అమెరికాలో హరికేన్ ఫ్లోరెన్స్: తూర్పు తీరాన్ని సమీపిస్తోంది

వీడియో క్యాప్షన్, వీడియో: అమెరికాను భయపెడుతున్న పెనుతుపాను

అమెరికాను హరికేన్ మళ్లీ భయపెడుతోంది. గంట గంటకూ శక్తిని పుంజుకుంటూ, అత్యంత బలమైన తుపానుగా మారుతున్న హరికేన్ ఫ్లోరెన్స్, అమెరికా తూర్పు తీరాన్ని సమీపిస్తోంది.

ఇది ఎంత బీభత్సం సృష్టిస్తుందోనని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానంగా కేరొలీనా, వర్జీనియా రాష్ట్రాలు ఈ తుపాను ప్రభావానికి గురవనున్నట్లు అంచనా.

ఈ తుపాను శుక్రవారం లోపు తీరాన్ని దాటి వస్తుందనే సూచనలు ఉండటంతో... పది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వాళ్లు తిరిగి వచ్చేసరికి వాళ్ల ఇళ్లు మిగిలి ఉంటాయో, లేదో చెప్పలేని పరిస్థితి.

తుపాను

తుపాను 320 కిలోమీటర్ల పరిధితో గంటకు 225 కిలోమీటర్ల వేగంతో వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉత్తర కేరొలీనా ప్రాంతాన్ని ముప్పై ఏళ్ల క్రితం హరికేన్ హ్యూగో చిన్నాభిన్నం చేసింది. ఆ తర్వాత మళ్లీ అంతటి విధ్వంసకరమైన తుపాను ఇదే అని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

ఫ్లోరెన్స్ తుపానుని అనుసరించి మరో రెండు తుపాన్లు అమెరికా తీరాన్ని తాకే అవకాశముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

పరిస్థితులు చూస్తుంటే.. అట్లాంటిక్ హరికేన్ సీజన్ ఉగ్రరూపం దాల్చినట్టే కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)