యుగాండ: ఫేస్‌బుక్, వాట్సప్ వాడితే ట్యాక్స్ కట్టాలి

వాట్సప్

ఫొటో సోర్స్, Getty Images

జీవితంలో ఫేస్‌బుక్, వాట్సప్‌, ట్విటర్ భాగమైపోయాయి. వాటిపై పన్ను విధించింది యుగాండ ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేకంగా చట్టం చేసింది.

అసలు సోషల్ మీడియా యాప్స్ వినియోగంపై యుగాండ ఎందుకు పన్ను విధించాల్సి వచ్చింది.?

యువత గంటల తరబడి సోషల్ మీడియాలో తమ సమయాన్ని వృధా చేస్తోందని యుగాండ అధ్యక్షుడు అన్నారు.

అంతేకాదు, సోషల్ మీడియా వల్ల వదంతులు, పుకార్లు వ్యాపిస్తాయని, ఉత్పాదకత తగ్గుతుందని ఆయన అభిప్రాయం.

వీడియో క్యాప్షన్, అక్కడ ఫేస్‌బుక్, వాట్సప్ వాడాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే

అందుకే ఆయన పట్టుబట్టి ఫేస్‌బుక్, వాట్సప్‌ వాడకంపై పన్ను విధిస్తూ చట్టం చేయించారు. ఇది ఈ నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చింది.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

యుగాండ పేద దేశం. ప్రతి ఐదుగురిలో ఒకరు దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)