హైదరాబాద్ ఐకియా స్టోర్: చాక్లెట్ కేకులో ఈగ ; అది తర్వాత ఎగిరి వెళ్లిపోయిందన్న రెస్టారెంట్

హైదరాబాద్‌లోని ఐకియా ఫుడ్ కోర్టులో ఒక కేక్ తీసుకున్న కస్టమర్ అందులో తనకు ఒక ఈగ కనిపించిందని ఆరోపించారు.
అయితే ఇది ఈనెల 12న జరిగింది. చాక్లెట్ కేకులో ఈగను చూసిన ఆయన వెంటనే దాని ఫొటో, వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
కిశోర్2018 పేరుతో ఉన్న ట్విటర్ హ్యాండిల్లో ఆయన "హైదరాబాద్‌లోని ఐకియా స్టోరులో నా కూతురు చాక్లెట్ కేక్ తింటున్నప్పుడు అందులోంచి ఒక కీటకం బయటికి రావడం నాకు కనిపించింది. జీహెచ్ఎంసీ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి. నా దగ్గర కేకులోని కీటకం ఫొటోలు, వీడియో కూడా ఉన్నాయి." అని రాశారు.

ఫొటో సోర్స్, TWITTER
ఆయన తన ట్వీట్‌ను మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీస్ సహా, పలు వార్తా ఛానళ్లకు కూడా ట్యాగ్ చేశారు.
ఆ ఈగ ఎగిరి వెళ్లిపోయింది : ఐకియా
దీనిపై స్పందించిన ఐకియా ఒక ప్రకటన విడుదల చేసింది. కస్టమర్‌కు క్షమాపణలు చెప్పింది.
మా హైదరాబాద్ రెస్టారెంట్‌లో ఒక కస్టమర్ చాక్లెట్ కేక్ తింటున్నప్పుడు ఒక ఈగ కనిపించింది. అది చివరకు ఎగిరి వెళ్లిపోయింది. ఆయనకు ఇలా జరిగినందుకు చింతిస్తున్నాం.
ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అయినా దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి తనిఖీలు చేయలేదు, నమూనాలు సేకరించలేదు.
ఐకియాకు ఎలాంటి నోటీసులూ అందలేదు అని పేర్కొంది.
ఇంతకు ముందు గొంగళిపురుగు..
హైదరాబాద్ ఐకియా స్టోర్‌లో ఆహారంలో కీటకాలు రావడం ఇప్పుడే జరగలేదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.
ఆగస్టు చివర్లో అబీద్ మహమ్మద్ అనే వ్యక్తి తను తీసుకున్న ఆహార పదార్థంలో గొంగళిపురుగు వచ్చిందని చేసిన ట్వీట్‌ను మున్సిపల్ అధికారులకు ట్యాగ్ చేశారు.
మహమ్మద్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఐకియా రెస్టారెంటులో ఉన్న వివిధ ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు. ఒక ఆహార పదార్థంలో పురుగులు ఉన్నట్టు గుర్తించారు.
తగిన శుభ్రతా ప్రమాణాలు పాటించనందుకు స్టోర్‌కు పది వేల రూపాయల జరిమానా విధించారు.
ఇవి కూడా చదవండి:
- అభిప్రాయం: ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్సును చూసి ముస్లిం మహిళలు బీజేపీకి ఓటేస్తారా?
- ‘బాకీ కింద అమ్మాయిలను జమ కడుతున్నారు’
- అమెరికాలో ముగ్గురిని కాల్చి చంపిన మహిళ
- గుజరాత్ అడవుల్లో సింహాలు.. ఏపీలో పులులు.. ఎందుకు కొట్టుకొంటున్నాయి?
- నమాజ్‌కు షరతులు విధిస్తున్నారంటూ ముస్లింల ఆరోపణ... హరియాణా గ్రామంలో ఉద్రిక్తత
- జెట్ ఎయిర్వేస్: విమానంలో కేబిన్ ప్రెషర్ మరచిన పైలట్లు.. ప్రయాణికుల అస్వస్థత
- ప్రసవం తర్వాత మహిళల కుంగుబాటు లక్షణాలేంటి? ఎలా బయటపడాలి?
- షెడిట్ రన్: మహిళల్లో చైతన్యం కోసం స్పోర్ట్స్ బ్రాతో జాగింగ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








