సీఐఏ డైరెక్టర్ : ట్రంప్‌కి ఆ ప్రమాదాలు తెలుసు.. అందుకే కిమ్‌తో భేటీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాదాలను అర్థం చేసుకున్నారని.. అందుకే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో భేటీ అవుతున్నారని సీఐఏ డైరెక్టర్ మైక్ పోంపియో పేర్కొన్నారు.
కిమ్‌తో భేటీ కావాలన్న ట్రంప్ నిర్ణయాన్నిఆయన సమర్థించారు.
‘ట్రంప్ నాటకాలు ఆడటం లేదు. సమస్యను పరిష్కరించేందుకు ఆయన అక్కడకు (ఉ.కొరియా) వెళ్తున్నారు’ అని ఆయన ఆదివారం ఫాక్స్ న్యూస్‌కు చెప్పారు.
మరోవైపు కిమ్‌తో భేటీ ప్రపంచంలోఅత్యంత గొప్ప పరిణామమవుతుందని ట్రంప్ చెబుతున్నారు.
కానీ విమర్శకులు మాత్రం ఈ భేటీ విఫలమైతే ఇరు దేశాలు గతంలోకన్నా మరింత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తాయని హెచ్చరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా అధ్యక్షుడు ఇప్పటి వరకు ఉత్తర కొరియా అధ్యక్షుడిని కలిసిన దాఖలాలు లేవు. కాగా ట్రంప్ మాత్రం కిమ్‌తో భేటీ కానున్నట్లు వెల్లడించారు.
వింటర్ ఒలెంపిక్స్‌తో దౌత్యానికి శ్రీకారం
ఈ చర్చలకు దక్షిణ కొరియాలో జరిగిన వింటర్ ఒలెంపిక్స్‌లో బీజం పడింది. అనంతరం దక్షిణ కొరియా ఈ వారంలో కిమ్‌తో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో -అణ్వాయుధాలను ఉంచుకోవడం వల్ల ప్రయోజనం లేదనుకుంటే వాటిని నాశనం చేయడానికి తనకేమీ అభ్యంతరం లేదని ఉత్తరకొరియా అన్నట్లు దక్షిణ కొరియా చెబుతోంది.

ఫొటో సోర్స్, AFP
అన్నీ సక్రమంగా జరిగి చర్చలు ఫలిస్తే -ఉత్తర కొరియా అణ్వాయుధాలను త్యజించి, దక్షిణ కొరియా నుంచి అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం దక్షిణ కొరియాలో లక్షలాది మంది అమెరికా సైనికులున్నారు. అదంతా తమ దేశంపై యుద్ధం కోసమే అని ఉత్తర కొరియా అనుమానిస్తోంది.
గతంలో చర్చలు జరిగాయా?
చివరి సారిగా 2008లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆ ఏడాది అణు కార్యక్రమాలు నిలివేసిందో లేదో నిర్ధారించడానికి ఉత్తర కొరియా విదేశీ పర్యవేక్షకుల ప్రవేశాన్ని నిరాకరించింది.
అయితే ఉత్తరకొరియా గతంలో చర్చల సందర్భంగా తన అణ్వాయుధ పరీక్షలను నిలిపేసినా, ఫలితాలు తనకు అనుకూలంగా రావని అనుకున్న సందర్భంలో తిరిగి పరీక్షలు చేపట్టిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- అసలు న్యూక్లియర్ బటన్ ట్రంప్ వద్దే ఉంటుందా?
- ఆంక్షలకు లొంగేది లేదు: ఉత్తర కొరియా
- ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రొఫైల్
- ఉత్తర కొరియాకు మిత్రదేశాలు ఎన్ని?
- క్రీడల్లో భారత్ కంటే ఉత్తర కొరియానే ముందు!!
- ఉత్తర కొరియా క్రీడా చరిత్ర: ఒకసారి బాంబులు.. మరోసారి రాయబారాలు
- ఉత్తర కొరియాకు ఇంటర్నెట్ సేవలు ఎక్కడి నుంచి అందుతున్నాయి?
- ‘విదేశాలకు వెళ్లాలంటే వీసా చాలు.. ఉత్తర కొరియా వెళ్లాలంటే ధైర్యం కూడా కావాలి’
- దక్షిణ కొరియాలో తనిఖీలు చేస్తున్న కిమ్ జోంగ్ ‘మాజీ ప్రియురాలు’
- ఉత్తర కొరియాలో ఎక్కువగా తినే స్నాక్స్ ఇవే!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









