ముంబయి నగరానికి ఓ ఫొటోగ్రాఫర్ ప్రేమలేఖ

A camel ride on Mumbai's Marine Drive in 1977

ఫొటో సోర్స్, Sooni Taraporevala

ఫొటో క్యాప్షన్, 1977లో ముంబయి మెరైన్ డ్రైవ్ మీద ఒంటె సవారీ

సూనీ తారాపోర్‌వాలా భారతదేశపు అగ్రస్థాయి ఫొటోగ్రాఫర్, స్క్రీన్‌రైటర్, ఫిల్మ్‌మేకర్.

మిసిసిపి మాసాలా, ద నేమ్‌సేక్, ఆస్కార్‌ అవార్డు కోసం నామినేట్ అయిన సలాం బాంబే వంటి సినిమాల రచయితగా ఆమె ప్రఖ్యాతి గాంచారు. జాతీయ అవార్డు గెలుచుకున్న లిటిల్ జిజో సినిమాకు ఆమె దర్శకత్వం వహించారు.

తను పెరిగిన ముంబయి నగరాన్ని 1977 నుంచీ ఆమె ఫొటోలు తీశారు.

నాటి వింతలతో పాటు రోజువారీ జీవన క్రమాన్ని నిక్షిప్తం చేసిన ఈ ఫొటోలు.. ఈ మహానగర సామాజిక చరిత్రకు గణనీయ తోడ్పాటునందిస్తాయి.

ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరాల్లో ఒకటైన ముంబయి నివాసిగా సామాజిక తరగతులు, వర్గాలకు అతీతంగా ఆ నగరంపై ఆమె ప్రేమపూరిత దృక్కోణాన్ని ఈ చిత్రాలు పట్టిచూపుతాయి.

ముంబయిలో జరుగనున్న ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్న ఆమె ఫొటోలు.. ఆ నగర వింతలు విశేషాలు, చిన్నారులు, వయోవృద్ధులు, నగర సంస్కృతి, రాజకీయాల చారిత్రక పత్రాల వంటివనడంలో సందేహం లేదు.

Lilliput (left) and Stellan Skarsgard on the set of The Perfect Murder, Bombay 1987

ఫొటో సోర్స్, Sooni Taraporevala

ఫొటో క్యాప్షన్, 1987లో బాంబేలోని ఒక సినిమా సెట్‌లో నటులు లిల్లిపుట్ (ఎడమ) స్టెల్లాన్ స్కార్స్‌గార్డ్
Children play with a toy gun in Cusrow Baug in Mumbai in 1985

ఫొటో సోర్స్, Sooni Taraporevala

ఫొటో క్యాప్షన్, 1985లో ముంబయిలోని కుస్రో బాగ్‌లో బొమ్మ తుపాకులతో ఆడుకుంటున్న పిల్లలు
A synagogue in Mumbai

ఫొటో సోర్స్, Sooni Taraporevala

ఫొటో క్యాప్షన్, ముంబయిలోని ఒక యూదు ప్రార్థనా మందిరం (2012)
Spectators at an air show on Marine Drive

ఫొటో సోర్స్, Sooni Taraporevala

ఫొటో క్యాప్షన్, 2005లో మెరైన్ డ్రైవ్‌ వద్ద వైమానిక విన్యాసాలను వీక్షిస్తున్న ప్రేక్షకులు
A security guard sits on charpoy at the Juhu Airport in 1982

ఫొటో సోర్స్, Sooni Taraporevala

ఫొటో క్యాప్షన్, 1982లో జుహు ఎయిర్‌పోర్టు వద్ద నులక మంచం మీద కూర్చుని ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు
On location while the movie The Perfect Murder was being shot in Mumbai in 1987

ఫొటో సోర్స్, Sooni Taraporevala

ఫొటో క్యాప్షన్, 1987లో ముంబయిలో ద పర్‌ఫెక్ట్ మర్డర్ సినిమా షూటింగ్
Sarfu and Irrfan Khan blindfolded during a workshop on the film, Salaam Bombay!

ఫొటో సోర్స్, Sooni Taraporevala

ఫొటో క్యాప్షన్, 1987లో సలాం బాంబే సినిమా వర్క్‌షాపులో కళ్లకు గంతలు కట్టుకునివున్న నటులు సర్ఫు, ఇర్ఫాన్ ఖాన్
Arists MF Hussain drawing at his home in Mumbai

ఫొటో సోర్స్, Sooni Taraporevala

ఫొటో క్యాప్షన్, భారతదేశపు విఖ్యాత చిత్రకారుల్లో ఒకరైన ఎం.ఎఫ్.హుస్సేన్ 2005లో ముంబయిలో తన ఇంట్లో ఉన్నప్పడు తీసిన ఫొటో.. ఆయన 2011 జూన్‌లో చనిపోయారు
A girl looks at the ocean while standing on a beach in Mumbai

ఫొటో సోర్స్, Sooni Taraporevala

ఫొటో క్యాప్షన్, ముంబయి బీచ్‌లో నిలుచుని సముద్రాన్ని చూస్తున్న ఓ బాలిక
Men laughing while celebrating Ganesh Chaturthi, a Hindu festival

ఫొటో సోర్స్, Sooni Taraporevala

ఫొటో క్యాప్షన్, 2016లో గణేశ్ చతుర్థి ఉత్సవాల్లో యువకుల ఆనందం
A poster of former Prime Minister Indira Gandhi during the Congress party's centenary celebrations in 1985

ఫొటో సోర్స్, Sooni Taraporevala

ఫొటో క్యాప్షన్, 1985లో కాంగ్రెస్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పోస్టర్
The navy band performs ahead of the premiere of the movie Janbaaz at Metro Cinema in 1986

ఫొటో సోర్స్, Sooni Taraporevala

ఫొటో క్యాప్షన్, 1986లో మెట్రో సినిమా థియేటర్‌లో జాన్‌బాజ్ సినిమా ప్రదర్శనకు ముందుగా కచేరీ చేస్తున్న నేవీ బ్యాండ్
Actor Raj Kapoor at the premiere of Janbaaz while a fan gazes at him

ఫొటో సోర్స్, Sooni Taraporewala

ఫొటో క్యాప్షన్, జాన్‌బాజ్ సినిమా తొలి ప్రదర్శనకు వస్తున్న నటుడు రాజ్ కపూర్‌ను ఆనందంగా తిలకిస్తున్న అభిమానులు

సూనీ తారాపోర్‌వాలా ఫొటో ప్రదర్శన ‘హోమ్ ఇన్ ద సిటీ’ అక్టోబర్ 13వ తేదీన ముంబయిలోని చెమోల్డ్ ప్రెస్కాట్ రోడ్‌లో ప్రారంభమవుతుంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)