India vs New Zealand: టీ-20 మ్యాచ్ టై... ఉత్కంఠగా సాగిన సూపర్ ఓవర్‌లో న్యూజీలాండ్‌పై భారత్ విజయం

ఫొటో సోర్స్, Getty Images
న్యూజీలాండ్‌తో ఆడుతున్న టీ20 సిరీస్‌లో భారత్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది.
బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌లో గెలిచింది.
మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకుంది.


సూపర్ ఓవర్‌లో భారత్ విజయ లక్ష్యం 18 పరుగులు.
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు వచ్చారు.
రోహిత్ తొలి బంతికి రెండు పరుగులు, రెండో బంతికి సింగిల్ తీశాడు.
మూడో బంతికి కేల్ రాహుల్ ఫోర్ కొట్టాడు. తర్వాతి బంతికి సింగిల్ తీసి, స్ట్రయిక్ మళ్లీ రోహిత్‌కు ఇచ్చాడు.
విజయం సాధించాలంటే రెండు బంతుల్లో భారత్ 10 పరుగులు చేయాలి.
ఈ దశలో చివరి రెండు బంతులకు సిక్సర్లు బాది రోహిత్ శర్మ భారత్‌కు విజయం అందించాడు.

ఫొటో సోర్స్, Getty Images
అంతకుముందు పేసర్ మహమ్మద్ షమి పుణ్యమా అని మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వచ్చింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (65), విరాట్ కోహ్లీ (38) రాణించడంతో ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై భారత్ మంచి ఆరంభమే చేసింది. మొదటి ఏడు ఓవర్లలో ఒక వికెట్ కూడా నష్టపోకుండా 77 పరుగులు సాధించింది.
ఆ తర్వాతి 13 ఓవర్లలో మాత్రం 102 పరుగులే వచ్చాయి.
న్యూజీలాండ్ బౌలర్ బెనెట్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఆ తర్వాత ఛేదనకు దిగిన న్యూజీలాండ్ కూడా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులే చేయగలిగింది.
మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా, కేన్ విలియమ్సన్ (95) క్రీజులో పాతుకుపోయాడు.
విజయం న్యూజీలాండ్ వశమైందనుకున్న సమయంలో.. ఆఖరి ఓవర్‌లో అతడు ఔట్ కావడంతో ఫలితం తారుమారైంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆఖరి ఓవర్‌లో షమి బౌలింగ్ అద్భుతంగా వేసి, న్యూజీలాండ్‌ను కట్టడి చేశాడు.
చివరి ఓవర్‌లో కివీస్‌కు గెలవాలంటే 9 పరుగులు కావాలి. విలియమ్సన్‌కు తోడుగా టేలర్ (17) క్రీజులో ఉన్నాడు.
తొలి బంతికే టేలర్ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత మరో పరుగు తీశాడు. ఇక గెలవాలంటే నాలుగు బంతుల్లో కివీస్ రెండు పరుగులు చేస్తే చాలు.
మూడో బంతికి విలియమ్సన్‌ను షమి ఔట్ చేశాడు. ఆ తర్వాతి రెండు బంతుల్లో ఒక బై మాత్రమే వచ్చింది. స్కోర్లు సమమయ్యాయి.
చివరి బంతికి న్యూజీలాండ్‌కు ఒక్క పరుగు చేయాల్సి ఉండగా, టేలర్‌ను షమి బౌల్డ్ చేశాడు.
భారత్‌ను పోటీలో నిలిపాడు.
భారత బౌలర్లలో షమి, శార్దూల్ ఠాకుర్ చెరో రెండు వికెట్లు తీశారు.

ఇవి కూడా చదవండి:
- క్రికెట్ పోటీల్లోకి మరో కొత్త దేశం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నైజీరియా జట్టు
- #HerChoice: నా భర్త నన్ను ప్రేమించాడు, కానీ పడగ్గదిలో హింసించాడు
- 2020: టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు 'బంగారం' పంట పండిస్తుందా?
- నంబి నారాయణన్: ఒక నకిలీ ‘గూఢచార కుంభకోణం’ ఈ సైంటిస్టు జీవితాన్ని ఎలా నాశనం చేసిందంటే..
- భర్త వైద్యం కోసం.. 65 ఏళ్ల వయసులో ఆమె పరుగు పందేల్లో పోటీ పడుతున్నారు
- అడవిలో తప్పిపోయి, 34 రోజులపాటు బెర్రీలు తింటూ ప్రాణాలు నిలబెట్టుకున్న తల్లీ పిల్లలు
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారం: భారత మహిళా క్రీడాకారులు సాధించిన విజయాలకు గౌరవం
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- ఆశిమా ఛిబ్బర్ :మగాడి తోడు లేకుండానే తల్లి అయిన మహిళ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









