దక్షిణ కొరియాలో తనిఖీలు చేస్తున్న కిమ్ జోంగ్ ‘మాజీ ప్రియురాలు’

ఫొటో సోర్స్, Getty Images
వచ్చే నెల జరగనున్న వింటర్ ఒలింపిక్స్ సాంస్కృతిక వేదికల్ని తనిఖీ చేసేందుకు ఉత్తర కొరియా ప్రతినిధి బృందం దక్షిణ కొరియాకు వచ్చింది. ఇరు దేశాల సంబంధాల్లో ఈ పర్యటన ఒక మైలురాయి.
ఈ బృందానికి హ్యోన్ సాంగ్ వోల్ నేతృత్వం వహిస్తున్నారు. రహస్య దేశంగా పేరొందిన ఉత్తర కొరియాలో ప్రసిద్ధి చెందిన ‘మారన్‌బాంగ్ మహిళా బ్యాండ్’కు ఈమే నాయకురాలు. దేశంలో ఈమె పెద్ద సెలబ్రిటీ.
గత రెండేళ్లలో తొలిసారి ఇరు కొరియా దేశాల మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చల్లో.. వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు తమ జట్టును పంపించేందుకు ఉత్తర కొరియా అంగీకరించిన సంగతి తెలిసిందే.
అణ్వాయుధాల కార్యక్రమంపై ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం ఒక దౌత్య విజయంగా భావిస్తున్నారు.
ఈ బృందం దక్షిణ కొరియా రాజధాని నగరం సోల్‌కు వచ్చేందుకుగాను భారీగా భద్రత నడుమ బస్సులో సరిహద్దును దాటడాన్ని స్థానిక మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది.
వందల మంది పోలీసు సిబ్బంది పహారాలో ఈ బృందం దక్షిణ కొరియాలోని గంగ్నుంగ్‌కు రైలులో బయలుదేరింది.
అయితే, దక్షిణ కొరియా మీడియా హ్యోన్ సాంగ్ వోల్‌పైనే ఎక్కువ దృష్టి సారించింది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Reuters
మారన్‌బాంగ్ మహిళా బ్యాండ్‌లో ఆమెతో పాటు పది మంది అమ్మాయిలు ఉంటారు. వీరే ఉత్తర కొరియాకు ఆకర్షణీయమైన ముఖ చిత్రం. పాశ్చాత్య దేశాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ‘స్పైస్ గర్ల్స్’ పాప్ గ్రూప్‌కు ఉత్తర కొరియా సమాధానం ఈ మారన్ బాంగ్ మహిళా బ్యాండ్ అని కొందరు అభివర్ణిస్తుంటారు.
కొన్నిసార్లు పొట్టి డ్రెస్సులు, హై హీల్స్ వేసుకుని, పాశ్చాత్య తరహా పాప్ సంగీతం మిళితమైన పాటలకు, దేశభక్తి గీతాలకు కూడా వీళ్లు ప్రదర్శనలు ఇస్తుంటారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది.
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ - హ్యోన్ సాంగ్ వోల్ ఇద్దరూ ప్రేమించుకున్నారని, ఆమె కిమ్ మాజీ ప్రేమికురాలని ఒకప్పుడు పుకార్లు షికార్లు చేశాయి. కానీ, ఉత్తర కొరియాను నిశితంగా పరిశీలించేవారు మాత్రం వీటిని కొట్టిపారేశారు.
140 మంది సభ్యుల సమ్జియోన్ కళా బందానికి ఆమె నేతృత్వం వహించనున్నారు. ఒలింపిక్స్ జరిగేప్పుడు ఈ బృందం రెండు ప్రదర్శనలు.. ఒకటి సోల్‌లో, రెండోది గంగ్నుంగ్‌లో ఇస్తుంది.
ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు సన్నాహకాల్లో భాగంగా ఉత్తర కొరియా తీసుకుంటున్న చర్యల్లో ఈ బృందం రెండు రోజుల పర్యటన కూడా ఒకటి.
ఉత్తర కొరియా అధికారులు దక్షిణ కొరియాలో పర్యటించటం గత నాలుగేళ్లలో ఇదే తొలిసారి.
ఈ ప్రతినిధి బృందంలో అథ్లెట్లు, అధికారులు, ఛీర్ లీడర్లు కూడా ఉన్నారు.
ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు గాను ఉత్తర కొరియాకు చెందిన మరో బృందం ఈ వారం దక్షిణ కొరియాలో పర్యటించనుంది.
అలాగే, వింటర్ ఒలింపిక్స్ కోసం ఉత్తర కొరియా ఒక స్కై రిసార్టును ఏర్పాటు చేస్తోంది. దీనిని పరిశీలించేందుకు దక్షిణ కొరియా ఒక బృందాన్ని ఉత్తర కొరియాకు పంపించనుంది.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర కొరియా అధ్యక్షుడి భార్య ఎవరు?
- ఉత్తర కొరియా క్యాలెండర్లలో కనిపించని కిమ్ పుట్టినరోజు
- ‘వన్నాక్రై సైబర్ దాడి చేసింది ఉత్తర కొరియానే’
- దక్షిణ కొరియాతో చర్చలకు అంగీకరించిన ఉత్తర కొరియా
- ఉత్తర కొరియా క్రీడా చరిత్ర: ఒకసారి బాంబులు.. మరోసారి రాయబారాలు
- ఉత్తర కొరియాకు ఇంటర్నెట్ సేవలు ఎక్కడి నుంచి అందుతున్నాయి?
- ‘పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది’
- ‘విదేశాలకు వెళ్లాలంటే వీసా చాలు.. ఉత్తర కొరియా వెళ్లాలంటే ధైర్యం కూడా కావాలి’
- ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు ప్రకటించే ఈమె ఎవరో తెలుసా!
- యుద్ధం వస్తే ఉత్తర కొరియా అణ్వాయుధం ఎప్పుడు వాడొచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








