'ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2018': పన్నెండు అత్యద్భుత ఫొటోలు

ఫొటో సోర్స్, JACK OLIVE
'రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ' 2018లో 'ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్' విజేతను ప్రకటించింది.
ఈ ఏడాది ఈ పురస్కారాన్ని 17 ఏళ్ల జాక్ ఆలివ్ అందుకున్నారు.
చిరుతపులి లాంటి చర్మంతో ఉన్న బల్లి, శీతాకాలంలో చెట్టు నుంచి రాలిన ఆకులు, గుమిగూడిన పక్షులు లాంటి ఫొటోలను న్యాయనిర్ణేతలు కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు.
ఈ ఫొటోలను రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ 2018 'ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్', 'యంగ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్' పోటీ కోసం పంపించారు.
ఈసారీ ఈ పోటీ 'పాటర్న్ ఇన్ నేచర్' అనే అంశంపై జరిగింది. ఫొటోగ్రాఫర్లు ప్రకృతిలోని జీవుల్లో తమకు కనిపించిన ఒక ప్రత్యేకమైన రూపం, రంగు, టెక్స్చర్‌ను తమ కెమెరాల్లో బంధించారు.
ఆకుల నుంచి కీటకాలు, సరీసృపాల చర్మం, కీటకాల రూపం వరకూ తమకు అందిన రకరకాల ఫొటోలను ఈ పోటీ కోసం చాలా నిశితంగా పరిశీలించారు.
చివరికి ఇంగ్లండ్‌లోని డెవాన్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల ఆలివ్ తీసిన 'లెపర్డ్ గెకో' ఫొటోకు 'ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం ప్రకటించారు.

ఫొటో సోర్స్, ROBERTO BUENO
ఆలివ్ తర్వాత స్థానంలో రాబర్ట్ బ్యూనో తీసిన ఈ ఫొటో అందరినీ ఆకట్టుకుంది.
కెనెడాకు చెందిన యుకోన్ వ్యాలీలో ఆకులు రాలినప్పుడు, వాటిపై ఉన్న లార్వా గుర్తులను ఆయన చాలా అందంగా తన కెమెరాలో బంధించారు. పసుపు ఆకులపై ఆ లార్వా గుర్తులు మలుపులు తిరిగిన రోడ్లులా కనిపిస్తున్నాయి.
"అడవి అంతా ఈ పసుపు ఆకులతో నిండిపోయి ఉంది. వాటిని చూడగానే తనకు ఏదో వేరే ప్రపంచంలోకి వచ్చేశానేమో" అనిపించిందని బ్యూనో చెప్పారు.
ఈ పోటీ కోసం మొత్తం 12 ఫొటోలను షార్టవుట్ చేశారు. ఈ పోటీలో 18 ఏళ్ల లోపు వారు మాత్రమే పాల్గొనాలనే నిబంధన ఉంది.
షార్ట్‌లిస్ట్ అయిన మిగతా ఫొటోలు

ఫొటో సోర్స్, MILO HYDE
ఓర్బీ వైరిగాటాకు చెందిన ఈ పువ్వును పదేళ్ల మిలో హాయిడ్ తన కెమెరాతో క్లిక్ చేశారు.

ఫొటో సోర్స్, REBECCA KEEN
రెబెక్కా కీన్ ఈ ఫొటోను విండర్మర్ లేక్ దగ్గర తీశారు. ఈ ఫొటోలో ఒక కప్ప తన గుడ్లతో కలిసి ఉండడం కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, IMOGEN SMITH
ఇమోగన్ స్మిత్ ఈ ఫొటోను కెన్యాలోని లెవా రిజర్వ్‌లో తీశారు. నీళ్లు తాగుతున్న జీబ్రా నీడతో ఈ ఫొటో కళాత్మకంగా నిలిచింది.

ఫొటో సోర్స్, GUILHEM DUVOT
గుయెల్‌హెమ్ డువోట్ ఈ ఫొటోను స్లొవేకియాలో తీశారు. "దీన్ని మొదటి సారి చూసినపుడు ఆకుతోపాటు వేరే జీవి కూడా ఉందని తెలుసుకోలేకపోయా. ఇక్కడ 'మిడత'ను గుర్తించడం అసాధ్యం’’ అంటారు డువోట్.

ఫొటో సోర్స్, HÅKAN KVARNSTRÖM
గోల్డెన్ శైవలాల ఈ రూపం బహుశా మీరు ఎప్పుడూ చూసుండరు. ఈ శైవలాలు ప్రపంచవ్యాప్తంగా సరస్సులు, చెరువుల్లో గట్టు దగ్గర కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, STEVE LOWRY
ఇది ఫైలమ్ క్లాసులో ఒక కణానికి చెందిన మైక్రోస్కోపిక్ ఫొటో.

ఫొటో సోర్స్, SEAN CLAYTON
ఇది స్పిన్ క్లేటన్ తీసిన ఒక 'తూనీగ' రెక్క ఫొటో.
తూనీగ రెక్క రూపం నమ్మలేనంత గజిబిజిగా ఉంటుందని, కానీ వాటిని చాలా దగ్గరనుంచి చూస్తే ప్రపంచంలోని అందమైన పాటర్న్స్‌లో అది ఒకటి అనిపిస్తుందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, VIRAJ GHAISAS
విరాజ్ ఈ ఫొటో ముంబైలో తీశారు. చలికాలంలో ఈ పక్షులు చాలా ప్రాంతాల్లో గుమిగూడుతాయి. స్థానికులు వాటికి రోజూ జంక్ ఫుడ్ పెడుతుంటారు.

ఫొటో సోర్స్, HENRI KOSKINEN
ఇది నెమలి ఈక కాదు, క్రిస్టలైజ్డ్ సిట్రిక్ యాసిడ్ మైక్రోస్కోపిక్ రూపం. ఈ ఫొటోను హెన్రీ కోస్కినెన్ తీశారు.

ఫొటో సోర్స్, STEVE LOWRY/ROYAL SOCIETY OF BIOLOGY
పుప్పొడిని పీలుస్తున్న ఈ కీటకం ఫొటోను స్టీవ్ లోరీ తీశారు.
ఇవి కూడా చదవండి:
- మరణ శిక్ష 170 దేశాల్లో లేదా? ఐరాస మాటలో నిజమెంత?
- భూటాన్: 'ప్రపంచంలో అత్యంత కఠినమైన ఒక రోజు సైకిల్ రేస్'
- REALITY CHECK: ఈ ఫొటోలు ఇప్పటివి కావు!
- ఫొటోల్లో తమిళనాడు జల్లికట్టు
- ఫొటోల్లో: కరవు కోరల్లో ఆస్ట్రేలియా
- ఇన్‌స్టాగ్రామ్ ఫొటోల్లో భారత రైలు ప్రయాణం
- ఈ ఫొటోలు చూస్తే ప్లాస్టిక్ అంటే భయమేస్తుంది!!
- ఓ ఫొటోగ్రాఫర్ ప్రేమలేఖ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








