సోషల్ మీడియాతో లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు... ఎలా?

ఫొటో సోర్స్, BBC/REUTERS
- రచయిత, జేన్ వెక్‌ఫీల్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సోషల్ మీడియాలో జనం తమ జ్ఞాపకాలను మాత్రమే షేర్ చేసుకోవడం లేదు. చాలా మంది దాని ద్వారా పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదిస్తున్నారు. కొంతమందైతే సోషల్ మీడియా వల్ల ధనవంతులు కూడా అవుతున్నారు.
ఒక రిపోర్టు ప్రకారం గత కొన్నేళ్లలో సోషల్ మీడియాలో డబ్బు సంపాదించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రాయోజిత (స్పాన్సర్డ్) ఫొటో సగటు ధర గత కొన్నేళ్లలో చాలా పెరిగిందని మార్కెటింగ్ ఫర్మ్ ఐజడ్ఈఏ తన రిపోర్టులో చెప్పింది.
ఈ రిపోర్టు ప్రకారం 2014లో 134 డాలర్లు (దాదాపు 10 వేలు) ఉన్న ఒక ఫొటో ధర, 2019లో 1,642 డాలర్ల(లక్ష రూపాయలు)కు చేరుకుంది. బిజినెస్ ఇన్‌సైడర్ ఇచ్చిన ఒక రిపోర్టులో "సోషల్ మీడియాలో పోస్ట్, వీడియో, స్టోరీస్, బ్లాగ్స్ స్పాన్సర్ చేయడానికి రకరకాల బ్రాండ్స్ మంచి ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి" అని చెప్పారు.
అయితే, ఇలాంటి కొత్త ట్రెండ్ ద్వారా ప్రకటనలు సాంప్రదాయ పద్ధతులు ఆగిపోతాయని, అందులో అర్థం లేదని ఒక ప్రకటనల నిపుణుడు భావించారు.
"మనం ఏదైనా వస్తువుకు మౌత్ పబ్లిసిటీ ఇస్తాం. డిజిటల్ మార్కెటింగ్ కూడా సరిగ్గా అలాంటిదే. అయినా, ప్రకటనల ప్రపంచంలో డిజిటల్ మార్కెటింగ్, సంప్రదాయ ప్రకటనల మాధ్యమాల మిశ్రమం ఇలాగే కొనసాగుతుంది" అని సోషల్ మీడియా మార్కెటింగ్ ఫ్లాట్‌ఫాం సోషల్ బేకర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యువల్ బెన్ ఇజ్తెక్ చెప్పారు.
జెడ్ఈఏ తన రిపోర్టులో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, బ్లాగ్స్ స్పాన్సర్డ్ కంటెంట్‌పై దృష్టి పెట్టింది. 2014 నుంచి 2019 వరకూ మధ్య ధరల్లో పెరుగుదలను గమనించింది.
ఈ ధరల పెరుగుదల వల్ల సోషల్ మీడియా ద్వారా ప్రముఖులైనవారికి కూడా ప్రయోజనం లభించింది. పెద్ద సెలబ్రిటీలే కాదు, ఎవరి దగ్గర లక్ష ఫాలోవర్లు ఉంటారో వారు కూడా వీటి ద్వారా బాగా డబ్బు సంపాదించగలుగుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రిపోర్టులోని ప్రధాన విషయాలు
- ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రాయోజిత(స్పాన్సర్డ్) ఫొటో సగటు ధర 2018 నుంచి 2019 మధ్య 44 శాతం పెరిగింది.
- ఒక స్పాన్సర్డ్ బ్లాగ్ కోసం 2006లో సుమారు 500 రూపాయలు అవుతుంటే, ఇప్పుడు 2019లో దానికి లక్ష రూపాయల వరకూ అవుతున్నాయి.
- అన్నిటికంటే ఎక్కువ వృద్ధి యూట్యూబ్ వీడియోల్లో కనిపించింది. ఇందులో సుమారు నాలుగు రెట్లు పెరుగుదల ఉంది. 2014లో ఒక స్పాన్సర్డ్ వీడియో కోసం 30 వేల రూపాయలు అయ్యేవి. ఇప్పుడు దాని కోసం దాదాపు 5 లక్షలు అవుతున్నాయి.
- ఒక ఫేస్‌బుక్ స్టేటస్ అప్‌డేట్ ధర 2014లో 576 రూపాయలు ఉండేది. 2019లో అది పెరిగి 28 వేల రూపాయలకు చేరుకుంది.
- ట్విటర్‌లో ఒక స్పాన్సర్డ్ పోస్ట్ ధర రెండు వేల రూపాయల నుంచి పెరిగి 30 వేల రూపాయలకు చేరుకుంది.
- బ్లాగ్ పోస్ట్ ధర కూడా 30 వేల నుంచి లక్ష రూపాయలకు చేరుకుంది.
వినియోగదారుల చట్టాల ఉల్లంఘన
డబ్బు సంపాదించే లక్ష్యంతో జనం సోషల్ మీడియా మాధ్యమాల్లోకి పోటెత్తుతున్నారు. అందుకే సోషల్ మీడియా కూడా ప్రజలపై పర్యవేక్షణను కఠినతరం చేసింది.
గత నెల ప్రకటనల ప్రమాణాల అథారిటీ(అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ అథారిటీ) ముగ్గురి ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు బ్యాన్ చేసింది. ఆహార పదార్థాల గురించి అబద్ధపు వార్తలు ప్రచారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకుంది. అలా చేయడం బాధ్యతారహిత ప్రవర్తనగా కూడా అథారిటీ చెప్పింది.
కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ కూడా కొంతమంది సోషల్ మీడియా ద్వారా వినియోగదారుల చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు హెచ్చరించింది.
ఆ 16 సోషల్ మీడియా సెలబ్రిటీల్లో జో సగ్, గాయని రీటా, మోడల్ రోజీ హంటిగ్టన్ వైట్లీ కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పద్ధతుల్లో తాము మార్పులు చేశామని వారు అంగీకరించారు.

ఫొటో సోర్స్, iStock
సోషల్ బేకర్స్ డేటా ప్రకారం సోషల్ మీడియా ద్వారా నిరంతరం ప్రకటనలు అందించడానికి అవసరమైనంత డబ్బు ఖర్చు చేయడానికి చాలా బ్రాండ్స్ సిద్ధంగా ఉన్నాయి.
ఒక రీసెర్చ్ ప్రకారం గత ఏడాది స్పాన్సర్డ్ పోస్టుల సంఖ్యలో 150 శాతం పెరుగుదల కనిపించింది. ఈ పోస్టుల్లో హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి వాటిని వ్యాప్తి చేశారు.
ఈ వృద్ధి ముందు ముందు కూడా కొనసాగుతుందని బావిస్తున్నారు. 2020లో సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు అందించే ఇండస్ట్రీ 10 బిలియన్ డాలర్ల వరకూ చేరుకోవచ్చని చెబుతున్నారు.
అయితే, ఇన్‌స్టాగ్రామ్ ప్రయోగాత్మకంగా ప్రాయోజిత పోస్టుల నుంచి కొన్ని లైక్స్ దాచేందుకు ఒక ప్రయత్నం చేసింది. అలాంటి వాటివల్ల ఇండస్ట్రీపై ఎలాంటి ప్రభావం పడదని నిపుణులు చెబుతున్నారు.
"సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించే వారు తమ పోస్ట్‌ను చూడవచ్చు. అలాగే బ్రాండ్స్ కూడా తమ స్పాన్సర్డ్ పోస్టుకు ఎంత ఎంగేజ్‌మెంట్ వస్తోందనేది కూడా బ్రాండ్స్ కూడా చూడగలవు" అని సోషల్ బేకర్స్ ఎగ్జిక్యూటివ్ బెన్ ఇట్జెక్ చెప్పారు.
"తక్కువ లైక్స్ కనిపించినా, జనం ఆ పోస్టుకు ఎంగేజ్ అయ్యే ఉంటారా అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న".
ఇవి కూడా చదవండి:
- వారానికి నాలుగు రోజులే పని.. 40 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ అమ్మకాలు
- మహిళా మేయర్ జుట్టు కత్తిరించిన నిరసనకారులు
- 30 ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోకపోతే ఒత్తిడి తట్టుకోలేం: హారీపోటర్ నటి ఎమ్మా వాట్సన్
- 18 ఏళ్ల లోపు పిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఆడడంపై 'కర్ఫ్యూ' విధించిన ప్రభుత్వం
- ఈయూ ఎంపీలను కశ్మీర్ పర్యటనకు తీసుకొచ్చిన మహిళ ఎవరు
- హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం.. స్కూళ్లన్నీ బంద్
- చైనాలో 5జీ నెట్వర్క్ ప్రారంభం... ప్రపంచ టెక్నాలజీలో భారీ ముందడుగు
- తీవ్రవాద సంస్థలకు నిధులు అందకుండా పాకిస్తాన్ అడ్డుకోగలదా...
- పాకిస్తాన్లో ‘గాంధీ’ని కాపాడిన జిన్నా
- అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...
- పిడికెడు మిరపకాయలు, గుప్పెడు అన్నం... అయిదేళ్లు ఆదే ఆమె ఆహారం
- టాకింగ్ బాక్స్: కెన్యాలో బాలికలపై వేధింపులకు ఇవి ఎలా పరిష్కారం చూపిస్తున్నాయి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









