చైనా: ‘సబ్‌మెరైన్ నిఘా పరికరాలు’ జాలర్లకు ఎందుకు ఎక్కువగా దొరుకుతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images
చైనా ప్రభుత్వ మీడియాలో ఇలాంటి వార్తలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది.
అయితే, ఈ వార్తల వెనుక మరొక కథ ఉంది. ఒక రహస్యం ఉంది.
మొదటిది.. కేవలం ఇద్దరు, ముగ్గురు కాదు.. ఒక మహిళ సహా మొత్తం 11 మంది ఈ రివార్డులు తీసుకున్నారు. వీళ్లు మొత్తం ఏడు పరికరాలను గుర్తించారు.
రెండోది, జియంగ్సులోని జాలర్లు నిఘా డ్రోన్లను గుర్తించడం ఇదే తొలిసారి కాదు. 2018లో తొమ్మిది పరికరాలను కనిపెట్టిన 18మందికి నజరానా ఇచ్చారు.
మూడోది. ఈ రివార్డులు కూడా భారీగానే ఉంటాయి. సుమారు 5 లక్షల యువాన్ల వరకు నగదు బహుమతి ఇస్తున్నారు.
భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు అర కోటి కంటే ఎక్కువే. కచ్చితంగా చెప్పాలంటే 51 లక్షల 80వేల 129 రూపాయల వరకు నజరానా ఇస్తున్నారు.
అయితే, ఈ సబ్‌మెరైన్ నిఘా పరికరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
చైనాలో అవి ఏం చేస్తున్నాయి?
అవి ఎందుకంత విలువైనవి?
చైనా జాలర్లకే ఇవి ఎక్కువగా ఎందుకు దొరుకుతున్నాయి? సబ్‌మెరైన్ నిఘా పరికరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

ఫొటో సోర్స్, WEIBO
తూర్పు చైనాలో జియంగ్సు ఒక ప్రావిన్స్. దీనికి సుమారు 1000 కిలోమీటర్ల విస్తారమైన తీరప్రాతం ఉంది.
జియంగ్సు ప్రావిన్స్‌కు జపాన్, దక్షిణ కొరియాలు సమీపంగా ఉంటాయి. దక్షిణాన సుమారు 800 కిలోమీటర్ల దూరంలో తైవాన్ ఉంటుంది.
ఈ ప్రాంతంలో అమెరికా ఉనికి కూడా బలంగానే ఉంది.
జాలర్లకు నిఘా పరికరాలు ఎందుకు దొరుకుతున్నాయి?
ఈ పరికరాలు ఎక్కడి నుంచి వచ్చాయో చైనా వెల్లడించలేదు. కానీ వాటిని 'వేరే దేశాలు తయారు చేశాయి' అని మాత్రమే పేర్కొంది.
కానీ ఇవి అమెరికా నేవీ, జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సుల నుంచి వచ్చి ఉంటాయని ప్రాంతీయ నిపుణులు, కన్సల్టెంట్ అలెగ్జాండర్ నీల్ చెప్పారు.
అంటే అమెరికా, జపాన్, తైవాన్ వాళ్లు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
2009లో అమెరికా నేవీ 'అండర్‌వాటర్ డ్రోన్ల'పై పరిశోధన చేయించింది.
వీటినే సముద్ర గర్భంలో మానవ రహిత వాహనాలు (Unmanned Undersea Vehicles -UUV)లు అంటారు. వీటిని ఏడు రకాలుగా ఉపయోగించొచ్చని ఆ పరిశోధన సూచించింది.
- శత్రువుల జలాంతర్గాముల ఆచూకీని కనిపెట్టడానికి..
- నీటి అడుగున ఉన్న బాంబులను గుర్తించడానికి..ముఖ్యంగా పక్క దేశ సముద్ర జలాల్లో ఉన్న బాంబులను పసిగట్టడానికి..
- నిఘా పరికరాలను మోహరించడానికి..
- సముద్రంలోపల సమాచార కేబుళ్ల వంటి మౌలిక వసతులను ఓ కంట కనిపెట్టడానికి వీటిని ఉపయోగించొచ్చని ఆ పరిశోధన సూచించింది.
ఇలాంటి యూయూవీలు చాలా చిన్నగా ఉంటాయి. నెలల తరబడి నీళ్లలో ఉంచొచ్చు. వీటి తయారీ ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని ఆ పరిశోధన వెల్లడించింది.
ఇదంతా పరిశీలిస్తే చైనా జాలర్ల వలలకు ఇలాంటి పరికరాలు ఎందుకు చిక్కుతున్నాయో ఒకరకంగా అర్థం చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, POLRES BINTAN
కొందరు మత్స్యకారులు సైతం చైనా సైన్యంలో భాగంగా ఉన్నారు.
చైనా జాతీయ సైన్యంలో చైనీస్ మెరీటైం మిలీషియా-సీఎంఎం ఒక భాగం.
అమెరికా రక్షణశాఖ 2017లో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం సైనిక కార్యకలాపాల్లో సీఎంఎం కీలక పాత్ర పోషిస్తోంది.
చైనాకు చెందిన చాలా నౌకలు చేపల బోట్ల రూపంలో ప్రత్యర్థులపై ఓ కన్నేసి ఉంచుతాయని నీల్ చెబుతున్నారు.
'చూడ్డానికి అవి అత్యాధునిక, శాస్త్రీయ నౌకల్లా కనిపిస్తాయి. కానీ అవి నిజానికి ఉక్కుతో చేసిన సైనిక పడవలు' అని నీల్ అన్నారు.

చైనా, నీళ్లలో డ్రోన్లను కనిపెట్టడమే కాదు, వాటిని ఆపరేట్ కూడా చేయగలదు.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 70వ వార్షికోత్సవంలో ఏర్పాటు చేసిన సైనిక పరేడ్‌లో హెచ్‌ఎస్‌యూ001 అనే యూయూవీని ప్రదర్శించారు. చిన్నపాటి డ్రోన్లను ప్రయోగించే సామర్థ్యం దీనికి ఉండొచ్చని చెబుతున్నారు.
ఐదు నెలల క్రితం చైనాకు చెందిన మరో యూయూవీ బయటపడింది. చైనా గుర్తులతో ఉన్న 'క్షిపణి' ఇండోనేషియాలోని రియావ్ ద్వీపంలోని జాలర్లకు దొరికింది.
"ఇది క్షిపణి కాదు, సముద్ర డ్రోన్ అని, దీన్ని సహజంగా సముద్ర గర్భంలో పరిశోధనకు ఉపయోగిస్తారు" అని పోలీసులు తెలిపారు.
అయితే, అది ఎక్కడి నుంచి వచ్చిందో నిర్ధరణ కాలేదు. కానీ చైనా ఉప-ఉపరితల నిఘాకు సంబంధించినది అయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీనికి గ్రేట్ అండర్‌వాటర్ వాల్ ఆఫ్ చైనా అని కూడా పేరుంది.
యూయూఏ సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా కొద్దీ చైనా, ఇండోనేషియా లేదా మరో దేశంలోని మత్స్యకారులకు ఇలాంటి డ్రోన్లు ఎక్కువగా దొరుకుతూనే ఉంటాయి.
అత్యాధునిక నావికా దళాల నిఘా సామర్థ్యాన్ని ఇలాంటి డ్రోన్లు మరింత పెంచుతున్నాయని నీల్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ పోలీస్ అధికారి దేవేందర్ సింగ్: 'ఇదంతా ఓ గేమ్.. మీరు దీన్ని పాడు చేయకండి సార్'
- మందగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2020లో ఎలా ఉంటుంది? సవాళ్లకు పరిష్కారం లభిస్తుందా?
- సెక్స్ కోరికలు ఎక్కువైన ఈ తాబేలు 800 తాబేళ్లను పుట్టించింది... తన జాతి అంతరించి పోకుండా కాపాడింది
- భారత 'యూనికార్న్'లు మరీ శక్తిమంతంగా ఎదుగుతున్నాయా?
- అత్యాచారాలపై కేసులు పెట్టిన బాధితులను కొత్త సమస్యలు వేధిస్తున్నాయా...
- GDP: ఆరేళ్ళలో అధమంగా 4.5 శాతానికి ఎలా పడిపోయింది - అభిప్రాయం
- భారీ తిమింగలాలతో పాటు ఎన్నో సముద్ర జీవులను చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- భారత ఆర్థిక వ్యవస్థలు సైబర్ దాడుల్ని తట్టుకోగలవా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








