బీరు ఇస్తే వాన కురిపిస్తానన్నాడు.. ఇచ్చాం - మరి వానొచ్చిందా?

నైజీరియాలోని కొన్ని ప్రాంతాల్లో రైన్ మేకర్స్... అంటే వర్షం కురిపించే వాళ్లకు చాలా గౌరవం ఉంది. పెళ్లిళ్లు ఇతర ముఖ్యమైన కార్యక్రమాల సమయంలో వర్షాలు కురిపించడానికైనా , వాటిని ఆపడానికైనా ఈ రెయిన్‌మేకర్స్‌ను పిలవడమే కాదు... వారికి డబ్బులు ఇస్తుంటారు. మరి వాళ్లకు నిజంగా ఆ శక్తి ఉందంటారా?
‘‘ఇప్పుడు వర్షం పడాలి.. అని నేను అంటే, వర్షం కురుస్తుంది.
వర్షం ఆగిపోవాలి అని అంటే... ఆగిపోతుంది.
నా పేరు గాడ్విన్ ఒనసేడు.
రైన్ పుషర్’’
ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో రెయిన్‌మేకర్స్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు.
నైజీరీయాలోని అనంబ్రా రాష్ట్రంలో ఉన్న ఇఫిటెడును అనే గ్రామంలో మేం ఉన్నాం. వర్షాన్ని నియంత్రిస్తానని చెప్పుకుంటున్న వ్యక్తిని కలిసేందుకు ఇక్కడికి వచ్చాం.
ఆయనకున్న ఈ నైపుణ్యానికి ధర కూడా చెల్లించాల్సి ఉంటుంది.
దీని కోసం కొన్ని కోలా గింజలు, రెండు కార్టన్ల బీరు కావాలని ఆయన కోరుతారు.
ఇవన్నీ ఇస్తేనే తాను వర్షం కురిపించగలనని అంటారు.
మరి వర్షం కురిపించగలరా?
అది కనుక్కోవడం కోసమే మేం వేచి చూశాం.

ఈ రెయిన్‌మేకర్లు వర్షాన్ని కురిపించడమే కాదు ఆపగలమని కూడా చెప్పుకుంటున్నారు.
కార్యక్రమాలకి వర్షాలు అడ్డంకి కాకూడదని భావించే వారంతా వీళ్లకి డబ్బులిస్తుంటారు.
అతను వాగ్దానం చేసిన రెండు గంటలకే నిజంగానే వర్షం పడింది.
మేం ఊహించినట్లుగా భారీ వర్షమైతే పడలేదు. ఇది పెద్ద వర్షమేం కాదు. కానీ వర్షం పడటం మేం చూశాం. వర్షాన్ని కురిపిస్తాడన్న పేరును ఈ రెయిన్‌మేకర్ నిలబెట్టుకున్నాడు.
సంవత్సరంలో ఈ కాలంలో వర్షాలు పడే ప్రాంతమే ఇది. ఈ రోజు వర్షాలు పడతాయన్న అంచనా ముందే ఉంది కూడా.

ఈ వ్యక్తులు వర్షాలు కురిపించడం వెనుక సైన్స్ ఏమీ లేదు. అయితే, గాడ్విన్ అనుసరించే పద్ధతుల్లో కొన్ని అనుమానాస్పద అంశాలున్నాయి.
కానీ కొంత మంది ఆయనను విశ్వసిస్తున్నారన్న విషయాన్ని మీరు గమనించవచ్చు.
అయితే వాతావరణాన్ని నియంత్రించడం అనేది ఎవరివల్లా అయ్యే పని కాదని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చూడండి:
- లబ్ డబ్బు : వర్షాలకు, వడ్డీ రేట్లకు సంబంధం ఏమిటి?
- జపాన్లో వరద మిగిల్చిన విషాదానికి ఈ ఫొటోలే నిదర్శనం
- జపాన్ వరదలు: రికార్డు వర్షపాతం.. పెను ప్రమాదం
- జపాన్ వరదలు: రికార్డు వర్షపాతంతో 141 మంది మృతి
- #GroundReport ప్రకాశం జిల్లా: తవ్విన కొద్దీ కన్నీరే
- కేరళ వరదలు: ఎందుకీ పరిస్థితి?
- తొలకరి జల్లుల్లో మట్టి వాసనకు కారణం ఇదే
- కేరళ వరదలు: వందేళ్లలో కనీవినీ ఎరుగని విధ్వంసం
- జపాన్ మీద విరుచుకుపడిన 'టైఫూన్ జేబి'
- చెన్నంపల్లి కోటలో గుప్తనిధులు ఉన్నాయా?
- రాయలసీమలో ‘రత్నాల’ వేట
- ప్రపంచవ్యాప్తంగా వేడెక్కుతున్న వాతావరణం... ‘భూమిపై భరించలేని స్థాయికి ఉష్ణోగ్రతలు’
- అమెరికాలో హరికేన్ ఫ్లోరెన్స్: వాళ్లు తిరిగి వచ్చేసరికి వాళ్ల ఇళ్లు ఉంటాయో ఉండవో
- తీవ్ర కరవు కోరల్లో చిక్కుకున్న ఆస్ట్రేలియా రాష్ట్రం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









