జర్మనీ: రోడ్డుపై టన్ను చాక్లెట్ లీక్.. 108 చదరపు అడుగులు చాక్లెట్ మయమైన రోడ్డు

వాతావరణం బాగా చల్లగా ఉండటంతో రోడ్డుపై పడిన చాక్లెట్ వెంటనే గట్టిపడిపోయింది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వాతావరణం బాగా చల్లగా ఉండటంతో రోడ్డుపై పడిన చాక్లెట్ వెంటనే గట్టిపడిపోయింది

జర్మనీలో ఒక టన్ను చాక్లెట్ స్థానికంగా ఒక రోడ్డుపై రాకపోకల్ని నిలిపివేసిందని అధికారులు చెప్పారు.

ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి ట్యాంకులో రవాణా అవుతున్న చాక్లెట్ పశ్చిమ జర్మనీలోని వెస్టొనెన్ పట్టణంలోని ఒక రోడ్డుపై సోమవారం సాయంత్రం లీకయ్యింది. రోడ్డుపై తారుతో లేయర్ వేసినట్లుగా చాక్లెట్ పరచుకుంది. వెంటనే అది గట్టిపడిపోయింది.

దాదాపు 10 చదరపు మీటర్లు (108 చదరపు అడుగులు) మేర పరచుకున్న చాక్లెట్‌ను తొలగించేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానిక సిబ్బంది కలసి గడ్డపారలు, వేడి నీళ్లు, వేడిగాలిని వెదజల్లే బ్లోయర్లను ఉపయోగించారు.

గడ్డపారలు పట్టుకుని చాక్లెట్ తొలగిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గడ్డపారలు పట్టుకుని చాక్లెట్ తొలగిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ఈ తియ్యని ఎమర్జెన్సీ కార్యక్రమంలో చాక్లెట్ ఫ్యాక్టరీ డ్రీమిస్టెర్ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.

‘‘ఇది గుండెలు పిండేసే సంఘటన. అయినప్పటికీ ఈ క్రిస్‌మస్‌కు చాక్లెట్ల కొరత ఉండకపోవచ్చు’’ అని అగ్నిమాపక శాఖ సిబ్బంది అన్నారు.

బుధవారం నాటికల్లా తమ ఫ్యాక్టరీలో చాక్లెట్ తయారీ కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని డ్రీమిస్టెర్ స్థానిక మీడియాకు చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)