గిందని జాన్సన్ అండ్ జాన్సన్ తెలిపింది.
సంస్థపై కేసులు వేయడానికి వినియోగదారులని న్యాయవాదులు ప్రోత్సహించారని పేర్కొంది.
జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ సురక్షితమైనదని తాము కచ్చితంగా నమ్ముతున్నామంది.
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా పరిశీలించి తమ సంస్థ తయారు చేసే ఉత్పత్తుల సురక్షిత ప్రమాణాల ప్రకారం ఉన్నాయని వైద్య నిపుణులు ధృవీకరించినట్లు తెలిపింది.
అయితే.. కరోనా వైరస్‌తో తలెత్తిన పరిస్థితుల్లో భాగంగా తమ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.. బేబీ టాల్క్‌లో ఆస్‌బెస్టాస్ ఛాయలు కనిపించాయని చెప్పిన తర్వాత కూడా సంస్థ అక్టోబర్‌లో తమ ఉత్పత్తుల్లో అసలు ఆస్‌బెస్టాస్ లేదని చెప్పింది.
జాన్సన్ అండ్ జాన్సన్ టాల్క్ ఉత్పత్తుల వల్ల తమకు అండాశయ క్యాన్సర్ వచ్చిందని ఆరోపించిన 22 మంది మహిళలకు 4,700 కోట్ల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని 2018లో కోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయంపై సదరు సంస్థ అప్పీలు చేసింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: మానవ ఉద్యోగులు, కార్మికుల స్థానంలో రోబోలు రాకను కోవిడ్-19 వేగవంతం చేస్తోందా?
- కరోనావైరస్ 2005లో వస్తే ఏం జరిగి ఉండేది?
- కరోనావైరస్: ఈ వ్యాధి చికిత్సకు క్లోరోక్విన్ పనిచేస్తుందా.. అందుకు ఆధారాలు ఉన్నాయా
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్: వైరల్ లోడ్ అంటే.. ఎక్కువ మంది వైద్య సిబ్బంది అనారోగ్యానికి గురవ్వడానికి కారణం ఏంటి
- కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్త
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- జూన్ అల్మీడా: మొదటి కరోనావైరస్ను కనిపెట్టిన మహిళ
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








