ప్రపంచవ్యాప్తంగా వేడెక్కుతున్న వాతావరణం... ‘భూమిపై భరించలేని స్థాయికి ఉష్ణోగ్రతలు’

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా వాతావరణం వేడెక్కుతోంది. ఇది ఉత్తరార్ధ గోళంలోని దేశాలలో అనేక సమస్యలను సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు కరవు పరిస్థితులను సృష్టించడమే కాకుండా, అనేక చోట్ల కార్చిచ్చుకు కూడా కారణమవుతున్నాయి.
వాతావరణ పరిస్థితులు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అనేక ప్రాంతాలు మనుషులు నివసించేందుకు పనికిరాకుండా పోతాయి.
గత కొన్ని వారాలుగా అనేక దేశాలలో ఉష్ణోగ్రతలు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో గత వారం సగటు ఉష్ణోగ్రత 42.3 సెల్సియస్‌గా నమోదయింది.
ఎపుడూ శీతల వాతావరణం ఉండే ఆర్కిటిక్ సర్కిల్ దగ్గరి స్కాండినేవియన్ దేశాలలో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటింది. నార్వేలోని బార్డుఫాస్ పట్టణంలో ఉష్ణోగ్రత 33.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇది ఆ దేశంలోనే రికార్డ్ స్థాయి.
ఇక ఒమన్ దేశంలో ఉష్ణోగ్రత ఏకంగా 24 గంటలపాటు ఒకే స్థాయిలో నిలకడగా కొనసాగింది. 42.6 డిగ్రీలకు ఏ మాత్రం తగ్గలేదు. ఇది మరో రకమైన రికార్డ్.
వాతావరణ మార్పు ఇలాగే కొనసాగితే త్వరలోనే భూగ్రహంపై ఉష్ణోగ్రతలు భరించలేని స్థాయికి చేరుకునే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అమెరికాలోని అనేక రాష్ట్రాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు, పొడిబారిన పరిస్థితులు కార్చిచ్చుకు కారణమవుతున్నాయి.
ఇలాంటి దృశ్యాలే యూరప్‌లో కూడా కనిపిస్తున్నాయి. పోర్చుగల్‌లోని అల్ గార్వ్ ప్రాంతంలోని పర్వతానికి ఒకవైపు మొత్తం మూడు రోజులుగా అగ్నిగోళంలా మండుతోంది.
ఇలాంటి కార్చిచ్చు ఇక్కడ సాధారణమే కానీ అత్యంత వేగంగా ఈ మంటలు విస్తరించడం మాత్రం విస్మయానికి గురి చేస్తోంది.
మరోవైపు ఆసియా ఖండంలో కూడా విపరీతమైన వేడి వాతావరణం నెలకొనివుంది.
తమ దేశంలోని పరిస్థితులను రహస్యంగా ఉంచే ఉత్తర కొరియా కూడా అక్కడి అధిక ఉష్ణోగ్రతల వల్ల తలెత్తిన పరిస్థితులను కెమెరాలో బంధించేందుకు అనుమతిస్తుంది.
అనేక దేశాలలో అత్యధిక ఉష్ణోగ్రతలను ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించారు కూడా.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ప్రపంచవ్యాప్తంగా వాతావరణం వేడెక్కితే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతాయి అని నేను అనుకుంటున్నాను. వాతావరణ పరిస్థితులు ఇంకా తీవ్రంగా మారబోతున్నాయి. తీవ్రమైన వేడి ఉంటుంది. వరదలు ముంచెత్తుతాయి. తుపానులు విరుచుకుపడతాయి- ఇవన్నీ కూడా వాతావరణంలో విపరీత మార్పులొస్తున్నాయనడానికి సూచికలు’’ అని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన గ్రాంథం ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ జోన్నా హెయిఘ్ అన్నారు.
ఇక ఈ వేడి వాతావరణం వివిధ రకాలుగా ప్రతిఫలిస్తోంది. స్విట్జర్లాండ్ లోని పచ్చిక భూములు గోధుమరంగులోకి మారిపోయాయి.
జపాన్‌కు మరొక సవాల్ ఉంది. గత కొద్ది కాలంగా, ఇక్కడ వేడి వల్ల వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2020 ఒలింపిక్ పోటీలు ఇక్కడే నిర్వహించనున్నారు. పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు జపాన్‌కు పెను సవాల్‌గా మారాయి. అందుకే ఆ దేశం తమ గడియారాలలో సమయాన్ని రెండు గంటలు ముందుకు జరిపి కొన్ని పోటీలను వాతావరణం చల్లగా ఉన్నపుడే నిర్వహించే ఆలోచనలో ఉంది. వాతావరణం మార్పుకు స్పందనగా ఒకవేళ జపాన్ ఇలా తమ గడియారాలలో సమయాన్ని రెండు గంటలు ముందుకు జరిపితే అదొక సంచలన నిర్ణయమే.
ఇవి కూడా చూడండి:
- టోక్యో ఒలింపిక్స్: కాలాన్ని ముందుకు జరపడంపై జపాన్‌లో చర్చ
- ఏసీలు చల్లబరుస్తున్నాయా.. లేక వేడెక్కిస్తున్నాయా?
- విశాఖలో సముద్రం అలల కింద సిరుల సాగు
- క్రయానిక్స్: చనిపోయాక బతకొచ్చా? మృత్యువును కూడా మోసం చేయొచ్చా?
- ఎంత తిన్నామన్నదే కాదు.. ఎప్పుడు తిన్నామన్నదీ ముఖ్యమే!
- దక్షిణాది పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాలు.. ఏపీలో 5శాతం మందికి సంతాన లేమి
- ట్రాన్స్ ఫ్యాట్స్: ‘వడ, సమోసా, బజ్జీ, పిజ్జా అత్యంత ప్రమాదకరం’
- భూమిని సూర్యుడే కబళిస్తాడా?
- రైతన్న రిటైర్మెంట్: వ్యవసాయ విరమణ సన్మానం చేసిన కుమారులు
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- బెంగళూరు సహా ఈ 11 నగరాల్లో నీటికి కటకటే!
- సియాచిన్: అక్కడ నిద్రలో కూడా సైనికుల ప్రాణాలు పోతుంటాయ్!
- ఆఫ్రికాలో హరిత హారం
- పామాయిల్: మీ వంటనూనె, సౌందర్య సాధనాలు అడవి జంతువుల్ని ఎలా చంపేస్తున్నాయంటే..
- ఓజోన్ రంధ్రం పెద్దది కావడానికి చైనా కారణమా?
- 8 లక్షల ఏళ్లలో ఎప్పుడూ ఇంత కాలుష్యం లేదు
- ‘మనుషులపై ఏనుగులకు తీవ్రంగా పెరుగుతున్న కోపం’
- ఉప్పు తిన్న సముద్రానికే మనం ముప్పు తెస్తున్నాం
- అస్సాం: ‘అడవుల్ని ఆక్రమిస్తున్న టీ తోటలు’.. మనుషుల్ని చంపుతున్న ఏనుగులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









