దలైలామా: మహిళలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన బౌద్ధ మత గురువు

భవిష్యత్తులో ఎవరైనా మహిళ దలైలామాగా బాధ్యతలు చేపట్టే పక్షంలో ఆమె ఆకర్షణీయంగా ఉండాలని, లేకపోతే ఉపయోగం లేదంటూ తాను చేసిన వ్యాఖ్యలకు దలైలామా క్షమాపణ చెప్పారు.
బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన నవ్వుతూ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
"తన వ్యాఖ్యలు ప్రజల మనసును నొప్పించినందుకు దలైలామా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఇందుకు ఆయన క్షమాపణ కోరుతున్నారు" అని దలైలామా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దలైలామా అవి హాస్యస్ఫోరకంగా చేసిన వ్యాఖ్యలని చెప్పింది.
"టిబెటన్ బౌద్ధ సంప్రదాయంలో పునర్జన్మ భావనలు ముఖ్యమైనవీ, సంక్లిష్టమైనవీ. వీటిపై చాలా తక్కువ మందికి మాత్రమే ఆసక్తి ఉంటుంది. ఈ భావనలు, తన పర్యటనల్లో తనకు ఎదురయ్యే భౌతికవాద(మెటీరియలిస్టిక్) ప్రపంచం మధ్య వైరుద్ధ్యాలపై దలైలామాకు చాలా అవగాహన ఉంది. కొన్నిసార్లు ఆయన యథాలాపంగా చేసే వ్యాఖ్యలు ఒక సంస్కృతి ప్రకారం నవ్వు తెప్పించవచ్చు, మరో సంస్కృతి ప్రకారం వేరేలా అర్థం కావొచ్చు. తన వ్యాఖ్యలతో ఎవరి మనసైనా నొచ్చుకొని ఉంటే క్షమించాలని దలైలామా కోరారు" అని ప్రకటన తెలిపింది.
మహిళను వస్తువుగా చూడటాన్ని దలైలామా ఎప్పుడూ వ్యతిరేకిస్తారని, స్త్రీ-పురుష సమానత్వానికి ఆయన మద్దతిస్తారని ప్రకటన వివరించింది.
ఈ నెల ఆరో తేదీకి ఆయనకు 84 ఏళ్లు నిండుతాయి.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు నీతిలేదంటూ చేసిన వ్యాఖ్యలపై మాత్రం దలైలామా క్షమాపణ చెప్పలేదు.
1959లో టిబెట్‌ను స్వాధీనం చేసుకునేందుకు చైనా సాయుధ దళాలను పంపినపుడు, దలైలామా అక్కడి నుంచి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధరమ్‌శాలలో ఆయన ఉంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- జీ-20 సదస్సు: ట్రంప్ - మోదీ ఏం చర్చించారు..
- ఆంధ్రప్రదేశ్‌లో క్రిమినల్ కేసులున్న మంత్రులెందరు.. వారిలో అత్యంత సంపన్నులెవరు
- భారత్‌లో ఫాసిజం తొలి సంకేతాలు కనిపిస్తున్నాయి: తొలి ప్రసంగంలో మహువా మోయిత్ర
- విజయ్ మాల్యా: భారత్‌కు రావడానికి అభ్యంతరం, యూకే హైకోర్టులో మళ్లీ విచారణ
- "సినీ రంగం నాకు మనశ్శాంతి లేకుండా చేసింది"
- అరబ్ దేశాల్లో మతాన్ని వదిలేసేవారు పెరుగుతున్నారు :బీబీసీ సమగ్ర సర్వే
- అనంతపురం కాలేజీ వైరల్ వీడియో వెనుక అసలు కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









