‘మా దేశాన్ని అంతర్జాతీయ క్రీడా పోటీల నుంచి నిషేధించండి’ - ప్రపంచ దేశాలను కోరుతున్న ఇరాన్ ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టామ్ గెర్కెన్
- హోదా, బీబీసీ న్యూస్
దేశంలో ప్రభుత్వం మీద తీవ్ర నిస్పృహలో ఉన్న ఇరాన్ ప్రజలు.. అంతర్జాతీయ క్రీడల్లో తమ దేశం పాల్గొనకుండా నిషేధించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నారు.
'క్రీడల్లో ప్రభుత్వ జోక్యాని'కి నిరసనగా ఈ నిషేధం కోరుతూ ప్రారంభించిన #BanIRSportsFederations హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్‌లో 24 గంటల్లో 60,000 మందికి పైగా ఉపయోగించారు.
దేశీయంగా ఫుట్‌బాల్ క్రీడ, అంతర్జాతీయంగా జూడో పోటీలకు సంబంధించి రెండు కీలక సంఘటనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పాలకులు - ప్రజల మధ్య ఉన్న తీవ్ర అంతరాలను ఇవి చాటుతున్నాయని సోషల్ మీడియా యూజర్లు చెప్తున్నారు.
పురుషుడిగా మారువేషం వేసుకుని ఫుట్‌బాల్ స్టేడియంలోకి ప్రవేశించటానికి ప్రయత్నించిన ఒక 29 ఏళ్ల మహిళ.. అందుకు తనకు జైలు శిక్ష విధించటాన్ని నిరసిస్తూ టెహ్రాన్‌లోని ఒక కోర్టు వెలుపల ఒంటికి నిప్పు అంటించుకున్నారు. ఆమెకు మద్దతుగా చాలా మంది యూజర్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇరాన్‌లో మహిళలు అధికారిక ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు హాజరవటానికి ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. మహిళలు ఆ మ్యాచ్‌లు తిలకించేందుకు ఆగస్టు 31వ తేదీ లోగా అనుమతించాలంటూ ఫిఫా డెడ్‌లైన్ విధించినా ఫలితం లేకపోయింది.
ఆ మహిళకు జైలు శిక్ష విధించటాన్ని ఇరాన్ పురుషుల టీమ్ కెప్టెన్ మసోద్ షోజాయ్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పర్షియా భాషలో రాసిన పోస్ట్‌లో ఖండించారు.
''ఫుట్‌బాల్ తిలకించటానికి ప్రయత్నించిందంటూ ఒక యువతికి జైలు నిర్బంధాన్ని పొడిగించటం.. ఆ యువతి ఆత్మాహుతి చేసుకోవటానికి కారణంమైంది. ఆ నిబంధనలు కాలం చెల్లిన ఛాందస ఆలోచనల్లో పుట్టినవనటంలో సందేహం లేదు. వాటిని భవిష్యత్ తరాలు వీటిని అర్థంచేసుకోవు...'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కేసు తీర్పు నేపథ్యంలో ఇరాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను శిక్షించాలని సోషల్ మీడియాలో చాలా మంది ఫిఫాకు పిలుపునిచ్చారు.
ఇరాన్ ప్రభుత్వం బాధ్యత వహించేలా చేయాలని ఈ హ్యాష్‌ట్యాగ్ ఉపయోగిస్తూ నిరసనకారులు డిమాండ్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇంకొందరు జూడో క్రీడాకారుడు సయీద్ మోలే ఉదంతాన్ని ప్రస్తావించారు. జపాన్‌లో జరుగుతున్న 2019 జూడో ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో.. ఇజ్రాయెలీ క్రీడాకారుడితో తలపడే పరిస్థితిని తప్పించుకోవటానికి ఆ పోటీల నుంచి తనను వైదొలగాలని ఇరాన్ అధికారులు తనకు చెప్పారని.. దీంతో తనకు ప్రాణభయం ఉందని ఆయన చెప్పటంతో ఈ అంశం కూడా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఇజ్రాయెల్ దేశాన్ని ఇరాన్ గుర్తించటం లేదు. అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల్లో తన అథ్లెట్లు ఇజ్రాయెల్ క్రీడాకారులతో ముఖాముఖి తలపడటాన్ని నిషేధించింది.
జూడో చాంపియన్‌షిప్ పోటీలో రష్యా ఒలింపిక్ చాంపియన్ ఖాసన్ ఖాల్ముర్జేవ్‌తో మ్యాచ్ నుంచి వైదొలగాల్సిందిగా ఇరాన్ అధికారులు తనకు చెప్పారని మోలే తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో ఇజ్రాయెల్ క్రీడాకారుడు సాగీ ముకీతో తాను తలపడే పరిస్థితిని నివారించటానికి ఇలా చేయాలని ఆదేశించినట్లు ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
కానీ ఆయన వైదొలగకుండా పోటీల్లో కొనసాగాడు. అయితే సెమీ ఫైనల్‌లో ఓడిపోయాడు. ఈ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన మోకీ.. 81 కిలోల విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న మోలేను కిందికి పంపి ఆ స్థానం కైవసం చేసుకున్నాడు.
ఇజ్రాయెల్ క్రీడాకారుడితో తలపడే పరిస్థితిని తప్పించుకోవటానికి మ్యాచ్‌లో ఓడిపోవాలంటూ ఇరాన్ క్రీడాకారులకు నిర్దేశించటం ఇదే మొదటిసారి కాదు.
2017లో ఇరాన్ రెజ్లర్ అలీరెజా కరీమీ మాచ్నియానీ.. సీనియర్ యూ23 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో ఉద్దేశపూర్వకంగా ఓడిపోయేలా ఇరాన్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది.
కరీమ్ మాచ్నియానీ ముందంజలో ఉన్నపుడు.. తర్వాతి రౌండ్‌లో అతడి ప్రత్యర్థిగా ఒక ఇజ్రాయెలీ క్రీడాకారుడు క్వాలిఫై కావటంతో.. మ్యాచ్ మధ్యలో కరీమ్‌ను అతడి ట్రైనర్ నిలిపివేశాడు. మ్యాచ్ మళ్లీ మొదలైన తర్వాత కరీమ్ 3-14 పాయింట్లతో ఓడిపోయాడు.
ఇది ప్రభుత్వ జోక్యమని ఇరాన్ ట్విటర్ యూజర్లు కొందరు అభివర్ణిస్తున్నారు. అంతర్జాతీయ పోటీల్లో ఇరాన్ పాల్గొనకుండా నిషేధించాలని ప్రపంచ క్రీడా సంస్థలను కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ నల్లమందు వ్యాపారం భారతీయులను పేదరికంలోకి ఎలా నెట్టింది
- మరో ఐఏఎస్ అధికారి రాజీనామా: ‘ప్రజాస్వామ్య విలువలపై రాజీ పడుతున్నవేళ ఐఏఎస్‌గా కొనసాగలేను’
- మంగాయమ్మ: ఐవీఎఫ్ పద్ధతిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన 73 ఏళ్ల బామ్మ
- అస్సాం: "రక్తమిచ్చి ప్రాణాలు కాపాడిన డాక్టర్నే చంపేశారు".. ఎందుకు?
- #నో బ్రా ఉద్యమం: బ్రా వేసుకోకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్న దక్షిణ కొరియా మహిళలు
- అండ దానం: ‘కొన్ని కుటుంబాల ఆశలు నామీదే ఉన్నాయి’
- ఈ కోడి పుంజు కూత పెట్టే తన హక్కును పోరాడి సాధించుకుంది... ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








