బియోన్సే: అంబానీల వివాహ వేడుకలో ఆడిపాడిన అమెరికన్ పాప్ సింగర్ పారితోషికం ఎంత?

ఫొటో సోర్స్, Getty Images
ఇషా అంబానీ, ఆనంద్ పిరామల్ వివాహ వేడుకలో అమెరికన్ ఫేమస్ మ్యూజిక్ స్టార్ బియోన్సే పెర్ఫామెన్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా అంతా చర్చ జరుగుతోంది.
అంత పెద్ద స్టార్ ఇండియా వచ్చి ఈ ప్రదర్శన ఇచ్చిందంటే అందుకు ఆమె ఎంత వసూలు చేసుంటుంది అనే ప్రశ్న కూడా వస్తోంది.
కానీ, ఇప్పటివరకూ అంబానీలు బియోన్సేకు ఎంత పారితోషికం ఇచ్చారనే అంకె బయటకు రాలేదు.
కానీ, కొంత సమాచారం ప్రకారం ఆమెకు ఈ ప్రదర్శనకు దాదాపు 21 కోట్ల నుంచి 28 కోట్ల రూపాయలు అంది ఉంటుందని తెలుస్తోంది.
గాయని, రచయిత్రి, నటి, రికార్డ్ ప్రొడ్యూసర్, డ్యాన్సర్ అయిన మ్యూజిక్ స్టార్ బియోన్సే ఎన్నో ఏళ్ల నుంచీ కొన్ని వందల సంగీత, నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇంతకు ముందు బియోన్సే పారితోషికం ఎంత?
టైమ్ మేగజీన్ ప్రకారం ఈ ఏడాది ప్రారంభంలో కోచెల్లా ఫెస్టివల్‌లో ఇచ్చిన ఒక సంగీత ప్రదర్శన కోసం బియోన్సే దాదాపు 21 కోట్ల పారితోషికం తీసుకున్నారు.
అయితే ఆ సమయంలో ఆమె తనకు 21 నుంచి 28 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ఆ ఫెస్టివల్ నిర్వాహకులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక కల్నల్ గడాఫీ కొడుకు ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ పార్టీలో మ్యూజిక్ పెర్ఫామెన్స్ కోసం బియాన్సే 14.5 కోట్లు తీసుకున్నారని ద గార్డియన్ తెలిపింది.
బియోన్సే 2010లో ఆ మొత్తం అందుకున్నారు. అంటే ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు అది ఏ స్థాయికి చేరి ఉంటుందో మనం సులభంగా అంచనా వేయచ్చు.
అయితే అప్పుడప్పుడు సెలబ్రిటీల పారితోషికాలు ఆ ప్రదర్శనలకు ఆతిథ్యం ఇచ్చేవారిని బట్టి ఉంటుంటాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మ్యూజిక్ రంగంలో అత్యధిక పారితోషికం
ఫోర్బ్స్ 2017 అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిమేల్ మ్యుజీషియన్స్' జాబితాలో బియోన్సే టాప్‌లో నిలిచారు.
ఈ జాబితా ప్రకారం ఆమె సంపాదన 2017లో ఏడాదికి 105 మిలియన్ డాలర్లు అంటే 756 కోట్ల రూపాయలు.

ఫొటో సోర్స్, INSTAGRAM/BEYONCE
అంబానీ పెళ్లిలో బియోన్సే ప్రదర్శనపై విదేశాల్లో కూడా జోరుగా చర్చ సాగుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇషా అంబానీ పెళ్లిలో బియోన్సే ప్రదర్శనపై ఫ్రెడ్ టి జోసెఫ్ అనే ట్విటర్ హాండ్లర్.. "నా పెళ్లిలో బియోన్సే ప్రదర్శన ఉండాలంటే, మీరంతా టికెట్లు కొనుక్కుని రావాల్సి ఉంటుంది" అని ట్వీట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4

పోస్ట్ of X ముగిసింది, 5
"మీ పెళ్లిలో బియోన్సే ప్రదర్శన ఇచ్చేంత సంపన్నులుగా మిమ్మల్ని మీరు ఊహించుకోగలరా?" అని ఒకరు, "బియోన్సే మీ పెళ్లిలో ప్రదర్శన ఇవ్వాలంటే మీరు ఎంత ధనవంతులు అయ్యుండాలో?" అని మరొకరు ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
"నా పెళ్లిలో బియోన్సే ప్రదర్శన ఉండాలంటే, నేను ఆమె ఇచ్చే ఏదో ఒక ప్రదర్శనకు వెళ్లి అక్కడే పెళ్లి చేసుకుంటా" అని ఇంకొకరు ఫన్నీ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఒక భార్య, ఇద్దరు భర్తలు... ఆమె జీవితమే ఒక సినిమా
- ట్రంప్‌కు సెనేట్‌లో చుక్కెదురు: సౌదీకి అమెరికా సైనిక సాయం ఆపేయాలని తీర్మానం
- రెండే రెండు ఫొటోల్లో.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు..
- హరీశ్‌రావు: దేశంలో అత్యధిక మెజారిటీ ఈయనదేనా?: బీబీసీ రియాల్టీచెక్
- కూటమి కుప్పకూలడానికి కారణాలేమిటి..- ఎడిటర్స్ కామెంట్
- శక్తికాంతా దాస్: ఆర్బీఐ కొత్త గవర్నర్
- థెరెసా మే: విశ్వాస పరీక్షలో నెగ్గిన బ్రిటన్ ప్రధాని
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)