ఫిలిప్పీన్స్: టెంబిన్ తుపాను మిగిల్చిన విషాదం
దక్షిణ ఫిలిప్పీన్స్‌లో టెంబిన్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో పియాగపో, టబోడ్ నగరాలు వణికిపోతున్నాయి.
ఇప్పటి వరకు 200 మంది చనిపోయారు. మరికొందరి జాడ తెలియడం లేదు.

ఫొటో సోర్స్, Reuters
మిండనావో ద్వీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
పాలవాన్ ద్వీపాన్ని తాకిన తుపాన్.. అక్కడి నుంచి పశ్చిమ దిశగా కదులుతోంది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో టెంబిన్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది.

ఫొటో సోర్స్, AFP
టెంబిన్ ప్రభావం శుక్రవారం నుంచే మొదలైంది.
ననోడెల్ నోటే, ననోడెల్ సుర్ సహా పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
ననోడెల్ నోటేలోని దలామా గ్రామం వరదల్లో మునిగిపోయింది.
అక్కడి నది ఉప్పొంగడంతో ఊరికి ఊరే కొట్టుకుపోయిందని అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, AFP
సహాయ, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి.
బురదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
తుపాను, వరదలతో విద్యుత్, సమాచార వ్యవస్థ కుప్పకూలింది.
సహాయ చర్యలకు ఇది ఆటంకంగా మారింది.

ఫొటో సోర్స్, AFP/Getty Images
కొన్ని ప్రాంతాల్లో పిల్లలకు అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని మిండనావోలోని యూనిసెఫ్ ప్రతినిధి ఆండ్రూ మోరీస్ చెప్పారు.
వెంటనే వారికి సురక్షిత మంచి నీరు అందించడం ముఖ్యమని అన్నారు.
ఫిలిప్పీన్స్‌లో ననోడెల్ సుర్ పేద రాష్ట్రం.
మరావీలో ఇస్లామిక్ మిలిటెంట్లు, ప్రభుత్వ సైన్యానికి మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గత 7 నెలల కాలంలో 3,50,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారని బీబీసీకి చెప్పారు.
ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం ముఖ్యమని అన్నారు.

ఫొటో సోర్స్, AFP
టెంబిన్ తుపానుతో బాలబాక్ ద్వీపంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తుపాను పశ్చిమ దిశగా కదులుతూ మూడు రోజుల్లో దక్షిణ వియత్నాంను తాకుతుందని అంచనా వేస్తున్నారు.
వారం రోజుల క్రితమే కై-టక్ తుపాను ప్రభావంతో మధ్య ఫిలిప్పీన్స్‌లో కుండపోత వర్షాలు పడ్డాయి. వరదల్లో డజన్ల కొద్దీ చనిపోయారు.
2013లో వచ్చిన హయాన్ తుపాన్ నుంచి ఫిలిప్పీన్స్ ఇంకా కోలుకోలేదు. ఆ తుపానులో 5000 మంది చనిపోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
మా ఇతర కథనాలు :
- నగ్నత్వాన్నే నిరసన రూపంగా ఆమె ఎందుకు ఎంచుకున్నారు?
- రాయలసీమ అంటే హింస, వెన్నుపోట్లు, రక్తదాహం: వర్మ
- అండర్ గ్రౌండ్లో ఆవాల సేద్యం
- ఢమాల్: ఒక్క రోజులో మూడోవంతు కోల్పోయిన బిట్ కాయిన్
- దిల్లీలో ‘రేపిస్ట్ బాబా’... కలవరపెడుతున్న నిజాలు!
- కాలుష్యాన్ని కాల్చేస్తుంది!
- 'సెక్సీయెస్ట్ డాన్స్'.. మీరూ ఓ స్టెప్ వేస్తారా!
- 'నేనొస్తే... '
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









