థాయ్‌లాండ్‌లో పురుషాంగాన్ని తెల్లగా మార్చే చికిత్స.. ఎందుకు అలా చేయించుకుంటున్నారు?

ఫొటో సోర్స్, LeLuxHospital
పురుషాంగాన్ని తెల్లగా మార్చుకోవాలనే ధోరణి ఇటీవల థాయ్‌లాండ్‌లో బాగా పెరిగింది. ఈ పరిణామాలు ఆ దేశ సౌందర్య పరిశ్రమను మరింత దూరం తీసుకెళ్తున్నాయి.
శరీరాన్ని తెల్లగా మార్చుకోవాలనే కోరిక ఆసియా దేశాలలో కొత్తేమీ కాదు. ఇక్కడ బయట పనిచేసేవారు నలుపురంగులో ఉండటం సర్వసాధారణంగా కనిపిస్తుంది.
ఇటీవల థాయ్‌లాండ్‌లోని ఓ ఆస్పత్రి పురుషాంగం తెల్లగా మార్చే ప్రక్రియపై ఆన్‌లైన్‌లో పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది.
అయితే, దీనిపై ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. ఆ విధానం సరికాదని హెచ్చరింది.
ఇలాంటి చికిత్స తీసుకుంటున్న యువకుడితో బీబీసీ థాయి మాట్లాడింది. 'మరింత ఆత్మవిశ్వాసంతో ఉండాలని అనుకుంటున్నా. అందుకే ఈ చికిత్స తీసుకుంటున్నా' అని ఆయన చెప్పారు.
'రెండు నెలల కిందట మొదటి సెషన్ పూర్తైంది, చికిత్స తర్వాత చాలా మార్పు కనిపించింది' అని తెలిపారు.

ఫొటో సోర్స్, LeluxHospital
దేనికోసం ఈ చికిత్స ?
సదరు ఆస్పత్రి తన ఫేస్‌బుక్ పేజీలో చికిత్స విధానాన్ని వివరించింది. పురుషాంగంపై మిలనిన్‌ను తొలగించేందుకు లేజర్ చికిత్స చేస్తామని అందులో తెలిపింది. రెండు రోజుల్లోనే ఆ ప్రకటన ఉన్న ఫేస్‌బుక్ పేజీ 19,000లకు పైగా షేర్ అయింది.
చికిత్స తర్వాత మార్పు ఎలా ఉంటుందో తెలిపేలా చిత్రాలను కూడా ఫేస్‌బుక్ పేజీలో అందుబాటులో ఉంచారు.
ఈ ఫేస్‌బుక్ ప్రకటనపై కామెంట్లు కూడా బాగానే వస్తున్నాయి. కొందరు ఈ విధానాన్ని విమర్శిస్తుంటే మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇంకొందరు ఇదంతా దేనికోసం అంటూ ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు మాత్రం...'ఈ చికిత్స తర్వాత దాన్ని టార్చ్‌లైట్‌గా వాడుకోగలం. వెలగనివ్వండి' అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు.
రంగు, ఆకృతి మార్చేస్తామని చెబుతున్న ఈ ప్రకటనను కొట్టిపారేసిన ఓ మహిళ దీనిపై స్పందిస్తూ.. ‘రంగు అంత ముఖ్యమైనదేమీ కాదు, పరిమాణం, కదలికలు బాగా లేకపోతేనే ఆందోళన చెందాలి' అని పేర్కొంది.
ఇలాంటి చికిత్స అందిస్తున్న థాయ్‌లాండ్‌లోని లెలక్స్ ఆస్పత్రి మార్కెటింగ్ మేనేజర్ పొపొల్ టన్సకుల్ బీబీసీతో మాట్లాడుతూ.. 'నాలుగు నెలల కిందట యోనిని తెల్లగా మార్చే చికిత్సను కూడా అందుబాటులోకి తెచ్చాం' అని తెలిపారు.
'చాలా మంది పురుషాంగం తెల్లగా మార్చే చికిత్స కావాలని అడుగుతున్నారు. అందుకే మేం దీన్ని ప్రారంభించాం. లేజర్ ట్రీట్మెంట్‌కు ఐదు సెషన్లు రావాల్సి ఉంటుంది. దీనికి రూ.41 వేలు ఖర్చు అవుతుంది' అని ఆయన చెప్పారు.
ప్రతినెలా ఈ ఆస్పత్రికి 20 నుంచి 30 మంది ఈ చికిత్స చేసుకునేందుకు వస్తున్నారు. కొందరైతే మయన్మార్, కాంబోడియా, హాంకాంగ్ నుంచి కూడా వస్తున్నారు.
'గే, స్వలింగ సంపర్కులే తమ రహస్య భాగాల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. అన్నీ అందంగా ఉండాలని వాళ్లు కోరుకుంటారు' అని పొపొల్ చెప్పుకొచ్చారు.

'అదసలు అవసరమే లేదు'
అయితే ఈ ఆస్పత్రి చికిత్సపై థాయ్‌లాండ్ ప్రజారోగ్య శాఖ స్పందించింది. ఇలాంటి చికిత్స వల్ల నొప్పి, దురదలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చని, పునరుత్పత్తి వ్యవస్థ, లైంగిక సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
చికిత్స పూర్తైన తర్వాత మళ్లీ రంగు మారి అసహ్యంగా తయారయ్యే అవకాశం లేకపోలేదని పేర్కొంది.
'అసలు పురుషాంగాన్ని తెల్లగా మార్చుకోవాల్సిన అవసరమే లేదు. డబ్బులు వృథా చేసుకోవడమే కాదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొనితెచ్చుకుంటారు' అని ఆరోగ్యశాఖకు చెందిన డాక్టర్ థొంగ్చాయ్ కిరాటీ హోతాయికోన్ ఒక ప్రకటనలో తెలిపారు.
మా ఇతర కథనాలు:
- వివాదాల్లో చిక్కుకున్న అందగత్తెలు
- 'మా ఆయన పోర్న్ చూస్తారు.. నన్నూ అలాగే చేయమంటారు’
- రివెంజ్ పోర్న్: అసభ్యకర చిత్రాలకు చెక్ పెట్టనున్న ఫేస్‌బుక్
- ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారి కోసం పది విషయాలు
- ప్రేమ - శృంగారం - వైకల్యం
- సెక్స్‌కూ గుండెపోటుకు సంబంధముందా?
- అభిప్రాయం: ఏది 'సెక్స్', ఏది 'రేప్'?
- నన్నురేప్ చేశారంటే ఎవరూ నమ్మలేదు
- అతన్ని రేప్ చేశారు
- ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- నగ్నత్వాన్నే నిరసన రూపంగా ఆమె ఎందుకు ఎంచుకున్నారు?
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
- కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- పొడవుంటే కేన్సర్ రిస్క్ ఎక్కువా?
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









