ఫొటోల్లో: కరవు కోరల్లో ఆస్ట్రేలియా

తూర్పు ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాలుఇప్పటివరకూ ఎప్పుడూ లేనంత అతిపెద్ద కరవుతోవిలవిల్లాడుతున్నాయి.

వర్షాలు లేకపోవడంతో ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా మారింది.

రాయ్‌టర్స్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ గ్రే ఆ ప్రాంతాల్లో పర్యటించారు. కరవుతో ఎండిపోయిన ప్రాంతాలను నింగి నుంచి తన కెమెరాలో బంధించారు.

ఆస్ట్రేలియాలో కరువు

ఫొటో సోర్స్, Reuters

న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో ఒక పొలంలో నీళ్ల ట్యాంక్ దగ్గర ఉన్న ఒకే ఒక చెట్టు, ఇక్కడ జీవానికి మిగిలిన ఒకే ఒక సాక్ష్యం ఇదే.

2010 తర్వాత వర్షాలు సరిగా పడలేదని ఈ పొలం యజమాని మే మెక్‌వాన్ చెప్పారు.

ఆస్ట్రేలియాలో కరువు

ఫొటో సోర్స్, Reuters

న్యూ సౌత్ వేల్స్‌లో సుమారు 98 శాతం ప్రాంతం ఇప్పుడు కరవు కోరల్లో చిక్కుకుంది. పొరుగు రాష్ట్రం క్వీన్స్‌లాండ్‌లో కూడా మూడొంతుల భాగంలో ఇదే పరిస్థితి ఉంది.

ఫలితంగా రైతులు తమ పశువుల కోసం బయటి నుంచి గ్రాసం తెప్పించాల్సి వస్తోంది. కరవుతో వారి రోజువారీ ఖర్చు కూడా చాలా పెరిగింది.

ఆస్ట్రేలియాలో కరువు

ఫొటో సోర్స్, Reuters

ఈ ఫొటోలో మీరు ఖాళీగా ఉన్న ఒక నీటి ట్యాంకు దగ్గర నుంచి నిరాశగా వెళ్తున్న ఒక ఆవును చూడవచ్చు. ఈ నీళ్ల ట్యాంక్ టేమ్‌వర్త్ ప్రాంతంలో ఉంది.

టిమ్ వాలెస్టోన్ అనే రైతు "నేను నా పశువులకు ఆహారం మాత్రమే పెట్టగలుగుతున్నా, అంతకు మించి ఇంకేమీ చేసే పరిస్థితి లేదు" అన్నారు.

ఆస్ట్రేలియాలో కరువు

ఫొటో సోర్స్, Reuters

ఇది న్యూ సౌత్ వేల్స్‌లో గునేదాహ్ దగ్గర ఎండిపోయిన ఒక ఆనకట్ట ఫొటో.

కరవు వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటివరకూ 73.8 కోట్ల డాలర్ల సాయం అందించింది.

ఎస్ విట్నీ అనే మరో రైతు "నేను ఇక్కడే పుట్టి పెరిగా. ఇలాంటి కరవు ఎప్పుడూ చూళ్లేదు" అన్నారు.

ఆస్ట్రేలియాలో కరువు

ఫొటో సోర్స్, Reuters

టేమ్‌వర్త్ ప్రాంతంలోని ఒక పొలంలో వరుసగా మేస్తున్న గొర్రెలు

కరవు ప్రభావిత రైతులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కూడా ప్రభుత్వం నిధులు ఇస్తోందని కొందరు రైతులు చెబుతున్నారు.

ఆస్ట్రేలియాలో కరువు

ఫొటో సోర్స్, Reuters

ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో గత డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఎండలు ఈసారి చాలా తీవ్రం అయ్యాయి.

ఈ ఏడాది జులై నెల 2002 తర్వాత అంత్యంత వేడిగా ఉన్న నెలగా నిలిచింది.

ఆస్ట్రేలియాలో కరువు

ఫొటో సోర్స్, Reuters

ఆస్ట్రేలియా వ్యవసాయ ఉత్పత్తిలో నాలుగో వంతు న్యూ సౌత్ వేల్స్ నుంచే జరుగుతుంది.

అందుకే ఈ కరవు ప్రభావం ఆస్ట్రేలియాలోని దేశీయ ఉత్పత్తి, పరిశ్రమలపై కూడా పడింది.

ఆస్ట్రేలియాలో కరువు

ఫొటో సోర్స్, Reuters

ఎండల వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో జూన్‌లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కం టర్న్‌బుల్ పర్యటించారు. దీనికి పర్యావరణ మార్పులే కారణం అని ఆయనన్నారు.

(ఫొటోలు రాయ్‌టర్స్)

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)