‘‘అత్యాచారం వ్యధ నుంచి నేనెలా కోలుకున్నానంటే...’’
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
అత్యాచారానికి సంబంధించిన వార్తలు మీడియాలో వచ్చినప్పుడు అమ్మాయిపై జరిగిన హింస, ఆమెకు జరగాల్సిన న్యాయం గురించే అంతా చర్చిస్తారు.
సమాజంలో ఆ అమ్మాయి గౌరవం, ఆమె పెళ్లిపైన పడే ప్రభావం గురించి కూడా కొందరు ఆందోళన చెందుతారు.
కానీ, ఆ అత్యాచార ప్రభావం ఆమె మనసు మీద, ఆలోచన మీద ఎలా ఉంటుందనేది ఎవరూ మాట్లాడరు. కానీ, అత్యాచార బాధితులు ఆ తరువాత ఇళ్లలోనే బందీలుగా మారతారు. బయటకు రావడానికి భయపడతారు.
అత్యాచారం తరువాత బాధితులు మనుషుల పట్ల నమ్మకం కోల్పోతారు. తమ బాధను అధిగమించడానికి తీవ్రమైన సంఘర్షణకు లోనవుతారు. కానీ, వాటి గురించి ఎవరూ మాట్లాడరు.
ఉత్తర ప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన ఓ అమ్మాయిని కలిసి మేం ఆ విషయాలనే తెలుసుకునేందుకు ప్రయత్నించాం. ఆ దుర్ఘటన తాలూకు గాయాల నుంచి బయటపడటానికి ఆమె చేసిన పోరాటం గురించి విన్నాం.
అయిదేళ్లలో ఆ భయం నుంచి ఆ అమ్మాయి ఎలా బయటపడింది? ఇల్లు దాటి, ఊరి దాటి పట్నానికి ఎలా చేరుకుంది? మనుసు పొరల్లో గూడుకట్టుకున్న భయాన్ని జయించి కొత్త ఆశలతో ఎలా ముందడుగేస్తోంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఆ అమ్మాయి చెప్పిన సమాధానాల సంకలనమే ఈ వీడియో.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





