శ్రీలంక: హిందూ ఆలయాల వద్ద జంతుబలిని నిషేధించనున్న ప్రభుత్వం.. ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
హిందూ ఆలయాల వద్ద జంతువులను బలి ఇచ్చే ఆచారాన్ని నిషేధించేందుకు శ్రీలంక ప్రభుత్వం అంగీకరించింది.
హిందూ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖే ఈ ప్రతిపాదన చేసిందని, దేశంలోని చాలా హిందూ సంస్థలు మద్దతు తెలిపాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీకి తెలిపారు.
దేవుళ్లు, దేవతలకు మొక్కు చెల్లింపుగా శ్రీలంకలోని కొంతమంది హిందువులు మేకలు, గొర్రెలు, గేదె దూడలు, కోళ్లను బలి ఇస్తుంటారు.
అయితే, బౌద్ధ మతస్తులు అధికంగా ఉన్న శ్రీలంకలో.. ఈ జంతుబలి అమానవీయం అంటూ చాలా సంవత్సరాలుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
హిందూ మతంతో పాటు ముస్లిం మత పండుగల సమయంలో పలుమార్లు జంతువులు రక్తమోడి ప్రాణాలు విడుస్తుండటంపై జంతు హక్కుల కార్యకర్తలు, కొన్ని బౌద్ధ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
దీంతో చాలామంది హిందువులు జంతువులను బలివ్వటం మానుకున్నారు. అలాగే కొనసాగిస్తున్న హిందువులు మాత్రం జంతు బలులపై నిషేధం తమ మత స్వేచ్ఛను హరించటమేనని వాదిస్తున్నారు.
పురాతన కాలంగా తమ మత విశ్వాసాల్లో జంతు బలి భాగమని, కాబట్టి దీనిని కొనసాగించాల్సిందేనని అంటున్నారు.
కాగా, శ్రీలంకలో మూడో అతిపెద్ద మతమైన ముస్లింలు చేసే జంతు బలుల్ని ఈ చట్టం నిషేధిస్తున్నట్లు లేదు.
శ్రీలంకలో గత కొన్ని సంవత్సరాలుగా దారుణమైన మతపరమైన హింస చోటు చేసుకుంది. మార్చి నెలలో ముస్లింల ఊచకోతలో ముగ్గురు చనిపోయారు. ముస్లింలకు చెందిన దాదాపు 450 ఇళ్లు, షాపులు ధ్వంసమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- హిందూమతం అంటే ఏమిటి? చరిత్ర ఏం చెప్తోంది?
- అమిత్ షా బీజేపీలో అందరికంటే బలమైన నాయకుడా?
- ‘రోహింజ్యా మిలిటెంట్ల చేతుల్లో హిందువుల ఊచకోత’
- తిరుమలలో తన మతం గురించి సోనియా ఏం చెప్పారు?
- ప్రాణాలు నిలుపుకోడానికి.. మతం మారుతున్నారు!
- ప్రపంచంలో ‘పవిత్రమైన’ ఏడు మొక్కలు
- శ్రీలంక: మహిళలు 'డ్రమ్ము'లా ఉండరాదన్న జిమ్.. వెల్లువెత్తిన నిరసనలు
- అక్కడ మహిళలకు మద్యం అమ్మరు! ఎందుకంటే..
- శ్రీలంక: కోలుకుంటున్న పర్యాటక స్వర్గధామం కండీ!
- శ్రీలంకలో హింస చెలరేగడానికి కారణాలేంటి?
- శ్రీలంకలో భారత్, చైనా వ్యాపార యుద్ధం!
- శ్రీలంకలో భారత్ నేర్చుకున్న పాఠమేంటి?
- స్వదేశంలో కంటే విదేశాలకు అప్పులు ఇవ్వడానికే చైనా బ్యాంకుల మొగ్గు
- శ్రీలంక: యుద్ధం ముగిసి పదేళ్లైంది.. మరి అదృశ్యమైన తమిళ టైగర్లు ఎక్కడ?
- వియత్నాం హిందువులు : ఒకప్పుడు రాజ్యాలు ఏలారు.. ఇప్పుడు కనుమరుగవుతున్నారు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








