మేరీలాండ్ షూటింగ్: అమెరికాలో ముగ్గురిని కాల్చి చంపిన మహిళ

అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు గాయపడ్డారని.. ఈ కాల్పులకు పాల్పడింది మహిళ అని వివరించారు.
కాల్పులకు పాల్పడిన మహిళ కూడా తనను తాను కాల్చుకుని చనిపోయారని చెప్పారు.
స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9 గంటలకు హార్ఫర్డ్ కౌంటీలోని పెరీమాన్ ప్రాంతంలో ఉన్న ఓ ఫార్మసీ కేంద్రం దగ్గర ఈ కాల్పులు జరిగాయి.
స్థానికులు ఆ ప్రాంతంలో సంచరించొద్దని అధికారులు హెచ్చరించారు.
‘ఇకపై ఎలాంటి భయం ఉండదనే మేం అనుకుంటున్నాం’ అని స్థానిక అధికారి ఒకరు ట్వీట్ చేశారు.
కాల్పులు జరిగినట్లు సమాచారం అందిన కొన్ని నిమిషాల్లోనే ఎఫ్‌బీఐ అధికారులు అక్కడికి చేరుకున్నారు.
కాల్పులకు పాల్పడిన మహిళ 26 ఏళ్ల స్నోచియా మోసెలీగా గుర్తించారు. ఆ కాల్పుల వెనకున్న కారణాలు కూడా ఇంకా తెలియరాలేదు.
ఈమె హార్ఫర్డ్ కౌంటీ షెరిఫ్ కార్యాలయంలో పని చేసేవారని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
- అమెరికాలో హత్యకూ అదే, ఆత్మహత్యకూ అదే
- మహాత్మా గాంధీని ఎందుకు హత్య చేశారు?
- పెళ్లి కానుకగా పార్సిల్ బాంబును ఎవరు పంపారు? ఈ నూతన వరుడిని ఎవరు చంపారు?
- సహారా ఎడారి వెంట ప్రహరీ గోడ కట్టండి.. స్పెయిన్కు డోనల్డ్ ట్రంప్ సలహా
- నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పిల్లలు ఎందుకు పుడతారు?
- ఉత్తర కొరియాతో చర్చలు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామన్న అమెరికా
- మమ్మీ మిస్టరీ వీడింది: తయారీలో తుమ్మ జిగురు పాత్ర
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








