క్రిస్టియానో రోనాల్డోపై అత్యాచార ఆరోపణలు.. #MeToo ఉద్యమమిచ్చిన ధైర్యంతో ముందుకు వచ్చిన మహిళ

ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో

ఫొటో సోర్స్, Matrix

ఫొటో క్యాప్షన్, ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో లాస్ వెగాస్‌లో తనపై అత్యాచారం చేశారని క్యాథరిన్ మయోర్గా ఆరోపిస్తున్నారు

ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో 2009లో తనపై అత్యాచారం చేశారని మాజీ టీచర్ క్యాథరిన్ మయోర్గా ఆరోపించారు. #MeToo ఉద్యమ ధైర్యంతోనే క్యాథరిన్ ఇలా ముందుకు వచ్చారని ఆమె లాయర్ తెలిపారు.

''MeToo ఉద్యమం స్ఫూర్తితో మహిళలు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి నోరు విప్పారు. అవే క్యాథరిన్‌కు ధైర్యాన్నిచ్చాయి'' అని ఆమె తరఫు లాయర్ లెస్లీ స్టోవాల్ అన్నారు.

అయితే, లాస్ వెగాస్ హోటల్‌లో అత్యాచారం చేశారనే క్యాథరిన్ ఆరోపణలను రొనాల్డో తీవ్రంగా ఖండించారు.

ఆయన తరఫున న్యాయవాదులు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.

రోనాల్డో న్యాయవాది జువెన్టస్ ఫార్వర్డ్ (33) మాట్లాడుతూ, ''ఎలాంటి విచారణకైనా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆరోపణలపై ఆయనకు స్పష్టత ఉంది''అని తెలిపారు.

మయోర్గా లాయర్ ఏమంటున్నారు?

మీడియా సమావేశానికి మయోర్గా హాజరుకాలేదు. విలేఖరులు సంధించే ప్రశ్నల నుంచి తప్పించుకోడానికే ఆమె సమావేశానికి రాలేదని మయోర్గా తరఫు న్యాయవాది స్టొవాల్ అన్నారు.

''మీడియాకు అందుబాటులో ఉండకూడదని ఆమె నిర్ణయించుకున్నారు. తన మానసికస్థితిని దృష్టిలో పెట్టుకొని బాహ్యప్రపంచానికి దూరంగా ఉండాలనుకుంటున్నారు''అని ఆమె లాయర్ తెలిపారు.

పాల్మ్స్ హోటల్‌లోని రెయిన్ నైట్ క్లబ్‌లో, కసినోలో రోనాల్డోను కలిశానని, అక్కడి పెంట్ హౌస్ సూట్‌లోనే రోనాల్డో తనపై అత్యాచారం చేశారని మయోర్గా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన కక్షిదారు తీవ్రమైన మానసిక వ్యధ అనుభవిస్తున్నారని మయోర్గా లాయర్ స్టొవాల్ తెలిపారు.

బాధితురాలు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు మానసిక వైద్యులు నిర్ధారించారని చెప్పారు.

మయోర్గా వ్యాజ్యానికి 20 రోజుల్లోపు రోనాల్డో స్పందించాలని అన్నారు. ''ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను మా న్యాయబృందం విడుదల చేయాలనుకుంటోంది. ఇందులో పోలీస్ నివేదిక, మీడియా రికార్డ్స్ కూడా ఉన్నాయి'' అని పేర్కొన్నారు.

ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో

రోనాల్డో ఎలా స్పందించారు?

జర్మన్ మ్యాగజైన్ డర్ స్పైగల్‌లో మొదట ప్రచురితమైన ఈ అత్యాచార ఆరోపణల కథనాన్ని రోనాల్డో ఫేక్ న్యూస్‌గా అభివర్ణించారు.

దీనిపై బుధవారం తన ట్విటర్‌లో ఒక ప్రకటన చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఘటన తర్వాత వెంటనే లాస్ వెగాస్ పోలీసు స్టేషన్‌లో మయోర్గాఫిర్యాదు చేశారని డర్ స్పైగల్‌ మ్యాగజైన్ పేర్కొంది.

అయితే, ఆ మరుసటి ఏడాది రోనాల్డోతో ఆమె రాజీపడ్డారని, అత్యాచారం విషయం ఎవరికి చెప్పకుండా ఉండేందుకు రూ.2 కోట్ల 77 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది.

ఆ రహస్య ఒప్పందాన్ని ఇప్పుడు బయటపెట్టాలని మయోర్గా న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.

తమకు 2009 జూన్‌లో ఫిర్యాదు వచ్చిందని లాస్ వెగాస్ పోలీసులు ధ్రువీకరించారు. అయితే, ఆ కేసులో ఎవరినీ పట్టుకోలేదని స్పష్టం చేశారు.

''ఆ సమయంలో ఫిర్యాదు తీసుకున్నాం. బాధితురాలు ఆ వ్యక్తి ఎవరో, ఏ ప్రదేశమో సరైన వివరాలు ఇవ్వలేదు'' అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్పుడు కేసును తిరిగి ప్రారంభిస్తున్నాం. వారిచ్చిన సమాచారం ఆధారంగా తమ పరిశోధకులు విచారణ చేస్తారని చెప్పారు.

మరోవైపు, ఈ ఘటనను వెలుగులోకి తెచ్చిన జర్మన్ మ్యాగజైన్ డర్ స్పైగల్‌పై పరవు నష్టం దావా వేస్తున్నట్లు రోనాల్డో తరఫు న్యాయవాది తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)