ఆస్ట్రేలియా: కిటికీలోంచి ఇంట్లోకి చొరబడ్డ కంగారూ

ఫొటో సోర్స్, MANFRED ZABINSKAS
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగర శివారులో ఒక కంగారూ ఏదో ఆందోళనతో కిటికీ గుండా ఇంట్లో చొరబడింది. ఇంట్లో రభస సృష్టించింది.
ఈ హఠాత్పరిణామంతో ఇంట్లోనివారు హడలెత్తిపోయారు. ఎలాగోలా కంగారూను స్నానాల గదిలోకి పోయేలా చేసి, తాత్కాలికంగా అక్కడే బంధించారు. వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించారు. వన్యప్రాణి సంరక్షకుడు వచ్చి చూసేసరికి స్నానాల గదిలో అది బాగా అలసిపోయి ఉంది. అక్కడి నుంచి కంగారూను సురక్షితంగా బయటకు పంపించేందుకు సంరక్షకుడు దానికి మత్తు ఇచ్చారు.
ఇంట్లోకి చొరబడే క్రమంలో కంగారూ గాయాలపాలైంది. కాళ్లకు, పాదాలకు గాయాలయ్యాయి. దీనికి బాగా రక్తస్రావం అయ్యింది. ఇంట్లోనివారు కంగారూ పరిస్థితిపై ఆందోళన చెందారని వన్యప్రాణి సంరక్షకుడు మాన్‌ఫ్రెడ్ జాబిన్‌స్కాస్ చెప్పారు.

ఫొటో సోర్స్, MANFRED ZABINSKAS
మెల్‌బోర్న్ శివారు డీర్ పార్క్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
ఈ కంగారూ దాదాపు 30 కేజీల బరువుంది. ఇంట్లో కంగారూ తిరిగిన చోట ఉన్న వస్తువులు దెబ్బతిన్నాయి. ఇది ఇంట్లోంచి వెళ్లిపోయేటప్పుడు మరో కిటికీ దెబ్బతింది.
ఏదైనా కుక్క తనపై దాడికి వస్తోందనే భయంతోనో లేదా అటుగా వెళ్తున్న కారు తగులుతుందనే భయంతోనే కంగారూ ఇంట్లోకి చొరబడి ఉంటుందని మాన్‌ఫ్రెడ్ జాబిన్‌స్కాస్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, MANFRED ZABINSKAS
కంగారూలు నివసించే ప్రాంతాల్లోకి నగర శివార్లు విస్తరిస్తూ పోతున్నాయని, ఇలాంటి ఘటనలకు ఇది కొంత మేర కారణమని ఆయన చెప్పారు.
కంగారూ గాయాలకు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఒక వన్యప్రాణి సంరక్షణ సంస్థ దీని బాగోగులు చూసుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
- తొలకరి జల్లుల్లో మట్టి వాసనకు కారణం ఇదే
- 5,300 ఏళ్ల కిందటి మంచుమనిషి చివరిగా ఏం తిన్నాడు?
- అస్సాం పౌరసత్వ జాబితా: 40 లక్షల మంది ప్రజలు భారతీయులు కాదు
- ఆరు నెలలకోసారి దేశం మారే ఐరోపా దీవి కథ ఇది
- వందేళ్ల ఫిన్లాండ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఏడు అంశాలు
- ముషారఫ్‌కు కలాం క్లాసు తీసుకున్న విధంబెట్టిదనిన!
- స్కోమర్ ద్వీపంలో కనువిందు చేస్తున్న పఫిన్ పక్షులు
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?
- జింబాబ్వే ఎన్నికలు: ఐదు ముఖ్యాంశాలు
- ఈ మహిళ ప్రపంచాన్ని చుట్టేశారు
- కళ్ల ముందే బాయ్ ఫ్రెండ్ చనిపోతుంటే వీడియో తీసిన ‘స్నాప్‌చాట్ రాణి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









