ఉత్తర కొరియా స్నాక్స్: ఆహార కొరత నుంచి పుట్టుకొచ్చిన వినూత్న వంటకాలు

ఉత్తర కొరియా ప్రజలు ఎక్కువగా ఎలాంటి ఆహారం తీసుకుంటారు.? వారి వంటకాల్లో ప్రత్యేకత ఏమిటి? మరెన్నో ఆసక్తికర విషయాలు ఈ ఫొటో గ్యాలరీలో చూడండి.

ఇంజోగోగి నుంచి ‘ఇంజోగిగిబాబ్’ అనే ఆహారాన్ని తయారుచేయొచ్చు. ప్రొటీన్ ట్యూబుల్లోకి అన్నం కూర్చి, పైన కారం పేస్ట్ లేదా చేపల నుంచి తయారుచేసిన సాస్ పూస్తారు. ఇంజోగిగిబాబ్‌లో ప్రొటీన్, పీచు పదార్థం ఎక్కువని చెబుతారు. ఇది తక్కువ క్యాలరీలు ఉండే ఆహారం.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇంజోగోగి నుంచి ‘ఇంజోగిగిబాబ్’ అనే ఆహారాన్ని తయారుచేయొచ్చు. ప్రొటీన్ ట్యూబుల్లోకి అన్నం కూర్చి, పైన కారం పేస్ట్ లేదా చేపల నుంచి తయారుచేసిన సాస్ పూస్తారు. ఇంజోగిగిబాబ్‌లో ప్రొటీన్, పీచు పదార్థం ఎక్కువని చెబుతారు. ఇది తక్కువ క్యాలరీలు ఉండే ఆహారం.
హాంగ్ యున్-హై

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియాలో గతంలో తీవ్రమైన ఆహార కొరత ఉండేది. దాంతో అక్కడి ప్రజలు సాధారణ పదార్థాలతో వినూత్న వంటకాలు చేయడం మొదలుపెట్టారు. ఉత్తర కొరియా నుంచి వచ్చి సోల్‌లో స్థిరపడి, రెస్టారెంట్ నడుపుతున్న హాంగ్ యున్-హై, ఈ చిత్రంలో సియోక్‌డిజెన్‌ తయారీ విధానాన్ని చూపిస్తున్నారు.
దీని పేరు ‘సియోక్‌డిజెన్’. దీనిని స్పీడ్ కేక్ అని కూడా పిలుస్తారు. బేకింగ్‌ చేయకుండానే నిమిషాల్లో దీనిని తయారుచేయొచ్చు. మొక్కజొన్నల పిండిని నీటితో కలిపి సియోక్‌డిజెన్‌ను తయారు చేస్తారు. బియ్యం కంటే చౌక కావడంతో ఉత్తర కొరియాలో పేద ప్రజలు మొక్కజొన్నను ఎక్కువగా తీసుకొంటారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దీని పేరు ‘సియోక్‌డిజెన్’. దీనిని స్పీడ్ కేక్ అని కూడా పిలుస్తారు. బేకింగ్‌ చేయకుండానే నిమిషాల్లో దీనిని తయారుచేయొచ్చు. మొక్కజొన్నల పిండిని నీటితో కలిపి సియోక్‌డిజెన్‌ను తయారు చేస్తారు. బియ్యం కంటే చౌక కావడంతో ఉత్తర కొరియాలో పేద ప్రజలు మొక్కజొన్నను ఎక్కువగా తీసుకొంటారు.
ప్రొటీన్‌తో కూడిన ఈ శాకాహార పదార్థం ‘ఇంజోగోగి’. ‘మనిషి తయారుచేసిన మాంసం’ అని ఈ పేరుకు అర్థం. సోయా బీన్ నూనె ఉత్పత్తిలో అడుగుకు చేరే చిన్నపాటి ఘన పదార్థాలతో ఇంజోగోగిని తయారు చేస్తారు. సాధారణంగా ఇలా మిగిలిపోయే ఘన పదార్థాలను పందులకు ఆహారంగా వేస్తుంటారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రొటీన్‌తో కూడిన ఈ శాకాహార పదార్థం ‘ఇంజోగోగి’. ‘మనిషి తయారుచేసిన మాంసం’ అని ఈ పేరుకు అర్థం. సోయా బీన్ నూనె ఉత్పత్తిలో అడుగుకు చేరే చిన్నపాటి ఘన పదార్థాలతో ఇంజోగోగిని తయారు చేస్తారు. సాధారణంగా ఇలా మిగిలిపోయే ఘన పదార్థాలను పందులకు ఆహారంగా వేస్తుంటారు.
దీనిని ‘దుబుబాబ్’ లేదా ‘టొఫూ రైస్’ అంటారు. ఇది ఇంజోగిగిబాబ్‌కు దగ్గరగా ఉంటుంది. సోయా విత్తనాల నుంచి తీసిన పదార్థం, అన్నంతో దీనిని తయారు చేస్తారు. పైన కారం సాస్ పూసుకొని తింటారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దీనిని ‘దుబుబాబ్’ లేదా ‘టొఫూ రైస్’ అంటారు. ఇది ఇంజోగిగిబాబ్‌కు దగ్గరగా ఉంటుంది. సోయా విత్తనాల నుంచి తీసిన పదార్థం, అన్నంతో దీనిని తయారు చేస్తారు. పైన కారం సాస్ పూసుకొని తింటారు.
ఇవో రకం బిస్కట్లు. ‘ఫింగర్ స్నాక్స్’ అంటారు. ధాన్యపు పిండి, ఈస్ట్, పంచదార, ద్రాక్ష నుంచి తీసిన గ్లూకోజ్‌తో వీటిని తయారు చేస్తారు. ఉత్తర కొరియా ప్రజలు పంచదార కొరత ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా ద్రాక్ష నుంచి తీసిన గ్లూకోజ్ తీసుకుంటారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇవో రకం బిస్కట్లు. ‘ఫింగర్ స్నాక్స్’ అంటారు. ధాన్యపు పిండి, ఈస్ట్, పంచదార, ద్రాక్ష నుంచి తీసిన గ్లూకోజ్‌తో వీటిని తయారు చేస్తారు. ఉత్తర కొరియా ప్రజలు పంచదార కొరత ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా ద్రాక్ష నుంచి తీసిన గ్లూకోజ్ తీసుకుంటారు.
దీన్ని ‘సుండే’ అంటారు. పంది రక్తాన్ని కూరగాయలు, బియ్యం లాంటి ఆహార ధాన్యాలతో కలిపి దీనిని తయారు చేస్తారు. దీనిని ఉత్తర, దక్షిణ కొరియాలు రెండింటిలోనూ స్నాక్స్‌గా తీసుకుంటారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దీన్ని ‘సుండే’ అంటారు. పంది రక్తాన్ని కూరగాయలు, బియ్యం లాంటి ఆహార ధాన్యాలతో కలిపి దీనిని తయారు చేస్తారు. దీనిని ఉత్తర, దక్షిణ కొరియాలు రెండింటిలోనూ స్నాక్స్‌గా తీసుకుంటారు.
దీనిని ‘కాంగ్‌సటాంగ్’ అని పిలుస్తారు. ఇది పాప్‌కార్న్‌ను పోలి ఉంటుంది. వేయించిన సోయా బీన్స్‌తో దీనిని తయారు చేస్తారు. పైన పంచదార పూత ఉంటుంది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దీనిని ‘కాంగ్‌సటాంగ్’ అని పిలుస్తారు. ఇది పాప్‌కార్న్‌ను పోలి ఉంటుంది. వేయించిన సోయా బీన్స్‌తో దీనిని తయారు చేస్తారు. పైన పంచదార పూత ఉంటుంది.
ఈ పదార్థాన్ని ‘ఆల్‌సటాంగ్’ అంటారు. దీనిని చక్కెర, వినిగర్‌తో తయారు చేస్తారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఈ పదార్థాన్ని ‘ఆల్‌సటాంగ్’ అంటారు. దీనిని చక్కెర, వెనిగర్‌తో తయారు చేస్తారు. ‘రాయిటర్స్’ వార్తాసంస్థ ఉత్తర కొరియా ప్రజలు ఎక్కువగా తీసుకొనే స్నాక్స్‌పై ఈ జాబితా రూపొందించింది. ఉత్తర కొరియాను వీడి దక్షిణ కొరియా రాజధాని సోల్‌లో నివసిస్తున్నవారు చెప్పిన వివరాలతో ఈ జాబితా తయారు చేసింది.