క్రికెట్ ప్రపంచ కప్ విజేత ఇంగ్లండ్... ఫైనల్, సూపర్ ఓవర్ టై.. ఉత్కంఠభరిత మ్యాచ్ సాగింది ఇలా

ఫొటో సోర్స్, Getty Images
లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్-న్యూజీలాండ్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో విజయం సాధించిన ఇంగ్లండ్ మొట్టమొదటిసారి ప్రపంచ విజేతగా ఆవిర్భవించింది.
సూపర్ ఓవర్ టై అయితే ఇన్నింగ్స్ తో పాటు సూపర్ ఓవర్లో ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టునే విజేతగా నిర్ణయిస్తారు.
దీని ప్రకారం ఈ ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టిన ఇంగ్లండ్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
న్యూజీలాండ్ తమ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, రెండు సిక్సర్లు మాత్రమే కొట్టింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
టాస్ గెలిచిన న్యూజీలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.
242 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కూడా 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
చివరి బంతి వరకూ దోబూచులాడిన విజయం చివరకు రెండు జట్లనూ సూపర్ ఓవర్‌కు చేర్చింది.
చివరికి సూపర్ ఓవర్‌లో కూడా ఇరు జట్లూ 15 పరుగుల చొప్పున చేయడంతో అది కూడా టై అయ్యింది.
బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్ ప్రపంచ విజేతగా నిలిచింది.
2019 ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిలిచాడు.
ఫైనల్లో ఇంగ్లండ్ విజయానికి కీలకంగా మారిన బెన్ స్టోక్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మకు గోల్డెన్ బ్యాట్ లభించింది.

ఫొటో సోర్స్, Getty Images
సూపర్ ఓవర్ ఉత్కంఠ...
న్యూజీలాండ్ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాలి.
ఇంగ్లండ్ బౌలర్ ఆర్చర్ సూపర్ ఓవర్ వేశాడు. నీషామ్, గప్తిల్ బ్యాటింగ్ చేశారు.
తొలి బంతి వైడ్ పడింది.
మొదటి బంతికి నీషామ్ రెండు పరుగులు వచ్చాయి.
రెండో బంతికి నీషామ్ సిక్స్ కొట్టాడు.
మూడో బంతికి నీషామ్ రెండు పరుగులు వచ్చాయి.
నాలుగో బంతికి రెండు పరుగులు తీశారు.
ఐదో బంతికి ఒక్క పరుగే వచ్చింది.
ఆరో బంతికి రెండో పరుగు తీసే ప్రయత్నంలో గప్తిల్ రనౌట్ అయ్యాడు.
దీంతో వికెట్ కోల్పోకుండా పరుగులు చేసిన ఇంగ్లండ్ విజేతగా నిలిచింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మొదట ఇంగ్లండ్ సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేసింది.
కివీస్ బౌలర్ బౌల్ట్ సూపర్ ఓవర్ వేస్తే, స్టోక్స్ బట్లర్ బ్యాటింగ్‌కు దిగారు.
తొలి బంతికి స్టోక్స్ మూడు పరుగులు కొట్టాడు.
రెండో బంతికి ఒక్క పరుగే వచ్చింది.
మూడో బంతికి స్టోక్స్ ఫోర్ కొట్టాడు.
నాలుగో బంతికి ఒక్క పరుగు వచ్చింది.
ఐదో బంతికి రెండు పరుగులు వచ్చాయి.
ఆరో బంతికి స్టోక్స్ ఫోర్ కొట్టాడు.
-------- సూపర్ ఓవర్‌లో కూడా ఇంగ్లండ్ 15 పరుగులే చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
అంతకు ముందు...
242 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ 28 పరుగులకే జేసన్ రాయ్ వికెట్ కోల్పోయింది.
తర్వాత వచ్చిన జో రూట్(7), అవుటైన తర్వాత అవతలివైపు కుదురుగా ఆడుతున్న బెయిర్‌స్టో(36) కూడా ఔట్ అవడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది.
తర్వాత కాసేపటికే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(9) కూడా ఔట్ అయ్యాడు.
తర్వాత బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ వంద పరుగుల భాగస్వామ్యం అందించారు 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన జట్టును 200కు చేరువ చేశారు.
196 పరుగుల దగ్గర బట్లర్(59) ఔట్ అవడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది.
తర్వాత వచ్చిన వారందరూ స్టోక్స్‌కు అండగా నిలవలేకపోయారు. వోక్స్ 2, ప్లంకెట్ 10 పరుగులు చేయగా, ఆర్చర్, రషీద్, వుడ్ డకౌట్ అయ్యారు.
చివరి ఓవర్లో ఉత్కంఠ
ఆరు బంతులు... 15 పరుగులు కావాలి.
తొలి బంతికి పరుగు రాలేదు...
రెండో బంతికి పరుగు రాలేదు...
మూడో బంతికి స్టోక్స్ సిక్స్ కొట్టాడు...
నాలుగో బంతికి స్టోక్స్ రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించగా, ఓవర్ త్రో వల్ల మరో 4 పరుగులు వచ్చాయి.
ఐదో బంతికి రెండో పరుగు తీసే ప్రయత్నంలో రషీద్ రనౌట్ అయ్యాడు.
ఆరో బంతికి రెండో పరుగు తీసే ప్రయత్నంలో వుడ్ రనౌట్ అయ్యాడు.
చివరి వరకూ నిలబడి ఆడిన బెన్ స్టోక్స్ 84 పరుగులు చేసి చివరి వరకూ నాటౌట్‌గా నిలిచాడు.
ఒకవైపు జట్టు వికెట్లు పడుతున్నా పోరాడిన స్టోక్స్ మ్యాచ్‌ను టై చేయగలిగాడు. సూపర్ ఓవర్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలవడానికి కీలకంగా నిలిచాడు.
50వ ఓవర్ ముగిసేసరికి ఇంగ్లండ్ 241 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ చేరింది.
చివరి ఓవర్లో ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ రనౌట్ అయ్యారు.
న్యూజీలాండ్ బౌలర్లలో ఫెర్గూసన్, నీషామ్ మూడేసి వికెట్లు పడగొట్టగా, హెన్రీ, గ్రాండ్‌హోమే తలో వికెట్ తీశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
న్యూజీలాండ్ బ్యాటింగ్..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని జోరుగా బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజీలాండ్ ఏడో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది.
గప్తిల్ మరోసారి తక్కువ పరుగులకే(19) ఔట్ అయ్యాడు. వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యు అయ్యాడు.
తర్వాత ఓపెనర్ నికోల్స్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టు స్కోరును వంద దాటించారు.
103 పరుగుల దగ్గర అప్పుడప్పుడే క్రీజులో కుదురుకుంటున్న కేన్ విలియమ్సన్(30) ఔట్ అయ్యాడు. ప్లంకెట్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
తర్వాత ప్లంకెట్ బౌలింగ్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న నికోల్స్(55) ఔట్ అయ్యాడు.
తర్వాత న్యూజీలాండ్ న్యూజీలాండ్ వికెట్ కీపర్ లాథమ్ ఒంటరి పోరాటం చేశాడు.
టేలర్(15), నీషామ్(19), గ్రాండ్‌హోమే(16)తో కలిసి జట్టు స్కోరును 200 దాటించాడు.
స్కోరు పెంచే ప్రయత్నంలో 232 పరుగుల దగ్గర లాథమ్ ఔట్ అయ్యాడు. 56 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 47 పరుగులు చేశాడు.
తర్వాత చివరి ఓవర్లో హెన్రీ(4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
శాంట్నర్(5), బౌల్ట్(1) చివరి వరకూ నాటౌట్‌గా నిలిచారు.
ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, ప్లంకెట్ చెరి 3 వికెట్లు పడగొట్టగా, ఆర్చర్, వుడ్ ఒక్కో వికెట్ తీశారు.

ఫొటో సోర్స్, AFP
50 ఓవర్లో రెండు రనౌట్లు
50వ ఓవర్లో పరుగులు పెంచే క్రమంలో రషీద్, వుడ్ రనౌట్ అయ్యారు.
49వ ఓవర్లో ప్లంకెట్, ఆర్చర్ ఔట్
49వ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది.
నీషామ్ బౌలింగ్‌లో ప్లంకెట్(10) బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చాడు.
47వ ఓవర్లో ఆరో వికెట్...
203 పరుగుల దగ్గర వోక్స్(2) ఔట్ అయ్యాడు.
ఫెర్గూసన్ బౌలింగ్‌లో కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఇదే ఓవర్లో 200 పరుగుల మైలురాయిని దాటింది.
46 ఓవర్లో 196/5
196 పరుగులకు ఇంగ్లండ్ ఐదో వికెట్ పడింది.
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జాస్ బట్లర్(59) ఫెర్గూసన్ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
బట్లర్ 60 బంతుల్లో 6 ఫోర్లతో 59 పరుగులు చేశాడు.
బెన్ స్టోక్స్ 51, క్రిస్ వోక్స్ 0 క్రీజులో ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
38వ ఓవర్లో 156/4
38వ ఓవర్లో ఇంగ్లండ్ 150 పరుగుల మైలురాయి దాటింది.
బట్లర్, స్టోక్స్ ధాటిగా ఆడుతున్నారు.
జాస్ బట్లర్ 35, బెన్ స్టోక్స్ 36 పరుగులతో క్రీజులో ఉన్నారు.
విజయానికి 12 ఓవర్లలో 86 పరుగులు కావాలి.
28 ఓవర్లలో 106/4
28వ ఓవర్లో ఇంగ్లండ్ వంద పరుగుల మైలురాయిని దాటింది.
జాస్ బట్లర్ 9, బెన్ స్టోక్స్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ ఔట్
24వ ఓవర్లో నాలుగో వికెట్ పడింది.
9 పరుగులు చేసిన మోర్గాన్ నీషామ్ బౌలింగ్‌లో కొట్టిన షాట్‌ను ఫెర్గూసన్ అద్భుతంగా అందుకున్నాడు.
20 ఓవర్లకు 73/3
20 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.
ఇదే ఓవర్లో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది.
ధాటిగా ఆడుతున్న జానీ బెయిర్‌స్టో ఫెర్గూసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
బెయిర్‌స్టో 55 బంతుల్లో 36 పరుగులు చేశాడు.
రూట్ ఔట్
59 పరుగుల దగ్గర రెండో వికెట్ పడింది.
17వ ఓవర్ వేసిన గ్రాండ్‌హోమ్ బంతి రూట్ బ్యాట్‌ను తాకుతూ వెళ్లి కీపర్ లాథమ్ చేతుల్లో పడింది.
రూట్ 30 బంతుల్లో 7 పరుగులే చేశాడు.
10 ఓవర్లలో 39/1
10 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇంగ్లండ్ 1 వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది.
జో రూట్ 2, బెయిర్‌స్టో 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఫొటో సోర్స్, Rre
జేసన్ రాయ్ ఔట్
ఆరో ఓవర్లో 28 పరుగులకు ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది.
ఓపెనర్ జేసన్ రాయ్ 17 పరుగులు చేసి ఔటయ్యాడు.
హెన్రీ బౌలింగ్‌లో కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఇంగ్లండ్ 4 ఓవర్లలో 16/0
ఇంగ్లండ్ ఓపెనర్లు జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో ధాటిగా ఆడుతున్నారు.
జేసన్ 13, బెయిర్‌స్టో 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
న్యూజీలాండ్ బ్యాటింగ్...
50వ ఓవర్లో 3 పరుగులే వచ్చాయి.
మిచెల్ శాంట్నర్ 5, బౌల్ట్ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచారు.
చివరి ఓవర్లో 8వ వికెట్
ఆర్చర్ బౌలింగ్‌లో హెన్సీ(4) బౌల్డ్ అయ్యాడు.
232 పరుగులకు ఏడో వికెట్
స్కోరు పెంచే ఒత్తిడిలో లాథమ్ ఔట్(47) అయ్యాడు.
49వ ఓవర్ వేసిన వోక్స్ బౌలింగ్‌లో లాథమ్ కొట్టిన షాట్ విన్స్ చేతుల్లో పడింది.
ఇది వోక్స్‌కు మూడో వికెట్.

ఫొటో సోర్స్, AFP
47 ఓవర్లలో స్కోరు 220/6
గ్రాండ్‌హోమే ఔట్
219 పరుగుల దగ్గర న్యూజీలాండ్ ఆరో వికెట్ పడింది.
గ్రాండ్‌హోమే(16) వోక్స్ బౌలింగ్‌లో విన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.
శాంట్నర్ 0, లాథమ్ 45 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.
న్యూజీలాండ్ 200
44 ఓవర్లలో 204/5
44వ ఓవర్లో న్యూజీలాండ్ 200 పరుగుల మైలురాయిని దాటింది.
టామ్ లాథమ్ 32, గ్రాండ్‌హోమే 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
40 ఓవర్లకు 179/5...
40 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి న్యూజీలాండ్ 179 రన్స్ చేసింది.
గ్రాండ్‌హోమే 5, టామ్ లాథమ్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.
నీషామ్ ఔట్...
39 ఓవర్లో న్యూజీలాండ్ ఐదో వికెట్ పడింది.
174 పరుగులకు జిమ్మీ నీషామ్(19) ఔట్ అయ్యాడు.
ప్లంకెట్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఇది ప్లంకెట్‌కు మూడో వికెట్
35 ఓవర్లో 150/4
35వ ఓవర్లో న్యూజీలాండ్ 150 పరుగులు దాటింది.
నీషామ్ 9, టామ్ లాథమ్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
నీషామ్ ఈ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు.

ఫొటో సోర్స్, Getty Images
నాలుగో వికెట్ డౌన్...
141 పరుగుల దగ్గర రాస్ టేలర్(15) ఔట్ అయ్యాడు.
టేలర్ వుడ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు.
30 ఓవర్లకు 126/3...
30 ఓవర్లకు న్యూజీలాండ్ 3 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.
టేలర్ 9, లాథమ్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
27 ఓవర్లకు 118/3...
నికోల్స్ బౌల్డ్
118 పరుగులకు న్యూజీలాండ్ మూడో వికెట్ పడింది.
27వ ఓవర్లో ఓపెనర్ నికోల్స్(55) ప్లంకెట్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
అంతకు ముందు ఓవర్లోనే నికోల్స్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
నికోల్స్ 71 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
103 పరుగులకు కివీస్ రెండో వికెట్...
23వ ఓవర్లో న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వికెట్ కోల్పోయింది.
ప్లంకెట్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చిన కేన్ విలియమ్సన్‌ను అంపైర్ ధర్మసేన నాటౌట్‌గా ప్రకటించాడు.
మోర్గాన్ రివ్యూ కోరడంతో రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు.
కేన్ విలియమ్సన్53 బంతుల్లో 30 పరుగులు చేశాడు.
22వ ఓవర్లో న్యూజీలాండ్ 100 పరుగుల మైలురాయిని చేరుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
ఈ మ్యాచ్‌తో కేన్ విలియమ్సన్ 2019 ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు.
20 ఓవర్లలో 91/1
20 ఓవర్లు పూర్తయ్యేసరికి న్యూజీలాండ్ 1 వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది.
నికోల్స్ 40, కేన్ విలియమ్సన్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
15 ఓవర్లకు 63/1
కేన్ విలియమ్సన్, నికోల్స్ ఆచితూచి ఆడుతున్నారు.
విలియమ్సన్ 29 బంతుల్లో 9 పరుగులు చేయగా, నికోల్స్ 43 బంతుల్లో 27 పరుగులు చేశాడు.
14వ ఓవర్లో న్యూజీలాండ్ 50 పరుగులు పూర్తి చేసింది.
10 ఓవర్లకు 33/1
8 ఓవర్లకు 30/1
నికోల్స్ 9, కేన్ విలియమ్సన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గప్తిల్ ఔట్
29 పరుగులకు న్యూజీలాండ్ తొలి వికెట్ పడింది.
మార్టిన్ గప్తిల్(19) వోక్స్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
న్యూజీలాండ్ రివ్యూ కోరినా ఫలితం లేకుండాపోయింది.
రీప్లేలో బంతి వికెట్లకు తగులుతున్నట్లు స్పష్టం కావడంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు.
5 ఓవర్లకు న్యూజీలాండ్ 24/0
ఆర్చర్ వేసిన నాలుగో ఓవర్లో గప్తిల్ సిక్స్ కొట్టాడు.

ఫొటో సోర్స్, Getty Images
3 ఓవర్లకు న్యూజీలాండ్ 10/0
8 పరుగుల దగ్గర న్యూజీలాండ్ రివ్యూ కోరడంతో నికోల్స్ ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు.
వోక్స్ బౌలింగ్‌లో బంతి నికోల్స్‌కు ప్యాడ్‌తు తగలగా అంపైర్ ఎల్‌బిడబ్ల్యు ఇచ్చాడు.
దీంతో న్యూజీలాండ్ రివ్యూకు వెళ్లింది. రీప్లేలో బంతి స్టంప్స్ మిస్ అవుతున్నట్లు కనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
న్యూజీలాండ్ బ్యాటింగ్...
న్యూజీలాండ్ ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, నికోల్స్ బ్యాటింగ్ చేస్తున్నారు.

లండన్‌లో ప్యాన్ జోన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడచ్చు.
టికెట్లు దొరకని అభిమానులు ఇక్కడ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
భారీగా టికెట్ ధర
లార్డ్స్ స్టేడియం బయట మ్యాచ్ ప్రారంభానికి ముందు టికెట్ ధర 2000 పౌండ్స్ అంటే 1 లక్ష 72 వేలు పలికిందని బీబీసీ స్పోర్ట్స్ స్టీఫెన్ షోమిల్ట్ చెప్పారు.
ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే ఫైనల్‌కు సిద్ధమయ్యాయి. సెమీ ఫైనల్లో ఆడిన ఆటగాళ్లతోనే ప్రపంచకప్ విజేతగా నిలవాలని భావిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు...
- విరాట్ కోహ్లీ స్టార్ టీమ్ న్యూజీలాండ్ చేతిలో ఓడిపోవడానికి కారణాలేంటి...
- భారత జట్టు భవిష్యత్ ఏంటి... ప్రపంచ కప్ మిగిల్చిన జ్ఞాపకాలేంటి...
- జిమ్మీ నీషామ్: ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడుతూనే... డిగ్రీ పరీక్షలు రాస్తున్న ఆల్‌రౌండర్
- క్రికెట్ బంతిని ఎలా తయారు చేస్తారో చూశారా
- సరిగ్గా 36 ఏళ్ల క్రితం భారత్ ప్రపంచ కప్ గెలిచిన రోజున దిల్లీలో ఏం జరిగింది..
- విరాట్ కోహ్లీ: "ఇదేం మైదానం, బౌండరీ అంత దగ్గరా..."
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు... రూల్స్ మారిపోయాయి
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)