వాట్సప్: 'ఇక మెసేజీని ఐదుసార్లకు మించి ఫార్వర్డ్ చేయలేరు'

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో వాట్సప్ ద్వారా ఫార్వర్డ్ చేసే మెసేజీల సంఖ్యపై పరిమితి విధిస్తామని వాట్సప్ ప్రకటించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి కావడాన్ని నిరోధించేందుకు ఈ చర్య చేపడుతోంది.
భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో వాట్సప్ గ్రూపుల ద్వారా వ్యాప్తి అయిన కొన్ని బూటకపు మెసేజీల్లోని సమాచారం నిజమైనదేనని నమ్మిన స్థానికులు, వ్యక్తులను కొట్టి చంపుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు కర్ణాటక, త్రిపుర, ఇతర రాష్ట్రాల్లో ఇలా కనీసం 18 మంది చనిపోయారు.
వాట్సప్ ద్వారా వచ్చే బూటకపు సందేశాల కారణంగా మనుషులను కొట్టి చంపే ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ సంస్థ మెసేజీ ఫార్వర్డ్‌కు పరిమితిపై తాజా ప్రకటన చేసింది.
ఇలాంటి సందేశాల వ్యాప్తిని నియంత్రించకుండా మౌన ప్రేక్షకురాలిగా ఉండిపోతే చట్టపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాట్సప్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం మరోసారి హెచ్చరించింది.
వాట్సప్‌ను వాడుకొని యూజర్లు పంపుకొనే సమాచారానికి వాట్సప్ జవాబుదారీ అవుతుందని, ఈ విషయంలో తన బాధ్యత నుంచి వాట్సప్ తప్పించుకోలేదని ప్రభుత్వం ఇంతకుముందు స్పష్టం చేసింది.


ఫార్వర్డ్‌లు భారత్‌లోనే ఎక్కువ
వాట్సప్‌కు అతిపెద్ద మార్కెట్ భారతే. వాట్సప్‌కు దేశంలో 20 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు.
దేశ ప్రజలకు అందుబాటులో ఉన్న అతిపెద్ద ఇంటర్నెట్ ఆధారిత సర్వీసు కూడా వాట్సపే. వాట్సప్ వల్ల చాలా ఎక్కువ మందికి వేగంగా సమాచారం చేరుతోంది.
మెసేజీలు, ఫొటోలు, వీడియోలను భారత్‌లో ఫార్వర్డ్ చేసినంత ఎక్కువ సంఖ్యలో మరే దేశంలోనూ ఫార్వర్డ్ చేయడం లేదని వాట్సప్ తెలిపింది.

ఫొటో సోర్స్, AFP
భారత్‌లోనే ఈ నియంత్రణ ఎక్కువ
ఒక్కో వాట్సప్ గ్రూప్‌లో గరిష్ఠంగా 256 మంది యూజర్లు ఉంటారు. హింసకు దారితీసిన మెసేజీల్లో చాలా మెసేజీలు వంద మంది కంటే ఎక్కువ మంది ఉన్న అనేక గ్రూపులకు ఫార్వర్డ్ అయినట్లు భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మెసేజీల ఫార్వర్డ్‌లను నియంత్రించే విధానాన్ని పరీక్షించి చూసేందుకు ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వాట్సప్ తన వెబ్‌సైట్‌పై ఒక బ్లాగులో తెలిపింది.
భారత్‌లో మాత్రం ఈ నియంత్రణ ఇంకా ఎక్కువగా ఉంటుందని వాట్సప్ తెలిపింది. ఈ పరిమితి ప్రకారం భారత్‌లో యూజర్ ఏదైనా మెసేజీని గరిష్ఠంగా ఐదుసార్లు మాత్రమే ఫార్వర్డ్ చేయడానికి వీలవుతుందని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు. ఇలా అందుకున్న మెసేజీని ఎవరైనా వ్యక్తి గరిష్ఠంగా మరో ఐదుగురికి పంపుకోవడానికి వీలుంటుంది.
తాజా పరిమితితో మెసేజీలు ఫార్వర్డ్ అయ్యే తీరులో వేగం తగ్గుతుందని ఆశిస్తున్నట్లు వాట్సప్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
'ఆ బటన్ తొలగిస్తాం'
ఫొటోలు లేదా వీడియోలతో కూడిన మెసేజీల పక్కన కనిపించే 'క్విక్ ఫార్వర్డ్ బటన్'ను కూడా తొలగిస్తామని వాట్సప్ ప్రకటించింది.
పిల్లలను ఎత్తుకెళ్లేవారు తిరుగుతున్నారనే ప్రచారం వాట్సప్‌లో జరుగుతుండటంతో కొత్తగా, అనుమానాస్పదంగా అనిపించినవారిపై స్థానికులు దాడులకు దిగుతున్నారు. ఇతర వదంతులు కూడా వాట్సప్‌లో వ్యాప్తి చెందుతున్నాయి. ఈ ప్రచారంలో నిజంలేదని, అదంతా బూటకమని ప్రజలకు తెలియజెప్పడం తమకు చాలా కష్టంగా ఉంటోందని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
- మల్టీప్లెక్స్: టికెట్ రూ.150, పాప్‌కార్న్ రూ.270 ఎందుకిలా?
- డీప్ ఫేక్: పోర్న్ స్టార్ల శరీరాలకు సెలెబ్రిటీల ముఖాలు
- BBC Special: బోనాల్లో 'రంగం' చెప్పే మాతంగి స్వర్ణలత ఎవరు?
- పన్నెండేళ్ల లోపు చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణశిక్షే!
- అత్యాచారాల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం చెబుతారు? ఎలా చెబుతారు?
- భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. స్వలింగ సంపర్కురాలైనందుకు కక్ష
- దేశంలో రేప్‌లు ఎందుకు తగ్గట్లేదు?
- రేప్ వార్తల రిపోర్టింగ్‌లో మీడియా 'ఆనందం' దాగి ఉందా?
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- సెక్స్ అడిక్షన్: కోరికలు ఎక్కువగా ఉంటే వ్యాధిగా భావించాలా?
- ‘సెక్స్ గురువు' ఓషో రజనీష్ 'రహస్యాల'పై నోరు విప్పిన బాడీగార్డ్
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- ‘ఫస్ట్‌నైట్’ పరీక్ష: ‘‘తెల్లటి దుప్పటిపై రక్తపు మరక కనిపించాలన్నారు. మేం ఎదిరించాం’’
- #HerChoice: ‘మా ఆయనకు తీరిక లేదు, వేరే మగాళ్లతో చాట్ చేస్తాను!'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









