కశ్మీర్ కోసం భారత్‌తో యుద్ధం రావచ్చు: ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images
ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాన మంత్రి అయినప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక రంగంలో డిఫాల్టర్ కాకుండా ఎలాగోలా తప్పించుకున్న పాకిస్తాన్ ఇప్పటికీ ఆ సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడలేదు.
మరోవైపు భారత్‌లో ఇటీవల కశ్మీర్ అంశంపై దేశంలో తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నాయి. పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలు కూడా వేడెక్కాయి.
భారత్ జమ్ము-కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన అంశాన్ని పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి వేదికపైనా లేవనెత్తింది. కానీ ఎలాంటి విజయం సాధించలేకపోయింది.
ఇమ్రాన్ ఖాన్‌ను పాకిస్తాన్‌లోని ఆయన వ్యతిరేకులు యూ-టర్న్ పీఎం అంటారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయ్యాక దేశాన్ని కొత్త పాకిస్తాన్‌గా మారుస్తానని హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ క్షేత్ర స్థాయిలో దానికోసం ఎలాంటి చర్యలూ చేపట్టలేకపోయారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అల్ జజీరా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కశ్మీర్ కోసం భారత్‌తో యుద్ధం జరగవచ్చని అన్నారు.
అణు శక్తి ఉన్న రెండు దేశాల మధ్య ఏదైనా పెద్ద ఘర్షణ లేదా యుద్ధం జరిగే అవకాశం ఉందా? అని ప్రశ్నించినప్పుడు ఆయన, "అవును, రెండు దేశాల మధ్య యుద్ధ ప్రమాదం ఉంది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌కు పొరుగు దేశాల్లో చైనాతో ఉన్న సంబంధాలు చారిత్రకంగా చాలా సన్నిహితమైనవి. కానీ అవి భారత్‌తో అత్యంత దిగువ స్థాయిలో ఉన్నాయి.
కశ్మీర్ గురించి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ "80 లక్షల ముస్లింలు గత 6 వారాలుగా బందీలుగా ఉన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదం వ్యాపింపచేస్తోందని ఆరోపిస్తున్న భారత్.. ఈ అంశం నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించాలని చూస్తోంది. పాకిస్తాన్ ఎప్పుడూ యుద్ధాన్ని ప్రారంభించదు. దానిపై పూర్తి స్పష్టతతో ఉన్నాం. నేను శాంతికాముకుడిని. యుద్ధవ్యతిరేకిని. యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదని భావిస్తాను" అన్నారు.
భారత్ మమ్మల్ని దివాలా తీయించాలనుకుంటోంది
"అణు శక్తి ఉన్న రెండు దేశాలు ఢీకొన్నప్పుడు దాని ఫలితాన్ని ఊహించడం కూడా కష్టం. అందుకే మేం ఐక్యరాజ్య సమితిని సంప్రదించాం. ప్రపంచంలోని అన్ని ముఖ్యమైన వేదికలపైనా ఈ అంశాన్ని లేవనెత్తాం. మేం దీనికి రాజకీయ పరిష్కారం కోరుకుంటున్నాం. ఈ అంశం యుద్ధానికి దారితీస్తే, అది భారత ఉపఖండం వరకే పరిమితం కాదు. అంతకు మించి ముందుకెళ్తుంది. దానివల్ల మొత్తం ప్రపంచం ప్రభావితం అవుతుంది" అని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు.
ఈ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ "మేం భారత్‌తో చర్చలకు ప్రయత్నిస్తున్నాం. కానీ భారత్ మమ్మల్ని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ బ్లాక్ లిస్టులో పెట్టించే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ బ్లాక్ లిస్టులోకి చేరితే మాపై ఎన్నో ఆంక్షలు అమలవుతాయి. భారత్ మమ్మల్ని దివాలా తీయించాలని అనుకుంటోంది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చర్చల ప్రశ్నే లేదు
"భారత ప్రభుత్వం తన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అందుకే ఇక, వారితో చర్చల ప్రశ్నే లేదు. అది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రస్తావనకు వ్యతిరేకంగా చట్టవిరుద్ధంగా కశ్మీర్‌ను తనలో కలుపుకుంది. అందులో జనాభిప్రాయ సేకరణకు గ్యారంటీ ఇచ్చారు. అలా భారత్ ఐక్యరాజ్య సమితి చట్టాన్ని ఉల్లంఘించడంతోపాటు, తన రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించింది" అని ఇమ్రాన్ ఆరోపించారు.
భారత్ మాత్రం జమ్ము-కశ్మీర్ తమ అంతర్గత అంశమని, అందులో ఎవరి జోక్యమూ అంగీకరించమని స్పష్టం చేసింది.
భారత్ కశ్మీర్‌పై చర్చలు జరపాలని అనుకోకపోతే పాకిస్తాన్ ఏం చేస్తుంది?
ఈ ప్రశ్నకు సమాధానంగా "రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. మేం అక్కడ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తాం. ఏదో ఒక పరిష్కారం లభిస్తుందనే అనుకున్నాం. ప్రపంచంలోని బలమైన దేశాలన్నింటినీ సంప్రదిస్తున్నాం. కశ్మీర్ అంశాన్ని పరిష్కరించకపోతే దాని ప్రభావం మొత్తం ప్రపంచంపై పడుతుందని చెప్పాం. ఏయే దేశాలకు భారత్ పెద్ద మార్కెట్‌గా కనిపిస్తోందో, అవి వ్యాపార దృష్టితో ఆలోచిస్తున్నాయి. తాము జోక్యం చేసుకోకపోతే ఆ ప్రభావం భారత ఉపఖండంమీదే కాదు, ప్రపంచమంతా పడుతుందనే విషయం వారికి తెలీడం లేదు" అన్నారు ఇమ్రాన్ ఖాన్.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ రూపాయి: ఆసియాలోనే అత్యంత బలహీనమైన కరెన్సీ
- మోదీ వల్ల పాకిస్తాన్లో కశ్మీర్‌పై చర్చ స్వరూపమే మారిపోయిందా...
- బ్రిటన్ నల్లమందు వ్యాపారం భారతీయులను పేదరికంలోకి ఎలా నెట్టింది
- చంద్రయాన్-2: వైఫల్యానికి కారణం ఇదేనా
- ప్రయోగానికి ముందే రాకెట్ పేలిపోయింది
- కశ్మీర్: మహమ్మద్ గజనీకి ముచ్చెమటలు పట్టించిన హిందూ రాజుల కథ
- 'మమ్మల్ని కొట్టకండి, కాల్చి చంపేయండి...'
- భారత వాయుసేనలో చేరిన అపాచీ హెలికాప్టర్ల దళం.. వీటి ప్రత్యేకతలేంటి
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








