‘దొంగిలించిన’ భారతీయ విగ్రహాలను బ్రిటన్ తిరిగి ఇస్తుందా?

స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి భారత్‌కు చెందిన 70వేలకు పైగా కళాఖండాలు, దేవతా విగ్రహాలు చోరీకి గురయ్యాయని అంచనా. అవన్నీ విదేశాల్లోని వివిధ మ్యూజియంలలో ఉన్నట్లు భావిస్తున్నారు.
అలా చోరీకి గురైన విగ్రహాలను తిరిగి భారత్‌కు తీసుకొచ్చేందుకు ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ అనే సంస్థ ప్రయత్నిస్తోంది. ప్రితేష్ అనే యువకుడు ఆ సంస్థ తరఫున పనిచేస్తున్నాడు. ఆయన వివిధ మ్యూజియంలకు వెళ్తూ అక్కడి కళాఖండాల ఫొటోలు తీస్తారు. ఆ కళాఖండాల నేపథ్యం తెలుసుకొని అవి చోరికి గురైనవో కాదో గుర్తిస్తారు.
‘భారతీయ కళాఖండాలపైన నా ఆసక్తి చిన్నతనంలోనే మొదలైంది. నాకు హిందూ దేవతల విగ్రహాలు, వాటి కళా నైపుణ్యం చాలా నచ్చుతాయి. అలా మన మనసుకు ఎంతో దగ్గరగా ఉండే విగ్రహాలు మ్యూజియంలో ఉండడం సరికాదు. అవి దేవాలయాలు, కోటల్లోనే ఉండాలి’ అంటారు ప్రితేష్.
పురాతన వస్తువుల వ్యాపారం లండన్‌లో విస్తృతంగా జరుగుతుంది. దొంగతనానికి గురైన వస్తువులే అక్కడికి చేరతాయని ఆందోళనకారులు చెబుతారు. అక్కడి మ్యూజియంలలో ఉన్న భారతీయ విగ్రహాలను తిరిగిచ్చేయాలని ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ సభ్యులు కోరుతున్నారు.
కానీ, తమ దగ్గరున్న భారతీయ కళాఖండాలు దొంగిలించినవి కాదని బ్రిటిష్ మ్యూజియం చెబుతోంది. అన్ని మ్యూజియంలలానే అది కూడా ఇతర దేశాలకు చెందిన సంపదను ప్రదర్శిస్తుంది.
బ్రిటన్‌లో కళాఖండాల చోరీ కేసుల్లో శిక్ష పడిన వారి సంఖ్య చాలా తక్కువ. గత 15ఏళ్లలో యూకేలో అలా కేవలం ఒకే ఒక్క వ్యక్తికి శిక్ష పడింది.
భారత్‌కు చెందిన అనేక దేవాలయాలు తమ దగ్గరున్న కళాఖండాల జాబితాను తయారు చేయవు. దాంతో ఏవైనా వస్తువులు చోరీకి గురైనా దాన్ని గుర్తించడం కష్టం.
ఇవి కూడా చదవండి
- మహిళా ముఖ్యమంత్రులు: ఇప్పుడు 29 రాష్ట్రాల్లో ఒకే ఒక్కరు
- టీఆర్ఎస్ ప్రస్థానం: పోరు నుంచి పాలన వరకు కారు జోరు
- వృద్ధాశ్రమాల్లో జీవితం ఎలా ఉంటుందంటే..
- ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
- వీవీఎస్ లక్ష్మణ్: నంబర్ త్రీగా ఆడడం వెనుక అసలు చరిత్ర
- శ్రీలంక: హిందూ ఆలయాల వద్ద జంతుబలిని నిషేధించనున్న ప్రభుత్వం
- వియత్నాం హిందువులు : ఒకప్పుడు రాజ్యాలు ఏలారు.. ఇప్పుడు కనుమరుగవుతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









