ఉత్తర కొరియాతో చర్చలు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామన్న అమెరికా

ఫొటో సోర్స్, Reuters
2021 నాటికి అణునిరాయుధీకరణ లక్ష్యంగా ఉత్తర కొరియాతో తిరిగి చర్చలు కొనసాగించడానికి అమెరికా సిద్ధంగా ఉన్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఈ అంశంపై జరిగిన ఒప్పందం తర్వాత రెండు దేశాల మధ్య చర్చలకు బ్రేక్ పడింది.
కానీ తాజాగా ఉభయ కొరియాల మధ్య జరిగిన శిఖరాగ్ర సదస్సులో ప్రధాన క్షిపణి ప్రయోగ ప్రాంతాలను మూసివేస్తామని కిమ్ జోంగ్-ఉన్ ప్రకటించారు. కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ లక్ష్యాన్ని సాధించేందుకు కూడా ఆయన ఒప్పుకున్నారు.
ఇటు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-యిన్ కూడా వేలాది మంది ఉత్తర కొరియన్ల మధ్య ప్రసంగించారు.
ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య జరిగిన శిఖరాగ్ర సదస్సులో కిమ్ కీలక నిర్ణయాలు ప్రకటించడంతో, ప్యాంగ్‌యాంగ్‌తో చర్చలు తిరిగి కొనసాగుతాయని అమెరికా హామీ ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర కొరియా పాలకుడు కిమ్ నిబద్ధత ఆధారంగా అమెరికా తక్షణం చర్చలకు సన్నాహాలు చేస్తుందని పాంపియో ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్-హోను వచ్చేవారం న్యూయార్క్‌కు కలడానికి ఆహ్వానించారు.
ఆస్ట్రియాలోని వియన్నాలో అమెరికా, ఉత్తర కొరియా ప్రతినిధుల మధ్య జరిగే రెండో సమావేశాలకు ఆహ్వానాన్ని పొడిగించారు.
"ఉత్తర కొరియాలో అణు నిరాయుధీకరణ ప్రక్రియ ద్వారా అమెరికా-డిపిఆర్‌కె (ఉత్తర కొరియా) సంబంధాలను పూర్తిగా మార్చే ప్రయత్నంలో ఇది గొప్ప ప్రారంభం. చైర్మన్ కిమ్ హామీ ఇచ్చినట్లుగా 2021 నాటికి పూర్తయితే కొరియా ద్వీపకల్పంలో సుస్థిర శాంతి స్థాపన సాధ్యమవుతుంది" అని పాంపియో అన్నారు.
ఉత్తర-దక్షిణ కొరియాలు అణునిరాయుధీకరణకు 2021 జనవరిని అధికారిక గడువుగా ప్రకటించాయి.

ఫొటో సోర్స్, AFP
సమావేశంలో ఏం జరిగింది
ప్యాంగ్‌యాంగ్‌లో జరిగిన సమావేశంలో కిమ్, మూన్ జే-యిన్ ప్రధానంగా అణునిరాయుధీకరణ అంశంపై దృష్టి పెట్టారు.
యాంగ్ బ్యాన్ అణు కేంద్రం మూసివేతకు సిద్ధంగా ఉన్నట్టు కిమ్ అంగీకరించారు. అయితే అమెరికా కూడా దీనికి తగిన విధంగా స్పందించాలని కిమ్ కోరారు.
ఉత్తర కొరియా గత జూన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. కిమ్‌ను కలవడానికి మునుపే తమ పంగ్యె-రి అణు పరీక్ష కేంద్రాన్ని పేల్చేసింది.
కాగా.. కొరియా ద్వీపకల్పంలో మిలటరీపరమైన శాంతి స్థాపన కోసం ఇది ఒక పెద్ద ముందడుగు అని కిమ్ అభివర్ణించారు. రాబోయే కాలంలో తాను సియోల్‌లో పర్యటిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అద్భుత పురోగతి: ట్రంప్
ఉభయ కొరియాల మధ్య ఈ ఒప్పందాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వాగతించారు, దీనిని ఒక అద్భుతమైన పురోగతిగా వర్ణించారు.
2032లో ఒలింపిక్స్ వేడుకలకు రెండు దేశాలు కలిసి ఒలింపిక్ బిడ్ వేయాలనుకోవడం చాలా ఆసక్తికరంగా ఉందన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కొరియా యుద్ధం అధికారికంగా ముగిసేలా అమెరికా శాంతి ఒప్పందాలపై సంతకం చేయబోతోందని బీబీసీ సియోల్ ప్రతినిధి లారా బికర్ తెలిపారు.
కానీ, కిమ్ అంతర్జాతీయ నిపుణుల మధ్య టొంగ్‌చాంగ్-రి క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేస్తామని చెప్పడం.. ఆ దిశగా ఒక పెద్ద అడుగుగా వర్ణించారు.
శాటిలైట్ చిత్రాల ద్వారా టొంగ్‌చాంగ్-రి కేంద్రాన్ని ధ్వంసం చేసే ప్రక్రియ కనిపిస్తోందని తెలిపారు. కిమ్ ప్రకటనతో పరిశీలకులు ఆ ప్రక్రియను తనిఖీ చేసేందుకు వీలవుతుందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- యెమెన్ సంక్షోభం: కోటి మంది చిన్నారుల ఆకలి కేకలు
- పాకిస్తాన్: జైలు నుంచి విడుదలైన నవాజ్ షరీఫ్, కూతురు మర్యమ్
- చంద్ర మండల యాత్రకు వెళ్లే పర్యటకుడు యుసాకు మేజావా
- ఉత్తర కొరియాలో ఎక్కువగా తినే స్నాక్స్ ఇవే!
- ఉత్తర కొరియాకు మిత్రదేశాలు ఎన్ని?
- ఉత్తర కొరియాకు ఇంటర్నెట్ సేవలు ఎక్కడి నుంచి అందుతున్నాయి?
- ఉభయ కొరియాల చర్చలతో శాంతి నెలకొంటుందా?
- కిమ్ జోంగ్ ఉన్: ఈయన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉత్తర కొరియా అధ్యక్షుడయ్యారా?
- దక్షిణ కొరియాలో తనిఖీలు చేస్తున్న కిమ్ జోంగ్ ‘మాజీ ప్రియురాలు’
- ‘విదేశాలకు వెళ్లాలంటే వీసా చాలు.. ఉత్తర కొరియా వెళ్లాలంటే ధైర్యం కూడా కావాలి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








