ట్రంప్: 'అణు నిరాయుధీకరణతోనే ఆంక్షల ఎత్తివేత’
సింగపూర్‌లో మంగళవారం శిఖరాగ్ర సదస్సు అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్-ఉన్ ఒక తీర్మానంపై సంతకాలు చేశారు.
తీర్మానంలోని ముఖ్యాంశాలు...
- శాంతి, సౌభాగ్యాల సాధనలో అమెరికా, ఉత్తర కొరియా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉభయ దేశాల మధ్య కొత్త సంబంధాలను నెలకొల్పేందుకు ఉభయ దేశాలు కట్టుబడి ఉంటాయి.
- కొరియా ద్వీపకల్పంలో సుస్థిర శాంతి స్థాపనకు అమెరికా, ఉత్తర కొరియా కలిసి పనిచేస్తాయి.
- 2018 ఏప్రిల్ 27 నాటి పన్ముంజోమ్ తీర్మానానికి అనుగుణంగా కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా కృషి చేస్తుంది.
- యుద్ధ ఖైదీలు, యుద్ధ చర్యల్లో అదృశ్యమైన వారి అస్థికలను పరస్పరం తిరిగి అప్పగించటానికి అమెరికా, ఉత్తర కొరియాలు కట్టుబడి ఉంటాయి. ఇప్పటికే గుర్తించిన వాటిని తక్షణమే అప్పగిస్తారు.

ఫొటో సోర్స్, Twitter/Conor Finnegan
15:54
సెంటోజా దీవి నుంచి బయలుదేరిన ట్రంప్
ఆయన పాయా లెబార్ సైనిక వైమానిక స్థావరానికి వెళుతున్నట్లు చానెల్ న్యూస్ ఏసియా కథనం తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
15:48
ట్రంప్ - కిమ్ డిక్లరేషన్‌ను ప్రచురించిన అమెరికా
ఆ డిక్లరేషన్ అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
15:45
మధ్యవర్తి లేరన్న చైనా వెబ్ యూజర్ల వ్యాఖ్యలు సెన్సార్
కెర్రీ అలన్, బీబీసీ మానిటరింగ్, చైనీస్ మీడియా అనలిస్ట్
ఉత్తర కొరియాతో సన్నిహిత సంబంధాలున్న చైనాలో.. ఈ శిఖరాగ్ర సదస్సు సీనా వీబో మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
అయితే.. ఈ శిఖరాగ్ర సమావేశం సజావుగా సాగటానికి మధ్యవర్తి ఎవరూ లేకపోవటం గురించి ప్రస్తావించిన చాలా పోస్టులను సెన్సార్ చేశారు.
ఆ సమావేశం ‘ముఖా ముఖి’ సమావేశమని చెప్తున్న చాలా పోస్టులను సీనా వీబో నుంచి తొలగించినట్లు.. సెన్సార్‌షిప్‌ను పరిశీలించే వెబ్‌సైట్ ‘ఫ్రీ వీబో’ గుర్తించింది. ‘‘మార్పు తేవటానికి మధ్యవర్తి అవసరం లేదు’’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు.
ఈ శిఖరాగ్ర సదస్సుకు ముందు.. శాంతి మార్గంలో ఉత్తర కొరియాకు సాయం అందించటానికి తనకు పాత్ర ఉండాలని చైనా పట్టుబడుతూ వచ్చింది. కిమ్ సింగపూర్ వెళ్లటానికి ఎయిర్ చైనా విమానాన్ని తీసుకెళ్లిన విషయాన్ని పలు కథనాల్లో ప్రముఖంగా ప్రస్తావించారు.
15:36
ట్రంప్ - కిమ్ శిఖరాగ్రంపై మూన్ ప్రశంసలు
‘‘చరిత్రాత్మక ఉత్తర కొరియా - అమెరికా శిఖరాగ్ర సదస్సు విజయవంతం అవటాన్ని నేను స్వాగతిస్తున్నా, శుభాకాంక్షలు చెప్తున్నా’’ అని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ట్రంప్, కిమ్‌లు ‘‘మార్పు దిశగా సాహసోపేత అడుగు వేశారు’’ అంటూ ఇద్దరిపైనా ఆయన ప్రశంసలు కురిపించారు.
‘‘ట్రంప్, కిమ్‌ల ధైర్యానికి, సాహసోపేత నిర్ణయాలకు నా అత్యున్నత ప్రశంసలు’’ అని చెప్పారు.
‘‘మరెవరూ సాధించని విజయాన్ని ట్రంప్ సాధించారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ప్రపంచం దిశగా తొలి సాహసోపేత అడుగు వేయటం ద్వారా కిమ్ చరిత్ర సృష్టించారు’’ అని మూన్ కీర్తించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
15:31
‘కిమ్ పాలన శాశ్వతం’
బీబీసీ మానిటరింగ్ నుంచి:
ఉత్తర కొరియా నుంచి ఫిరాయించి సోల్‌లో పనిచేస్తున్న కొన్ని బృందాలు.. మానవ హక్కుల అంశాన్ని ఈ శిఖరాగ్ర సమావేశంలో చేర్చకపోవటం మీద అసంతృప్తిగా ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘‘ఉత్తర కొరియా నిరంకుశత్వాన్ని అధికారికంగా ఆమోదించారు’’ అని నార్త్ కొరియన్ డిఫెక్టర్ రెఫ్యుజీస్ రైట్స్ గ్రూప్ నేత కిమ్ యాంగ్-హ్వా వ్యాఖ్యానించినట్లు దక్షిణ కొరియా ప్రైవేట్ వార్తా సంస్థ న్యూస్1 కథనం పేర్కొంది.
అమెరికాలో ట్రంప్, దక్షిణ కొరియాలో మూన్ జే-ఇన్‌ల అధ్యక్ష పదవీ కాలం కొన్నేళ్లలో ముగిసిపోతుందని.. కానీ ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ పాలన ‘‘శాశ్వతం’’ అని ఆయన చెప్పారు. కిమ్ ‘‘తన నిరంకుశత్వాన్ని కొనసాగించటానికి’’ మరింత సమయం కొన్నారని ఆ గ్రూప్ న్యూస్1తో పేర్కొంది.
15:22
కిమ్ లావుగా ఉన్నాడని ట్రంప్ గేలిచేశారా?
విందు సందర్భంగా కెమెరా ఆపరేటర్లతో ట్రంప్ మాట్లాడుతూ.. తమను ‘’చక్కగా అందంగా సన్నగా’’ ఉన్నట్లు చూపుతున్నారా లేదా అని అడిగిన వీడియో దృశ్యం బయటకు వచ్చింది. అందులో కిమ్ ప్రతిస్పందన కూడా కనిపించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
14:54
ముగిసిన ట్రంప్ విలేకరుల సమావేశం
కిమ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గురించి మాట్లాడుతూ.. ‘‘అందరికీ శుభాకాంక్షలు. నాకు ఇది ప్రపంచ చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు. దీనిని పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నా’’ అని ట్రంప్ చెప్పారు.
‘‘బాల్‌ని గోల్ లైనులోకి తీసుకెళ్లకపోతే.. అది సరిపోదని అర్థం’’ అని వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
14:51
ట్రంప్‌కి ‘గొప్ప జ్ఞాపకశక్తి ఉంది’
కిమ్‌తో సంభాషణలను రికార్డు చేశారా అని ప్రశ్నించగా.. కొంత నోట్స్ ఉండిఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అయితే రికార్డు చేశారా లేదా అనేది తెలీదన్నారు.
‘‘అయినా ఫర్వాలేదు. ఎందుకంటే నాకు చాలా గొప్ప జ్ఞాపకశక్తి ఉంది’’ అని చెప్పారు.
14:50
దక్షిణ కొరియా ‘చాలా సంతోషిస్తుంది’
దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌కి ఏం చెప్తారని ఆ దేశానికి చెందిన ఒక విలేకరి ప్రశ్నించారు.
మూన్ ‘‘చాలా మంచి పెద్ద మనిషి’’ అని ట్రంప్ అభివర్ణించారు. ‘‘ఆయన ఇది విన్నప్పుడు చాలా సంతోషిస్తారు... ఏం జరిగిందో ఇప్పటికే నేను ఆయనకు సమాచారం పంపించాను’’ అని చెప్పారు.
కిమ్, తాను సంతకం చేసిన పత్రాన్ని ఆయనకు పంపించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో చైనా, దక్షిణ కొరియాలు రెండూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నానన్నారు.
14:49
కిమ్ తన హామీకి కట్టుబడకపోతే?
కిమ్ తన హామీలను అమలు చేయకపోతే ఏం చేస్తారని ట్రంప్‌ని ఒక పాత్రికేయుడు ప్రశ్నించారు.
‘‘లేదు. ఆయన నెరవేరుస్తారని నేను అనుకుంటున్నా. నిజంగా నమ్ముతున్నా... ఆయన ఈ పనులు చేస్తారని నిజాయితీగా భావిస్తున్నా. నేను పొరపడవచ్చు. ఆరు నెలల తర్వాత మీ ముందు నిలబడి ‘నేను పొరపడ్డాను’ అని చెప్పాల్సి రావొచ్చేమో’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
‘‘అది నేను ఒప్పుకుంటానో లేదో నాకు తెలీదు. కానీ అందుకు నేను ఏదో సాకు వెదుకుతాను’’ అని ఆయన జోక్ చేయటంతో విలేకరులు నవ్వారు.
14:44
ఉత్తర కొరియాలో ‘గొప్ప బీచ్’లు ఉన్నాయి
ఉత్తర కొరియా ఆర్థిక సామర్థ్యం గురించి ట్రంప్ మాట్లాడుతున్నారు. ‘‘ఉత్తర కొరియా సైనిక విన్యాసాల దృశ్యాల్లో వెనుకవైపు ‘‘గొప్ప బీచ్’’లు ఉండటం తాను చూశానని చెప్పారు.
‘‘ప్రపంచంలో అత్యుత్తమ హోటళ్లు నిర్మించవచ్చునని నేను వారికి వివరించాను’’ అని ట్రంప్ తెలిపారు.
‘‘రియల్ ఎస్టేట్ దృష్టితో దాని గురించి ఆలోచించండి’’ అన్నారు.
14:41
ఉత్తర కొరియా టీవీలో కార్టూన్లు

ఫొటో సోర్స్, N Korea TV
బీబీసీ మానిటరింగ్ నుంచి:
ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కిమ్ జోంగ్-ఉన్‌తో తన భేటీ వివరాలను వెల్లడిస్తూ ఉంటే.. ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీలో కార్టూన్ షో ప్రసారం చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై పిల్లలకు అవగాహన కలిగించే కార్టూన్ షో అది.
సింగపూర్‌లో మంగళవారం జరిగిన శిఖరాగ్ర సదస్సు దృశ్యాలు ఏవీ ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీ ఇంతవరకూ చూపలేదు.
14:35
ఉత్తర కొరియా ఖైదీలు ‘నేటి గొప్ప విజేతలు’
‘ఉత్తర కొరియాలో రాజకీయ ఖైదీలను మీరు దగా చేశారా?’ అని ఒక విలేకరి ప్రశ్నించారు.
ట్రంప్ బదులిస్తూ.. ‘లేదు. నేను వారికి సాయం చేసినట్లు భావిస్తున్నా. నేటి గొప్ప విజేతల్లో వారూ ఒకరని అనుకుంటున్నా’’ అని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
14:34
ట్రంప్: దక్షిణ కొరియా, జపాన్‌లు ఉత్తర కొరియాకు సాయం చేయొచ్చు
అణ్వస్త్ర నిరాయుధీకరణ వ్యయాన్ని ఉత్తర కొరియా ఎలా భర్తీ చేసుకుంటుందని ఒక విలేకరి ప్రశ్నించారు.
వారికి ‘‘చాలా గొప్పగా’’ సాయం చేయటానికి దక్షిణ కొరియా, జపాన్‌లు సిద్ధంగా ఉంటాయని తాను భావిస్తున్నట్లు ట్రంప్ బదులిచ్చారు.
అలాగే ఆంక్షలు తొలగించే ముందు మానవ హక్కుల పరిస్థితి కూడా ‘‘గణనీయంగా మెరుగుపడాల’’ని తాను కోరుతున్నట్లు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
14:32
ట్రంప్: ‘దేనికీ ఖచ్చితమైన హామీ ఉండదు’
‘‘ఉత్తర కొరియా వట్టి మాటలు చెప్పటం కాకుండా పని చేసేలా ఖచ్చితంగా ఎలా చూస్తారు?’’ అని ఒక విలేకరి ప్రశ్నించారు.
‘‘మీరు దేనికైనా ఖచ్చితంగా హామీ ఇవ్వగలరా? ఏదీ ఖచ్చితమని భరోసా ఇవ్వలేం’’ అని ట్రంప్ బదులిచ్చారు.
‘‘ఆయన (కిమ్) ఒక ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు నేను భావిస్తున్నా’’ అని చెప్పారు. ఒప్పందం చేసుకోవాలన్న కిమ్ ఉద్దేశం చాలా ముఖ్యమైన విషయమని వ్యాఖ్యానించారు.
14:23
‘నేను బెదిరిస్తున్నట్లు ఉండాలనుకోలేదు’
కిమ్‌తో చర్చల్లో తాను ఉత్తర కొరియాను ‘‘బెదిరిస్తున్నట్లు’’ ఉండాలని భావించలేదని ట్రంప్ చెప్పారు.
ఉత్తర కొరియాతో ఎలాంటి సంఘర్షణ అయినా.. దక్షిణ కొరియాలో లక్షలాది మంది ప్రాణనష్టానికి దారితీస్తుందని.. ఆ దేశ రాజధాని సోల్ ఉత్తర కొరియా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉండటం అందుకు కారణమని ఆయన పేర్కొన్నారు.
గతంలో ఉత్తర కొరియాను ‘‘ఆగ్రహజ్వాలలతో’’ ఎందుకు హెచ్చరించారని ప్రశ్నించగా.. ఆ సమయంలో అది సరైన భాష అని ట్రంప్ బదులిచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
14:22
అమెరికా మిత్ర దేశాల సంగతి ఏమిటి?
జీ7 శిఖరాగ్ర సదస్సులో వివాదం వల్ల తన దీర్ఘకాల మిత్రదేశాలతో అమెరికా సంబంధాలు దెబ్బతింటాయా? అని ఒక విలేకరి ట్రంప్‌ను ప్రశ్నించారు.
జీ7 దేశాలతో సమావేశం ‘‘చాలా బాగా జరిగింద’’ని కానీ అమెరికా ‘‘అన్యాయంగా వాడుకుంటున్నార’’ని ఆయన చెప్పారు.
14:19
ట్రంప్: వివరంగా చర్చించేందుకు ఈరోజు సమయం లేదు
ఉత్తర కొరియా మరిన్ని హామీలు ఇచ్చేలా ఎందుకు చేయలేకపోయారు అని అడిగిన ప్రశ్నకు ట్రంప్, "ఈరోజు అన్ని వివరాలు చర్చించేందుకు సమయం లేదు" అని జవాబిచ్చారు.
అంతకు ముందు ఆయన ఇలా అన్నారు: "కలవడం పెద్ద విషయమేమీ కాదు - చాలా అంశాలపై కలిసి చర్చించుకోవాలని నా అభిప్రాయం."
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
14:13
ట్రంప్: 'మేం దేన్నీ వదులుకోలేదు'
"కిమ్ జోంగ్-ఉన్‌తో భేటీకి అంగీకరించడం తప్ప మరి దేన్నీ వదులుకోలేదు" అని ట్రంప్ అన్నారు.
"మేం పెద్ద ఒప్పందానికి సిద్ధమయ్యాం అని ట్రంప్ అంటే గిట్టని వారు మాత్రమే అనగలరు," అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, అమెరికా అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశం జరిపి చర్చలు చేయడమనేది ఉత్తర కొరియాకు ప్రచారపరంగా పెద్ద విజయం అని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
14:09
ట్రంప్: ప్రస్తుతం ఆంక్షలు కొనసాగుతాయి.
అణ్వాయుధాలకు స్వస్తి చెప్పిన తర్వాతే ఆంక్షలను ఎత్తివేస్తామని ట్రంప్ చెప్పారు.
"వాటిని ఎత్తివేయాలనేదే నా అభిమతం" అని ట్రంప్ అన్నారు. "అయితే అది అణు నిరాయుధీకరణ జరిగినట్టు నాకు విశ్వాసం కలిగిన తర్వాతే."
14:01
ట్రంప్: మానవ హక్కులపై చర్చించాం
కిమ్‌తో జరిగిన సమావేశంలో మానవ హక్కుల గురించి చర్చించారా అని అడగగా, దీనిపై సాపేక్షికంగా, చాలా తక్కువ సేపు చర్చించామన్నారు.
అణు నిరాయుధీకరణకు కాలవ్యవధి ఏమైనా నిర్ణయించారా అని అడగగా, శాస్త్ర ప్రకారమే దీనికి సమయం పడుతుందన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 11
13.52
కిమ్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన ట్రంప్
నిజమైన మార్పు సాధ్యమే అని ట్రంప్ అన్నారు.
"చైర్మన్ కిమ్‌తో నా సమావేశం నిజాయితీగా జరిగింది. ఇది ఫలితాలిస్తుంది.," అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
కిమ్ "చాలా ప్రతిభ గలవాడు" అని ఒక ప్రశ్నకు జవాబుగా ట్రంప్ అన్నారు. చిన్న వయసులోనే అధికారంలోకి వచ్చి "కఠిన పరిస్థితుల్లో దేశాన్ని నడిపిస్తున్నారని" అన్నారు.
ఇదో సమగ్ర తీర్మానం: ట్రంప్
ఇది ఒక సమగ్రమైన, ముఖ్యమైన తీర్మానమని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై సంతకాలు చేయడం తనకు, కిమ్‌కు ఇద్దరికీ దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ట్రంప్ దీనిని 'డాక్యుమెంట్' అని వ్యవహరించారు.
కిమ్‌ను ఎంతో ప్రజ్ఞాశాలి (వెరీ టాలెంటెడ్ మ్యాన్) అని ట్రంప్ ప్రశంసించారు. ఉత్తర కొరియాను కిమ్ ఎంతగానో ప్రేమిస్తారని చెప్పారు. కిమ్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానిస్తానని ట్రంప్ తెలిపారు.
13:39
ఇది ట్రంప్ వీడియో..
సమావేశం జరిగిన తీరు పట్ల డొనాల్డ్ ట్రంప్ ఆనందంగా ఉన్నారు. అందుకు.. తాను ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియోనే నిదర్శనం. అందులో.. కిమ్ జాంగ్ ఉన్‌తో తొలిసారి కరచాలనం చేయడం, ఆయనతోపాటు సింగపూర్ తీర్మానంపై ఇద్దరూ సంతకాలు చేయడం చూడొచ్చు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 12
12:52
ఇది ఆరంభం మాత్రమే!
కిమ్ - ట్రంపై సమావేశంపై చైనా అధికారిక వార్తా సంస్థ కథనం వెలువరించింది.
‘‘ఈ సమావేశం.. కొరియా ద్వీపకల్పంలో అణ్వాయుధాల సమస్యకు రాజకీయ పరిష్కారంపై ఆశలు రేపాయి. ఇరు దేశాల మధ్య ఎంతోకాలంగా నెలకొన్న విభేదాలను ఒకే ఒక్క సమావేశం తుడిచివేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. న్యూక్లియర్ రహిత ‘కొరియా ద్వీపకల్పం’ సాధించే దిశగా చేసిన ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తాయి. అందుకు ఎంతో ఓర్పు, సహనం కావాల్సి వచ్చింది’’ అని పేర్కొంది.
ఉదయం 11:26
గతాన్ని పక్కనబెట్టి సాగుతాం: కిమ్
ఈ భేటీని చరిత్రాత్మక సమావేశంగా కిమ్ అభివర్ణించారు. గతాన్ని పక్కనపెట్టి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. ''ప్రపంచం గొప్ప మార్పులు చూడబోతోంది'' అని వ్యాఖ్యానించారు.
ఈ సమావేశం సాకారమయ్యేలా చూసినందుకు ట్రంప్‌కు కిమ్ ధన్యవాదాలు తెలిపారు.
తమ చర్చల్లో ఒకరి గురించి మరొకరం, ఒకరి దేశం గురించి మరొకరం తెలుసుకున్నామని ట్రంప్ చెప్పారు. కిమ్‌తో తనకు ప్రత్యేక బంధం ఏర్పడిందని ఆయన తెలిపారు.

భేటీని ప్రశంసించిన చైనా
ట్రంప్-కిమ్ భేటీని చరిత్రాత్మకమైనదంటూ చైనా ప్రశంసించింది.
''ఇద్దరు నాయకులూ ఒక చోట సమావేశమై, ఇద్దరూ సమాన స్థాయిలో చర్చలు జరపడం ముఖ్యమైన విషయం. ఇందులో సానుకూల అర్థం ఉంది. ఈ భేటీ కొత్త చరిత్రను సృష్టించింది'' అంటూ చైనా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి వాంగ్ యి వ్యాఖ్యానించారు.
కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతల నివారణకు సంపూర్ణ అణు నిరాయుధీకరణ జరగాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు.
ఒప్పందానికి ముందు నేడు జరిగిన పరిణామాలు
ట్రంప్, కిమ్ భారత కాలమానం ప్రకారం నేడు (మంగళవారం) సింగపూర్‌లో తొలిసారిగా సమావేశమయ్యారు. ఒక అమెరికా అధ్యక్షుడు ఒక ఉత్తర కొరియా పాలకుడితో సమావేశమవడం చరిత్రలో ఇదే ప్రథమం.
మొదట ట్రంప్-కిమ్ ప్రైవేటుగా సమావేశమయ్యారు. ఆ తర్వాత వారి నేతృత్వంలో రెండు దేశాల బృందాలు విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నాయి. కిమ్‌తో భేటీ ఎవరూ ఊహించనంత బాగా జరిగిందని ట్రంప్ ఒక సంక్షిప్త ప్రకటనలో చెప్పారు. కాసేపట్లో సంతకాల కార్యక్రమం జరుగనుంది.
10:45
భారత కాలమానం ప్రకారం ఉత్తర కొరియాలో ప్రభుత్వ టీవీ ప్రసారాలు సాధారణంగా 11:30 గంటలకు మొదలవుతాయి. మరోవైపు దక్షిణ కొరియాలో ప్రముఖ మీడియా సంస్థ కేబీఎస్1 సింగపూర్ సదస్సు విశేషాలను ప్రసారం చేస్తోంది.
ఉత్తర కొరియాలో ప్రభుత్వ టీవీలో ప్రస్తుతం ఈ కింది దృశ్యం కనిపిస్తోంది.

10:21
కిమ్‌తో భేటీ ఎవరూ ఊహించనంత బాగా జరిగిందని ట్రంప్ ఒక సంక్షిప్త ప్రకటనలో చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
10:09
కిమ్, ట్రంప్ విందు ముగించుకుని వచ్చి, గార్డెన్‌లో నడుస్తున్నారు.మాొొాి
9:58
చర్చల తర్వాత ట్రంప్, కిమ్ విందులో పాల్గొన్నారు.
9:45
ఈ సదస్సు విజయవంతమైందని ఉభయ దేశాలూ ఇప్పటికే ప్రకటించాయని బీబీసీ ప్రతినిధి రూపర్ట్ వింగ్‌ఫీల్డ్ హాయెస్ చెప్పారు.
8:50
ట్రంప్-కిమ్ సమావేశం 38 నిమిషాలపాటు సాగిందని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ తెలిపింది. ఇందులో అనువాదాల సమయం కూడా ఉంటుంది. దీనిని పరిగణనలోకి తీసుకొని చూస్తే 38 నిమిషాల సమయం స్వల్ప వ్యవధే.
8:28
ఉత్తర కొరియాలో ప్రజలకు వార్తలు ఎవరు చేరవేస్తున్నారు?
ట్రంప్-కిమ్ భేటీ గురించి ఉత్తర కొరియా ప్రజలకు ప్రభుత్వ మీడియా ద్వారా వార్తలు అందుతున్నాయి. అయితే వారికి అంతర్జాతీయ మీడియా అందుబాటులో ఉండదు. అన్ని వార్తలు ప్రభుత్వ మీడియా ద్వారానే వెళ్తాయి. దేశంలో ఎవరైనా అంతర్జాతీయ మీడియాలో వార్తలు చదివినా, విన్నా, చూసినా జైలు పాలు కాక తప్పదు.
8:13
ట్రంప్-కిమ్ భేటీపై వ్యతిరేక స్వరాలూ వినిపిస్తున్నాయి.
'అది దేశం కాదు.. జైలు'
‘‘ఉత్తర కొరియా గురించి ఎవరూ మరవకూడదు. అది రెండున్నర కోట్ల మంది ప్రజలను బంధించిన జైలు. ప్రపంచంలో మానవ హక్కులను కాలరాసిన రాజ్యం ఉత్తర కొరియా. మళ్లీ చెబుతున్నా.. గుర్తుంచుకోండి’’ అని ‘వాషింగ్టన్ పోస్ట్’ టోక్యో బ్యూరో ఛీఫ్ అన్నా ఫిఫీల్డ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 13
8:09
‘‘జీ - 7 సదస్సులో జర్మనీ ప్రధాని ఏంజెలా మెర్కెల్‌తో కరచాలనం చేయని, కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడోను బలహీనుడు అని కామెంట్ చేసిన ట్రంప్.. తన వ్యతిరేకులను, కుటుంబ సభ్యులను చంపే క్రూరమైన నియంతను కలిశారు’’ అని విక్టోరియా బ్రౌన్‌వర్త్ అనే మహిళ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Twitter/screen grab
8:08
నవశకం మొదలవ్వాలి: మూన్
ఈ సదస్సుతో నవ శకం మొదలవుతుందని, ఉత్తర కొరియాలో అణ్వస్త్ర నిర్మూలన, శాంతి స్థాపన సాధ్యమవుతాయని, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, అమెరికా మధ్య కొత్త బంధం ఏర్పడుతుందని ఆశిస్తున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ తెలిపారు.
ఈ సదస్సుకు ముందు రోజు రాత్రి తనకు నిద్ర పట్టలేదని మూన్ చెప్పారు.
7:50
ఆర్చిడ్.. దౌత్యం

ఫొటో సోర్స్, Getty Images
ఆర్చిడ్ జాతి పూలమొక్కలు సింగపూర్ జాతీయ పువ్వు. సింగపూర్‌లో పర్యటించినవారిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ల గౌరవార్థం, వారి పేర్లను ఆర్చిడ్ పూలమొక్కలకు పెట్టారు.
ఇప్పుడు అమెరికా, ఉత్తర కొరియా దేశాధినేతలు ఇద్దరూ సింగపూర్‌లో సమావేశమయ్యారు. మరి వీరిలో ఎవరి పేరును ఆర్చిడ్ పూలమొక్కకు పెడతారో!
7:45
కిమ్ బృందంలోని కొందరు ముఖ్యుల వివరాలు...

ఫొటో సోర్స్, Reuters
కిమ్ యాంగ్-చోల్: ఈయన్ను కిమ్ కుడిభుజమని చెబుతారు. ట్రంప్-కిమ్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో, ఇతరులతో చర్చల నిమిత్తం ఆయన ఇటీవల అమెరికా వెళ్లి వచ్చారు.
రి యాంగ్-హో: ఈయన ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి. 1990ల నుంచి ఆయన దౌత్య వ్యవహారాల్లో చురుగ్గా ఉన్నారు. అప్పట్లో ఆయన అమెరికాతో ఉత్తర కొరియా చర్చల్లో పాల్గొన్నారు.
రి సు-యాంగ్: యాంగ్-హోకు ముందు ఈయన విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఉత్తర కొరియా పాలనా యంత్రాంగంలో అత్యంత ఉన్నతస్థాయి అధికారుల్లో ఈయన ఒకరు.
7:25
ప్రైవేటు చర్చలు ముగిసిన తర్వాత ట్రంప్, కిమ్.. తమ బృందాలతో కలిపి జరిపే చర్చల నిమిత్తం సమావేశ టేబుల్ వద్దకు చేరుకున్నారు.
7:07
కిమ్, ట్రంప్ పక్కపక్కన నడుచుకుంటూ, ప్రైవేటుగా చర్చలు జరపాల్సిన ప్రదేశానికి వెళ్లారు.

ఫొటో సోర్స్, AFP
7:00
దక్షిణ కొరియాలో దేశాధ్యక్షుడు మూన్ జే-ఇన్.. అమెరికా, ఉత్తర కొరియా నాయకులు కరచాలనాన్ని టీవీలో వీక్షించారు.
6:58
ప్రపంచమంతా చూస్తోంది కానీ...
ఈ కీలక సమావేశానికి సంబంధించి వివిధ దేశాల్లో టీవీ ప్రసారాలను బీబీసీ మానిటరింగ్ గమనించింది. ట్రంప్-కిమ్ కరచాలన సమయంలో ఏకకాలంలో దక్షిణ కొరియా, చైనా, జపాన్, ఉత్తర కొరియాలోని టీవీల్లో కనిపించిన దృశ్యాలు ఇవీ. ఉత్తర కొరియా టీవీల్లో ఈ దృశ్యం ప్రసారం కాలేదు.

ఫొటో సోర్స్, Twitter
6:54
ట్రంప్, కిమ్ తొలిసారిగా కలుసుకొన్న సందర్భంగా వారిద్దరూ కాసేపు మీడియాతో మాట్లాడారు.
ట్రంప్: ''చర్చలు గొప్పగా జరపబోతున్నాం. ఇవి ఎంతగానో విజయవంతమవుతాయి. ఈ చర్చల్లో పాల్గొనడం నాకు లభించిన గౌరవం. మా ఇద్దరి మధ్య సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. ఇందులో సందేహమే లేదు.''
కిమ్: ''ఇరు దేశాల సంబంధాలు ఈ స్థాయికి చేరుకోవడం తేలికైన విషయం కాదు. గత చరిత్ర, కొన్ని అపోహలు, పద్ధతులు చర్చల దిశగా సాగే మార్గంలో అడ్డంకిగా నిలిచాయి. మేం అన్నింటినీ అధిగమించి నేడు ఈ దశకు చేరుకున్నాం.''
6:39
వారిద్దరు ఏమన్నారు?

ఫొటో సోర్స్, Twitter
కరచాలనం తర్వాత ట్రంప్, కిమ్ పక్క పక్క సీట్లలో కూర్చున్నారు.
కిమ్‌తో తన సంబంధాలు అద్భుతంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
ఇరు దేశాల సంబంధాలు ఈ స్థాయికి చేరడం తేలికైన విషయం కాదని కిమ్ వ్యాఖ్యానించారు.
ఉదయం 6:35

ఫొటో సోర్స్, AFP
కొన్ని నెలల కిందటి వరకూ ఊహించని చరిత్రాత్మక పరిణామం ఇది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ కలుసుకొన్నారు. ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. ఈ సమావేశం అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపనుంది?
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 14
అమెరికా, ఉత్తర కొరియా నాయకులు కరచాలనం చేసిన సమయంలో.. సింగపూర్‌లోని కొరియన్ కమ్యూనిటీ సెంటర్లోని ప్రజలు కరతాళధ్వనులు చేశారు. ఇరు నేతల సమావేశాన్ని అక్కడున్న కొరియన్ ప్రజలు ఆహ్వానించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న బీబీసీ ప్రతినిధి లారా బికర్.. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఉదయం 06:35
దక్షిణ కొరియా: టీవీలకు అతుక్కుపోయిన జనం

ఫొటో సోర్స్, EPA
ఈ సదస్సుపై అమెరికా, ఉత్తర కొరియాల్లో ప్రజలకు ఎంత ఆసక్తి ఉందో, దక్షిణ కొరియాలో ప్రజలకు కూడా అంతే ఆసక్తి ఉందని చెప్పొచ్చు.
ట్రంప్, కిమ్ సమావేశం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు దక్షిణ కొరియాలో చాలా మంది ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉదయం 6.30
వేదిక వద్దకు చేరుకున్న ట్రంప్, కిమ్

ఫొటో సోర్స్, twitter
ట్రంప్, కిమ్ సమావేశ వేదిక వద్దకు చేరుకున్నారు. తొలుత వారిద్దరూ కొంత సేపు సమావేశమవుతారు. అప్పుడు వారితోపాటు ఇద్దరు అనువాదకులు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు నాయకులు బృందాలు భేటీలో పాలుపంచుకుంటాయి.

ట్రంప్-కిమ్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో అమెరికా-ఉత్తరకొరియా-దక్షిణకొరియాలకు సంబంధించిన వివిధ కథనాలు ఒకే చోట..

ట్రంప్-కిమ్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో కింది యానిమేషన్ ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చక్కర్లు కొడుతోంది.

ఫొటో సోర్స్, Twitter/Gavin Koppel
మంగళవారం ఉదయం 6:13
ప్రముఖ పర్యాటక ద్వీపం సెంటోసాలోని కాపెల్లా హోటల్‌లో జరిగే ఈ చరిత్రాత్మక భేటీకి దాదాపు అంతా సిద్ధమైంది. కొద్దిసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది.
ఉత్తర కొరియాలో అణు నిరాయుధీకరణ, ప్రతిపాదిత శాంతి ఒప్పందం అంశాలపై ట్రంప్, కిమ్ చర్చించే అవకాశం ఉంది.
ఉత్తర కొరియా అణ్వాయుధాలు, క్షిపణులను పూర్తిగా విడనాడాలని అమెరికా కోరుతోంది. 1952లో ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, ఇంతవరకు శాంతి ఒప్పందం కుదరలేదు. ఈ శాంతి ఒప్పందంపై కూడా అమెరికా, ఉత్తరకొరియా నేతలు చర్చించే అవకాశం ఉంది.
ఈ సదస్సు నేపథ్యంలో, భద్రతా సిబ్బందిని పెద్దయెత్తున మోహరించారు. ఎక్కడ చూసినా పోలీసులు కనిపిస్తున్నారు. ఈ సదస్సు కవరేజీ కోసం ప్రపంచం నలుమూలల నుంచి సుమారు మూడు వేల మంది మీడియా ప్రతినిధులు సింగపూర్‌కు వచ్చారు.
(గమనిక: ఇది లైవ్ పేజీ. అప్‌డేట్ అవుతోంది.)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)