హమ్జా బిన్ లాడెన్: అల్ ఖైదా నాయకుడి కుమారుడు చనిపోయాడని ధ్రువీకరించిన ట్రంప్

ఫొటో సోర్స్, cia
అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా చనిపోయాడని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు.
అమెరికా ఇంటలిజెన్స్ అధికారుల నుంచి లభించిన సమాచారం ప్రకారం హమ్జా బిన్ లాడెన్ చనిపోయాడని ఆ దేశ మీడియా గత నెలలోనే ప్రకటించింది.
హమ్జా అంతర్జాతీయ తీవ్రవాది అని అమెరికా రెండేళ్ళ కిందటే అధికారికంగా ప్రకటించింది.
ఒసామా బిన్ లాడెన్‌కు బలమైన వారసుడిగా గుర్తింపు పొందిన హమ్జా వయసు దాదాపు 30 ఏళ్ళు. అమెరికా తదితర దేశాల మీద అతడు దాడులకు పిలుపునిచ్చాడు.
"అల్ ఖైదా అగ్ర నాయకులలో ఒకరు, ఒసామా బిన్ లాడెన్ కుమారుడైన హమ్జా బిన్ లాడెన్ చనిపోయాడు. అఫ్గానిస్తాన్ - పాకిస్తాన్ ప్రాంతంలో అమెరికా నిర్వహిస్తున్న తీవ్రవాద వ్యతిరేక చర్యలలో అతను మృతిచెందాడు" అని వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Rewards for Justice
అయితే, హమ్జా చనిపోయింది ఎప్పుడు, ఏ ఆపరేషన్‌లో అన్నది ఆ ప్రకటనలో వెల్లడించలేదు.
అమెరికా ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో హమ్జా జాడ తెలిపిన వారికి 10 లక్షల బహుమతి ప్రకటించింది.
అమెరికా ప్రత్యేక దళాలు పాకిస్తాన్‌లో 2011 మే నెలలో తన తండ్రిని హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని హమ్జా బిన్ లాడెన్ జిహాదీలకు పిలుపునిచ్చాడు.
అరేబియా ద్వీపకల్పంలోని ప్రజలను కూడా ఆయన అదే విధంగా కోరాడు. సౌదీ అరేబియా గత మార్చి నెలలో అతడి పౌరసత్వాన్నిరద్దు చేసింది.
1998లో టాంజానియా, కెన్యాలోని అమెరికా ఏంబసీలపై జరిగిన బాంబు దాడులకు హమ్జా కొత్త మామ అబ్దుల్లా అహ్మద్ అబ్దుల్లా లేదా అబూ ముహమ్మద్ అల్-మస్రీ కారణం అని సూచించాయి.
2001 సెప్టంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడి వెనుక అల్ ఖైదా హస్తం ఉంది. కానీ ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలు పెరగడంతో గత దశాబ్ద కాలంగా ఇది బలహీనమైపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
అల్ ఖైదా-ఆవిర్భావం
- అమెరికా మద్దతుతో అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించిన సోవియట్ యూనియన్‌ను తరిమికొట్టేందుకు పోరాడుతున్న అఫ్గాన్ ముజాహిదీలతో చేతులు కలిపిన అరబ్ వాలంటీర్లుగా 1980లలో ఇది ఆవిర్భవించింది.
- ఒసామా బిన్ లాడెన్ ఈ వాలంటీర్లకు సాయం చేసేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేసాడు. దానిని అల్ ఖైదా లేదా 'ది బేస్' అనేవారు.
- ఒసామా బిన్ లాడెన్ 1989లో అఫ్గానిస్తాన్ వదిలివెళ్లాడు. వేలాది విదేశీ ముస్లింలకు మిలిటరీ శిక్షణ శిబిరాలు నడిపేందుకు 1996లో మళ్లీ తిరిగి వచ్చాడు.
- అమెరికన్లు, యూదులు, వారి మిత్రులపై అల్ ఖైదా 'పవిత్ర యుద్ధాన్ని' ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- 'నన్ను రేప్ చేశారు... ఇప్పుడు నా కూతుళ్లనూ అలా చేస్తారేమోనని భయపడుతున్నా'
- మానవ నివాసయోగ్యమైన ఆ గ్రహం మీద తొలిసారిగా గుర్తించిన నీటి జాడలు
- ఎడమ చేతి అలవాటుకు కారణమేంటి?
- చే గువేరా భారత్ గురించి ఏమన్నారంటే..
- సోషల్ మీడియా నుంచి మీ పర్సనల్ డేటాను వెనక్కి తీసుకోవడం సాధ్యమేనా...
- గూగుల్ మ్యాప్ గుర్తించిన నీటమునిగిన కారు, అందులో ఓ అస్థిపంజరం... దాని వెనుక 22 ఏళ్ళ నాటి కథ
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
- ఓలా, ఉబెర్ల వల్ల కార్ల అమ్మకాలు తగ్గాయా... ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వాదనలో నిజమెంత?
- చెన్నైలో 20 ఏళ్ల కిందట కిడ్నాపైన బాలుడు.. అమెరికా నుంచి తిరిగొచ్చాడు. ఎలాగంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










