ప్రాణాలు తీస్తున్న ఈ 'మోమో' చాలెంజ్ ఏంటి? ఆ ఫొటో ఎవరిది?

ఫొటో సోర్స్, UIDI / TWITTER
సన్నటి ముఖం, బయటికి పొడుచుకొచ్చిన పెద్ద పెద్ద కనుగుడ్లతో ఉన్న ఇలాంటి ఫొటో ఒక అపరిచిత నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు వస్తుంది. అది వచ్చినపుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
అపరిచిత నంబర్ నుంచి వచ్చిన ఆ మెసేజ్‌కు సమాధానం ఇవ్వకండి.
నిజానికి ఈ ఫొటో ఇటీవల సోషల్ మీడియా అంతా చర్చ జరుగుతున్న ఒక గేమ్‌కు సంబంధించిన చాలెంజ్ కావచ్చు.
ఈ గేమ్ చాలెంజ్ పేరు-మోమో చాలెంజ్
ఈ మొబైల్ గేమ్ మన మెదడుతో ఆడుకుంటుంది. లోలోపలే భయం పుట్టిస్తుంది. చివరికి ప్రాణాలు తీస్తుంది.
భారత్‌లో ఈ గేమ్ గురించి గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది.
ఈ గేమ్ రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు కూడా కారణమైనట్టు చెబుతున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఇదే ఏడాది జులై 31న ఆత్మహత్య చేసుకుంది, ఆమె ఫోన్ చూసిన తర్వాత, మోమో చాలెంజ్ వల్లే చనిపోయినట్టు తెలిసిందని విద్యార్థిని కుటుంబ సభ్యులు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అయితే, ఇంకా ఇది నిర్ధరణ కాలేదు. కానీ అజ్మీర్ పోలీసులు మాత్రం తమ అధికారిక ట్విటర్ హాండిల్‌లో "ఆ విద్యార్థిని మోమో ఛాలెంజ్ గేమ్ ఆడినట్టు తెలుస్తోంది. దాని ఆధారంగానే మేం దర్యాప్తు చేస్తున్నాం" అని తెలిపారు.
మోమో చాలెంజ్‌కు దూరంగా ఉండాలంటూ ఆగస్టు 19న అజ్మేర్ పోలీసులు ట్విటర్‌లో ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"మోమో చాలెంజ్ పేరుతో వచ్చే ఈ ఇంటర్నెట్ చాలెంజ్ చిన్నారుల మనసులను గందరగోళానికి గురిచేస్తోంది. ఇందులో సమాధానం ఇవ్వమని, వ్యక్తిగత సమాచారం ఇవ్వాలని ఒక అపరిచిత నంబరు నుంచి మెసేజ్ వస్తుంది. అలాంటి చాలెంజ్ స్వీకరించవద్దు" అని అజ్మేర్ పోలీసులు పౌరులను కోరారు.
అంతకు ముందు ఆగస్టు 18న ముంబయి పోలీసులు కూడా #NoNoMoMo #MomoChallenge పేరుతో ట్వీట్ చేశారు.
ఈ చాలెంజ్ స్వీకరించవద్దని ప్రజలకు సలహా ఇచ్చిన ముంబై పోలీసులు, అపరిచిత నంబర్లకు స్పందించవద్దని చెప్పారు. వాటి గురించి 100 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అసలు మోమో చాలెంజ్ ఏంటి?
అందరిలో భయాందోళనలు రేకెత్తిస్తున్న మోమో చాలెంజ్ అంటే ఏంటి?
నిజానికి, మోమో చాలెంజ్ విసిరేవారు మీకు ఒక అపరిచిత నంబరు నుంచి వాట్సాప్ మెసేజ్ పంపిస్తారు. మొదట మీకు చేతి గుర్తుతో హలో చెబుతారు. మెల్లమెల్లగా మీతో పరిచయం పెంచుకుంటారు.
మీరు ఎవరు అని అడిగితే, ఆ అపరిచితుడు తన పేరు మోమో అని చెబుతాడు. తన పేరు చెప్పడంతోపాటు అతడు ఒక ఫొటో కూడా పంపిస్తాడు.
ఫొటోలో భయంకరంగా ఉన్న ఒక అమ్మాయి ముఖం ఉంటుంది. పెద్ద పెద్ద కళ్లుంటాయి, ఆ స్మైల్ భయపెడుతుంది.
నంబర్ సేవ్ చేసుకోమని ఆ మోమో మీకు చెబుతాడు. తర్వాత తనను ఫ్రెండ్ చేసుకోవాలని అడుగుతాడు.
మీరు కుదరదని చెబితే, మీ వ్యక్తిగత సమాచారం అందరికీ చెబుతానని బెదిరిస్తాడు.
తర్వాత అతడు మీకు రకరకాల చాలెంజ్‌లు విసురుతాడు. వాటిలో మిమ్మల్ని ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపించే చాలెంజ్ కూడా ఉండచ్చు.

ఫొటో సోర్స్, TWITTER/@AJMER_POLICE
మోమో చాలెంజ్ ప్రమాదకరమా?
మెక్సికో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ చెప్పిన దాని ప్రకారం అపరిచిత నంబరు నుంచి వచ్చిన మెసేజ్ తర్వాత మోమోతో చాట్ చేసినపుడు మీరు ఐదు రకాల సమస్యల్లో చిక్కుకుపోవచ్చు.
- మీ వ్యక్తిగత సమాచారం బయటపెట్టడం
- ఆత్మహత్య లేదా హింసకు ప్రేరేపించడం
- బెదిరించడం
- రెచ్చగొట్టడం
- శారీరకంగా, మానసికంగా ఒత్తిడి చేయడం
మోమో చాలెంజ్ ఎప్పుడు, ఎక్కడ మొదలైంది?
ఈ గేమ్ అమెరికా, అర్జెంటీనా, ఫ్రాన్స్, జర్మనీ అంతా వ్యాపించింది. ఇప్పుడు భారత్‌లో కూడా అడుగుపెట్టింది.
మోమో చాలెంజ్‌లో కనిపించే ఆ ఫొటోను జపాన్‌కు చెందిందిగా భావిస్తున్నారు.
మెక్సికో కంప్యూటర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ వివరాల ప్రకారం ఇది ఫేస్‌బుక్ నుంచి మొదలైంది. ఈ గేమ్‌లో అపరిచిత నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ రిప్లై మెసేజ్ పంపమని అడుగుతుంది. అయితే ఈ నంబరుతోపాటు ఒక హెచ్చరిక కూడా ఉంటుంది.
అపరిచిత నంబరులో మోమోకు సమాధానం ఇచ్చినవారికి తర్వాత భయపెట్టే, హింసాత్మక మెసేజులు రావడం మొదలవుతుంది. మీ వ్యక్తిగత సమాచారం షేర్ చేయాలనే బెదిరింపులు కూడా ఎదురవుతాయి.

ఫొటో సోర్స్, INSTAGRAM/MOMOSOY
మొమొ చాలెంజ్‌లోని ఫొటో కథేంటి?
ఈ ఫొటో ఒక బర్డ్ విమెన్( పక్షిలా కనిపించే ఒక మహిళ) బొమ్మది. దీన్ని మొట్టమొదట 2016లో ఒక భూతాల ప్రదర్శనలో పెట్టారు. ఈ ఫొటో మొట్టమొదట జపాన్‌కు చెందిన ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కనిపించింది.
గత ఏడాది కూడా ఇలాంటి ఒక గేమ్ చాలెంజ్ కలకలం సృష్టించింది. దాని పేరు బ్లూ వేల్. మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లో ఈ గేమ్ ఆడేవారికి 50 రోజుల్లో 50 రకాల టాస్క్ పూర్తి చేయాలని చెబుతారు. ప్రతి టాస్క్ తర్వాత తమ చేతిపై ఒక గుర్తు వేసుకోవాలని అంటారు. ఈ గేమ్‌లో చివరి టాస్క్ ఆత్మహత్య చేసుకోవడమే.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పిల్లలు బ్లూ వేల్ గేమ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో కూడా అలాంటి కేసులు వెలుగుచూశాయి. తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ పిల్లలను ఈ ఆటకు దూరంగా ఉంచాలని భారత్‌లోని అన్ని స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు లేఖ రాశారు.
ఇవికూడా చదవండి:
- వైరల్: పాకిస్తాన్లో భద్రతపై తీసిన ఈ వీడియో భారత్‌లో హత్యకు కారణమైంది. ఇలా..
- ''మమ్మల్ని సెక్స్ బానిసలుగా అమ్మేశారు, అత్యాచారం చేశారు''
- వైరల్ ఫొటో: ‘స్కూల్ టూర్ కోసం వృద్ధాశ్రమానికి వెళ్తే... అక్కడ నానమ్మ కనిపించింది’
- ‘ఆ మాటలు విన్న తర్వాత పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
- తాజ్‌మహల్: కళ్లు తెరవకుంటే కనుమరుగే
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- కేరళ వరదలు: విదేశీ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు?
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- క్రయానిక్స్: చనిపోయాక బతకొచ్చా? మృత్యువును కూడా మోసం చేయొచ్చా?
- పిల్లలు లావైపోతున్నారా, ఏం చేయాలి?
- మీ పిల్లల కోపాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి?
- స్మార్ట్‌ఫోన్‌తో ఆడుకునే మీ పిల్లలు పెన్సిల్‌ను సరిగ్గా పట్టుకోగలరా?
- సోషల్ మీడియాలో మీ పిల్లల ఫొటోలు షేర్ చేస్తున్నారా?
- మరణంతో మెదడు పోరాడుతుందా? చనిపోయే ముందు ఏం జరుగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








