బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ కాల్పుల్లో భారత జవాన్ మృతి

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ సరిహద్దు రక్షక దళాల (బీజీబీ) కాల్పుల్లో భారత జవాన్ మరణించినట్లు సరిహద్దు రక్షణ దళం (బీఎస్ఎఫ్) ధ్రువీకరించింది.
బీఎస్ఎఫ్ కథనం ప్రకారం.. గురువారం (17.10.2019) ఉదయం ముగ్గురు మత్స్యకారులు భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పద్మ నదిలో చేపల వేటకు వెళ్లారు. వారిలో ఇద్దరు తిరిగొచ్చి కాక్మరిచార్ వద్ద బీఎస్‌ఎఫ్ పోస్టులో ఉన్న అధికారులను కలిసి.. చేపల వేటకు వెళ్లిన తమ ముగ్గురిని బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ పట్టుకున్నారని, ఒకరిని వారి అదుపులోనే ఉంచుకుని తమ ఇద్దరినీ విడిచిపెట్టారని చెప్పారు.
దీంతో ఉదయం 10.30 గంటల సమయంలో కాక్మరిచార్ అవుట్ పోస్ట్ కమాండర్ మరో అయిదుగురు జవాన్లతో కలిసి బీఎస్‌ఎఫ్ బోటులో వెళ్లి పద్మ నదిలోని జల సరిహద్దు వద్ద గస్తీలో ఉన్న బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్‌ను సంప్రదించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించినా భారత మత్స్యకారుడిని బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ విడిచిపెట్టలేదు, సరికదా, బీఎస్ఎఫ్ అధికారి, జవాన్లను చుట్టుముట్టే ప్రయత్నం చేశారు.
దీంతో పరిస్థితులు అదుపు తప్పుతున్నట్లు గ్రహించిన బీఎస్ఎఫ్ బృందం వెంటనే వెనక్కు వచ్చేయడానికి ప్రయత్నించింది. ఈలోగా బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ కాల్పులు జరపడంతో బీఎస్ఎఫ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ విజయ్‌భాన్ సింగ్, మరో కానిస్టేబుల్ గాయపడ్డారు.

ఫొటో సోర్స్, TWITTER/@BSF_India
విజయ్‌భాన్ సింగ్‌కు తలకు బుల్లెట్ గాయం కాగా, కానిస్టేబుల్ కుడి చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.
వెంటనే వారిద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా తలకు బుల్లెట్ గాయమైన విజయ్‌భాన్ సింగ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.
గాయపడిన కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీకి మెరుగైన వైద్యం కోసం తరలించారు.
ఈ ఘటనపై బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ అధికారులకు సమాచారం అందించినట్లు బీఎస్‌ఎఫ్ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
కాగా బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఫిరదౌస్ మహమ్మద్ 'బీబీసీ బంగ్లా'తో మాట్లాడుతూ బీఎస్ఎఫ్ దళాలు సరిహద్దు దాటి బంగ్లాదేశ్‌లోకి వచ్చాయని, వారే తొలుత కాల్పులు జరపగా తాము తిరిగి కాల్పులు జరిపామని తెలిపారు.
బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఒకరు చనిపోయినట్లు తమకు సమాచారం ఇచ్చారని, కానీ.. తమకున్న సమాచారం మేరకు అలాంటిదేమీ లేదని, దర్యాప్తు చేస్తున్నామని ఫిరదౌస్ మహమ్మద్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
- 9/11 దాడులను అమెరికా కావాలనే అడ్డుకోలేదా? కుట్ర సిద్ధాంతాలు ఏమంటున్నాయి, నివేదికలు ఏం చెబుతున్నాయి?
- మూడో జాతీయ భద్రతా సలహాదారును మార్చేసిన ట్రంప్
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- అరటి పళ్లపై జీఎస్టీ ఎంత? రెస్టారెంట్లలో తింటే దేనికి పన్ను కట్టాలి? దేనికి అక్కర్లేదు?
- పాకిస్తాన్‌లోని వేలాది హిందూ ఆలయాలకు మోక్షం ఎప్పుడు?’
- YouTube Stars: అమ్మాయిల కోసం, అమ్మాయిల చేత, అమ్మాయిలతో.. ‘గాళ్ ఫార్ములా’
- BODMAS: 8÷2(2+2) = ?.. ఈ ప్రశ్నకు మీ జవాబు ఏంటి?
- వైఎస్ రాజశేఖర రెడ్డి: హెలికాప్టర్ అదృశ్యం తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది?
- చార్లెస్ డార్విన్‌కూ అంతుచిక్కని మిస్టరీ: జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించిన 'విసుగుపుట్టించే రహస్యం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








